Page 1

FEBRUARY 2017 VOL 14 ISSUE 2

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET


 అ

క్కినేని నాగచైతన్య - సమంత ల వివాహ నిశ్చితార్థం జనవరి 29న సాయంత్రం హైదరాబాద్ లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది . ఈ వివాహ నిశ్చితార్థం ని అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా అక్కినేని నాగార్జున ప్రకటించాడు అంతేకాదు మా అమ్మ ( మనం సినిమాలో సమంత నాగ్ కి అమ్మగా నటించిన విషయం తెలిసిందే ) నా కూతురు అయ్యింది అంటూ ట్వీట్ కూడా పెట్టాడు నాగార్జున . నాగచైతన్య నాగ్ పెద్ద కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ముందుగా చిన్న కొడుకు అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది . తకొంత కాలంగా చైతూ - సమంత లు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే . మొత్తానికి ఇన్నాళ్ల ప్రేమ కథ కి ఎంగేజ్ మెంట్ తో అధికారిక ముద్ర పడింది , ఇక తరువాయి ఘట్టం పెళ్లి . ఏ మాయ చేసావే చిత్రంలో తొలిసారిగా కలిసి నటించిన ఈ జంట ఆ తర్వాత ఆటోనగర్ సూర్య , మనం చిత్రాల్లో జంటగా నటించారు . చైతూ - సమంత ల వివాహ నిశ్చితార్థం జరగడంతో అక్కినేని కుటుంబం తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు .


“BEAUTY IS THE OPPOSITE OF PERFECTION – IT’S ABOUT CONFIDENCE, CHARISMA AND CHARACTER.” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By

: : : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 FEBRUARY 2017

టాలీవుడ్ P 3






కిలీ', 'డా|| సలీం', 'బిచ్చగాడు' వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన విజయ్‌ ఆంటోని తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. ఫాదర్‌ సెంటిమెంట్‌తో పొలిటికల్‌, యాక్షన్‌ ధ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమం జనవరి 25న హైదరాబాద్‌రామానాయుడు ప్రివ్యూ ధియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ముఖ్య అతిథిగా హాజరై 'యమన్‌' ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో విజయ్‌ ఆంటోని, లైకా ప్రొడక్షన్స్‌ రాజా, ద్వారకా క్రియేషన్స్‌ అధినేత మిర్యాల రవీందర్‌రెడ్డి, సమర్పకులు మిర్యాల సత్యనారాయణ రెడ్డి, పాటల రచయిత భాషశ్రీ, ప్రముఖ నిర్మాత కాశీ విశ్వనాధ్‌, చిత్ర నిర్మాత రవీందర్‌రెడ్డి సోదరులు కృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. త్ర నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ''విజయ్‌ ఆంటోని ఒక టెక్నీషియన్‌గా గుర్తింపు తెచ్చుకొని ఆర్టిస్టుగా 'డా|| సలీం', 'నకిలీ', 'బిచ్చగాడు'తో సూపర్‌హిట్స్‌ సాధించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఫిబ్రవరిలో శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌చేయడానికి ప్లాన్‌చేస్తున్నాం'' అన్నారు. కా ప్రొడక్షన్స్‌ ప్రతినిధి రాజా మాట్లాడుతూ - ఈ బ్యానర్‌లో బిగ్‌ బడ్జెట్‌ చిత్రాలతో పాటు స్మాల్‌ బడ్జెట్‌ చిత్రాలు నిర్మించాలని అనుకున్నాం. విజయ్‌ ఆంటోని మంచి మిత్రుడు. డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ సక్సెస్‌ సాధిస్తున్నాడు. జీవశంకర్‌ స్క్రిప్ట్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుండడంతో ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించాం. స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ చిత్రం ఉంటుంది'' అన్నారు.

చి లై

4 P టాలీవుడ్

చయిత భాషాశ్రీ మాట్లాడుతూ - ''బిచ్చగాడు', 'భేతాళుడు' చిత్రాలకు మాటలు, పాటలు రాశాను. ఆ రెండు చిత్రాలతో విజయ్‌ ఆంటోని గారితో మంచి ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడింది. అశోక్‌ చక్రవర్తి క్యారెక్టర్లో ‌ హీరో విజయ్‌ ఆంటోని పర్ఫామెన్స్‌ ఇరగదీశాడు. ధర్మ సంస్ధాపన కోసం ఆనాటి అశోకుడు శత్రువులను చీల్చిచెండాడాడు. ఈ 'యమన్‌' చిత్రంలో ఈ అశోకుడు ఎవర్ని శిక్షించాడు అనేది చిత్ర కధ. న్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ మాట్లాడుతూ ''మదర్‌ సెంటిమెంట్‌తో రూపొందిన 'బిచ్చగాడు' చిత్రం బిగ్‌హిట్‌అయింది. ఇప్పుడు ఫాదర్‌సెంటిమెంట్‌తో విజయ్‌ఆంటోని చేసిన 'యమన్‌' చిత్రం కూడా 'బిచ్చగాడు' కంటే పెద్ద హిట్‌కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త డైరెక్టర్‌ ఎవరైనా కథచెప్పినా అందులో కొంచెం బాగున్నా ఆ డైరెక్టర్‌కి అన్ని ఫెసిలిటీస్‌ కల్పించి ఎంకరేజ్‌ చేస్తారు. అందుకు విజయ్‌ ఆంటోనిని అభినందిస్తున్నాను. మ్యూజిక్‌ డైరెక్టర్గా ‌ భయపడి ఉండి వుంటే విజయ్‌ ఆంటోని హీరో అయి వుండేవాడు కాదు. కొత్త డైరెక్టర్స్ని ‌ ఇంట్రడ్యూస్‌ చేస్తూ సినిమాలు చేస్తున్న విజయ్‌ ఆంటోనికి నా ధన్యవాదాలు. రో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ ''వినాయక్‌గారు ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు తీశారు. రీసెంట్‌గా 'ఖైదీ నంబర్‌ 150'తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. మా చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేయడానికి వచ్చిన వినాయక్‌ గారికి నా థాంక్స్‌. ఇది నా ఆరవ చిత్రం. పొలిటికల్‌రివెంజ్‌డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో డబుల్‌ రోల్‌ క్యారెక్టర్స్‌ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన లైకా ప్రొడక్షన్స్‌ రాజా, మిర్యాల రవీందర్‌రెడ్డి గారికి నా థాంక్స్‌'' అన్నారు.

సె

హీ


 

జి

బం

చి

జి

ద‌

.ఆర్కే ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో డికొండ దుష్యంత్ కుమార్ , జి.రామ‌కృష్ణ నిర్మాత‌లుగా ఘ‌ర‌లకంఠ మ‌ద్దేటి శ్రీనివాస్ ద‌ర్శక‌ త ‌ ్వంలోరూపొందిన చిత్రం `గీతాపురి కాల‌నీ`. రామ్ చ‌రణ్ ‌ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్ర ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఇటీవ‌ల హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్రమా ‌ నికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత చంద్ర‌బోస్ తొలి సీడీ ఆవిష్క‌రించారు. నంత‌రం చంద్ర‌బోస్ మాట్లాడుతూ...``పాట‌ల‌న్నీ ముందే విన్నాను. నాకు రెండు పాట‌లు విప‌రీతంగా న‌చ్చాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్య విలువ‌లు కూడా ఉన్నాయి. పాట‌లు విన్నాక‌, ట్రైల‌ర్ చూశాక సినిమా క‌థ ఊహించ‌ని విధంగా అనిపించింది. క‌చ్చితంగా చూడాల‌న్న‌ఉత్సుక‌త క‌లిగింది. ఈ యూనిట్ సభ్యులంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల``న్నారు. .ఆర్కే ఫిలింస్ అధినేత రామ‌కృష్ణ మాట్లాడుతూ...``నేను గ‌తంలో చేసిన `గంగపుత్రులు` చిత్రానికి నంది, జాతీయ పుర‌స్కారాలు ల‌భించాయి. ముఖ్యంగా త‌ల్లిదండ్ర‌లు పిల్లల్ని స‌రిగ్గా పెంచ‌క‌పోతే పిల్ల‌ల భ‌విష్య‌త్ మాత్రమే పాడ‌పోవ‌డం కాకుండా మొత్తం దేశ‌మే పాడైపోతుంద‌న్న అంశం నాకు బాగా న‌చ్చింది. అందుకే నా బేన‌ర్ లో చేసుకొమ్మని ‌ ద‌ర్శక నిర్మ‌త‌లతో ‌ చెప్పాను. మా అబ్బాయి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర చేశాడు. ద‌ర్శకు ‌ డు, నిర్మాత ఈ సినిమా కోసం ఎంతో శ్ర‌మించారు. వారి శ్ర‌మకు ‌ త‌గ్గ ఫ‌లితం క‌చ్చితంగా ల‌భిస్తుంది. సంగీత ద‌ర్శకు ‌ డు రామ్ చ‌ర‌ణ్ అద్భుతమై ‌ న పాట‌లిచ్చాడ‌న్నారు.

దూక్ `చిత్ర ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ చౌద‌రి మాట్లాడుతూ..``నేను డైర‌క్ట్ చేసిన `బందూక్` సినిమాలో దుష్యంత్ మంచి పాత్ర చేశాడు. అప్ప‌టి నుంచి త‌న‌తో రిలేష‌న్ ఏర్ప‌డింది. ఈ సినిమాలో త‌ను కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తూ.. నిర్మించ‌డం విశేషం. పాట‌లు, ట్రైల‌ర్స్ బావున్నాయి. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు. త్ర నిర్మాత డికొండ దుష్యంత్ కుమార్ మాట్లాడుతూ... సినిమా అంటే నాకెంత పిచ్చి, క‌సి ఉన్నాయో మా డైర‌క్ట‌ర్ లో కూడా అవి క‌నిపించ‌డంతో ఈ సినిమా చేసే బాధ్య‌త త‌న చేతిలో పెట్టాను. సినిమా ప‌ట్ల పాష‌న్ ఉన్న‌టెక్నీషియ‌న్స్ , ఆర్టిస్టులను తీసుకుని ఈ సినిమా చేశాం. రామ్ చ‌రణ్ ‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి ప‌ని చేశారు. అందుకే ఇంత మంచి పాట‌లొచ్చాయన్నారు. ర్శ‌కుడు ఘ‌ర‌లకంఠ మ‌ద్దేటి శ్రీనివాస్ మాట్లాడుతూ...``నిర్మాత దుష్యంత్ గారు లేకుంటే ఈ సినిమా లేదు. ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ఎవ‌రి ద‌గ్గ‌ర ప‌ని చేయ‌కున్నా నా మీద‌, నా క‌థ మీద న‌మ్మ‌కంతో ఈ సినిమా చేసే అవ‌కాశం ఇచ్చారు. ఇక ఈ సినిమా క‌థ విష‌యానికొస్తే...` గీతాపురి కాలనీ`లో జ‌రిగే ఐదు క‌థ‌ల స‌మాహార‌మే ఈ చిత్రం. ప్ర‌తి ఒక్కరికీ ఏదో ఒక చోట తార‌స‌ప‌డ్డ పాత్ర‌లే ఇందులో ఉంటాయి. ఐదుగురి పిల్ల‌ల్లో రాంకీ గారి అబ్బాయి కూడా ఒక కీల‌క పాత్ర‌లో న‌టించాడు. భ‌ద్రాచ‌లం, పాల్వంచ ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. కెమెరా ప‌నిత‌నం, సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు. ఈ అవ‌కాశం క‌ల్పించిన మా నిర్మాత‌కు కృత‌జ్ఞత ‌ ‌ల‌``న్నారు.

టాలీవుడ్ P 5




మూ

వీ ఆర్టిస్టుల సంఘం అధికారిక డైరీ `మా డైరీ-2017`ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల‌ ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల `మా` మెంబ‌ర్స్ అంతా క‌లిసి తెలంగాణ రాష్ట్ర‌ సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కు కొత్త డైరీని అంద‌జేశారు. `మా`అధ్య‌క్షులు డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, `మా` ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివాజీరాజా, మా మెంబ‌ర్ ఏడిద శ్రీరామ్, `సంతోషం` అధినేత సురేష్ కొండేటి స‌మ‌క్షంలో డైరీని అందించారు.

 



హీ

రోయిన్ పారుల్ యాదవ్ పై కుక్కల దాడి జరిగింది . ఈ దారుణ సంఘటన ముంబై లోని జోగేశ్వర్ రోడ్ లో ఇటీవల జరిగింది . ప్రస్తుతం ముంబై లోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది పారుల్ యాదవ్ . తన పెంపుడు కుక్క ని తీసుకొని వాకింగ్ వెళ్లిన సమయంలో వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా పారుల్ యాదవ్ కుక్క మీద దాడి చేసాయి . అయితే తన కుక్క ని కాపాడటానికి పారుల్ యాదవ్ సాహసానికి పూనుకోవడంతో కుక్కల గుంపు కాస్త కుక్క ని పక్కన పెట్టేసి పారుల్ పై దాడి చేసాయి . కుక్కల దాడిలో పారుల్ యాదవ్ కు తల , చేతులు , కాళ్ళ భాగాలలో గాయాలు అయ్యాయి . దారుణ సంఘటన ఇటీవల జరిగినప్పటికీ ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది . తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పారుల్ యాదవ్ పట్ల పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తం అవుతోంది

ఈ 6 P టాలీవుడ్


 కృ

ష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, సూర్య శ్రీనివాస్ , మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులుగా బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా .. చిత్ర ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్‌లో రూపొందుతున్న ఓ పిల్లా నీ వ‌ల్లా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ల‌వ్, కామెడి, యాక్ష‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్ స‌హా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ స‌పోర్ట్ తో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌లిగాం. మ‌ధు పొన్నాస్ సంగీతం, షోయ‌బ్ అహ్మద్ ‌ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేసి, సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం`` అన్నారు. ష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా, సూర్య శ్రీనివాస్, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ చిన్ని మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, యాక్ష‌న్ః మార్షల్ ‌ ర‌మ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫీః షోయబ్ అహ్మద్ ‌ కె.ఎం., ఎడిట‌ర్ః అనిల్ కింతాడ‌, కోరియేగ్రాఫి : జితేంద్ర సంగీతంః మ‌ధు పొన్నాస్‌, సహా నిర్మాత : మౌర్య నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శక‌ ‌త్వంః కిషోర్‌.



కృ

టాలీవుడ్ P 7




ఓం

శ్రీ క్రియేషన్స్‌బ్యానర్‌పై అనిల్‌కుమార్‌, శృతిలయ హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతూ.. ఎం.ఎన్‌. బైరారెడ్డి మరియు నాగరాజు నిర్మాతలుగా ఆర్‌. కె.గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని, షూటింగ్‌ అనంతర కార్యక్రమాలకు సిద్దమవుతోంది. షూటింగ్‌ పూర్తయిన విషయాన్ని తెలిపేందుకు చిత్ర యూనిట్‌ ప్రెస్‌మీట్‌ని నిర్వహించింది. హీరో అనిల్‌కుమార్‌తో పాటు నటులు సుమన్‌, జీవా, రాజేంద్ర, సంగీత దర్శకుడు ఘంటాడి క్రిష్ణ, నిర్మాతలు ఎం.ఎన్‌.బైరారెడ్డి, నాగరాజులు మరియు దర్శకుడు ఆర్‌.కె. గాంధీ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో 1970లో జరిగిన యధార్ధ ఘటనని ఆధారంగా చేసుకుని దర్శకుడు ఆర్‌.కె.గాంధీ ఈ చిత్రానికి చక్కని కథని రూపొందించారు. ఆసక్తికరంగా సాగే స్క్రీన్‌ప్లేతో పాటు మంచి సంభాషణలతో కూడా ఆర్‌.కె.గాంధీ మెప్పిస్తారు. ప్రస్తుతం షూటింగ్‌మొత్తం పూర్తయింది. 70 శాతం షూటింగ్‌ అనంతపురం జిల్లా భద్రపట్నంలో చిత్రీకరించాము. మిగతా భాగం కర్నాటకలోని కొన్ని ప్రాంతాలలో చిత్రీకరించాము. కన్నడ సినీ ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలో ఘంటాడి క్రిష్ణగారు స్వరపరిచిన ఆడియోని విడుదల చేస్తాము..అని అన్నారు.

8 P టాలీవుడ్

నిల్‌కుమార్‌, శృతిలయ, సుమన్‌, షఫి, జీవా, కవిత, సుమన్‌శెట్టి, రాజేంద్ర, గోపీకర్‌ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి క్రిష్ణ, కెమెరా: ప్రమోద్‌. ఆర్‌, సాహిత్యం: రాం పైడిశెట్టి, ఘంటాడి క్రిష్ణ, ఆర్ట్‌: బాబు, స్టంట్స్:‌ శంకర్‌, కొరియోగ్రఫీ: ఎస్‌.ఎస్‌.కె. సందీప్‌, పి.ఆర్‌.ఓ: వీరబాబు, మేనేజర్‌: వినయ్‌, నిర్మాతలు: ఎం.ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు; కథ-చిత్రకథ-మాటలు-దర్శకత్వం: ఆర్‌.కె.గాంధీ.






రి

చా పనాయ్, 'బాహుబలి' ప్రభాకర్, బ్రహ్మానందం, కాట్రాజు, బ్రహ్మాజీ,ధనరాజ్, నందు ముఖ్య తారలుగా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం లో సుఖీభవ మూవీస్ పతాకంఫై గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం 'రక్షక భటుడు'. ఇప్పటికి 60 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది.ఈ సందర్భం గా దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ - " క్రేజీ కథాంశంతో క్రేజీ క్రేజీగా ఈ సినిమా రూపొందుతోంది.నేను ఇంతకు ముందు డైరెక్ట్ చేసిన 'రక్ష' , 'జక్కన్న' చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ కథాంశం ఉంటుంది.ఇందులో ఓ స్పెషల్ స్టార్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.ఇటీవల మేము విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఆంజనేయస్వామి ముఖంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరో చెప్పమంటూ చాలా మంది క్యూరియాసిటీ ప్రదర్శించారు. ఆ పాత్రను పోషించిన స్పెషల్ స్టార్ ను సినిమా రిలీజ్ వరకూ సస్పెన్సుగా ఉంచదలిచాం" అని తెలిపారు. నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ - "ఈ సబ్జెక్ట్ వినగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. వెంటనే ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాను. ఇండస్ట్రీలోని ముఖ్య తారలంతా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి ప్రథమార్ధం లో జరిపిన షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు, ఇంటర్వెల్

ఎపిసోడ్స్ చిత్రీకరించాము. ఫిబ్రవరి లో జరిపే షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుంది." అని చెప్పారు. 'అదుర్స్' రఘు , 'చిత్రం' శీను, గురురాజ్, సత్తన్న, జ్యోతి, కృష్ణేశ్వర రావు, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : మల్హర్ భట్ జోషి, సంగీతం: దినేష్, ఆర్ట్స్: రాజీవ్ నాయర్, ఎడిటింగ్ :అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, నిర్మాత: గురురాజ్, రచన -దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల

టాలీవుడ్ P 9


 



ఒం

టి మీదకు 62 ఏళ్ల వయసు వచ్చింది కానీ ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అన్నట్లుగా వ్యవహరిస్తోంది హాట్ భామ సీనియర్ నటి రేఖ . దక్షిణాది కి చెందిన ఈ భామ ఉత్తరాది కి వెళ్లి అక్కడ జెండా పాతడమే కాకుండా ఇప్పటికి కూడా ట్రెండ్ క్రియేట్ చేస్తూనే ఉంది స్టైలింగ్ లో . వరల్డ్ వైడ్ గా ఎప్పటికప్పుడు వస్తున్న స్టైలింగ్ ట్రెండ్ ని ఫాలో అవుతూ 62 ఏళ్ల వయసులో కూడా కుర్రకారు కి షాక్ ఇస్తోంది రేఖ . తాజాగా ఓ ప్రీమియర్ షోకి వచ్చిన రేఖ ని చూసి అందరూ షాక్ అయ్యారు . చినిగి పోయిన జీన్స్ వేసుకొని కళ్ళకు పెద్ద కళ్ళజోడు పెట్టుకొని పిచ్చిలేపింది . ఖ వయసు 62 కానీ 20 ఏళ్ల అమ్మాయిలా కట్ జీన్స్ అందునా తొడల భాగంలో కట్ జీన్స్ వేసుకొని వచ్చి మతి పోగొట్టింది . రేఖ అంటేనే ట్రెండ్ సెట్టర్ అనే విషయం ఆ జనరేషన్ కు బాగానే తెలుసు కానీ ఇప్పటి జనరేషన్ కు అంతగా తెలియదు కదా ! అందుకేనేమో ఈ లేటు వయసులో కూడా ఘాటుగా దర్శనం ఇచ్చి షాక్ ఇస్తోంది .

రే

10 P టాలీవుడ్


పా



పం ఇలియానా ఎంతగా బరితెగించి అందాలు ఆరబోసినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు , అయినప్పటికీ ఎప్పటి కప్పుడు రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తూనే ఉంది . ఇప్పటికే బికినీ లో వీరంగం వేసిన ఈ భామ ఆమధ్య సెక్స్ గురించి , బాయ్ ఫ్రెండ్స్ గురించి రకరకాల హాట్ టాపిక్స్ మాట్లాడి సంచలనం సృష్టించింది . అయితే ఈ భామ ఎలా చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాజాగా నగ్నం గా బాత్ టబ్ లో దర్శనం ఇవ్వడమే కాకుండా దాన్ని ఫోటో తీయించి మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దాంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు . లుగులో టాప్ స్టార్ గా వెలుగొందింది ఇలియానా కానీ కొన్నాళ్ల తర్వాత తెలుగు సినిమాలు వద్దు బాలీవుడ్ ముద్దు అంటూ ఇక్కడి సినిమాలను నిర్లక్ష్యం చేసి ఉత్తరాది బాట పట్టింది ఈ గోవా భామ పాపం ఎంతగా అందాలు ఆరబోసిన ఛాన్స్ లు మాత్రం అంతగా కలిసి రావడం లేదు .

తె

టాలీవుడ్ P 11


బా

లీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది . పులకిత్ సామ్రాట్ -శ్వేతా రోహిరా భార్యాభర్తలు కాగా హీరోయిన్ యామి గౌతమ్ వల్ల పులకిత్ సామ్రాట్ తన భార్య కు విడాకులు ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు . అయితే శ్వేతా రోహిరా మాత్రం భర్త తో కలిసి ఉండాలనే అనుకుంటోంది కానీ పులకిత్ మాత్రం భార్య కు విడాకులు ఇవ్వడానికే మానసికంగా సిద్ధపడ్డాడు . ముంబై లోని బాంద్రా కోర్టు కి హాజరై తిరిగి వెళుతున్న సమయంలో పులకిత్ సామ్రాట్ ని ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారు . అయితే ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుండటంతో ఒక్కసారిగా పులకిత్ కు ఆవేశం తన్నుకు వచ్చింది . తే ఒక ఫోటోగ్రాఫర్ కాలర్ పట్టుకొని అతడిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు . ఇప్పుడు ఆ ఫోటోలు మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి . ఇప్పటికే హీరోయిన్ యామి గౌతమ్ నా కాపురంలో నిప్పులు పోసిందని పులకిత్ భార్య ఆరోపిస్తుండగా తాజాగా ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన సంఘటన తో మరో వివాదంలో ఇరుక్కున్నాడు పులకిత్ సామ్రాట్ .

అం



12 P టాలీవుడ్


         

యాం

కర్ సుమ పై పెద్ద అభాండం వేసాడు ప్రముఖ రచయిత , దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ . హైదరాబాద్ లో జరిగిన ఆడియో వేడుకలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ సుమ పెద్ద అబద్దాల కోరు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు . అయితే విజయేంద్ర ప్రసాద్ అంత మాట అనడంతో సుమ తో పాటు అక్కడున్న ఆహూతులంతా షాక్ అయ్యారు కట్ చేస్తే తను ఎందుకు సుమని అంత మాట అనాల్సి వచ్చిందో విడమరిచి చెప్పాడు విజయేంద్ర ప్రసాద్ . తకీ సుమ ని అంత మాట ఎందుకు అన్నాడో తెలుసా ...... సాధారణంగా సుమ యాంకర్ కాబట్టి ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ కి డబ్బులు తీసుకుంటుంది కాబట్టి ప్రతీ ఒక్కరిని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తుంది . అసాధారణ రీతిలో అబద్దాలు ఆడుతుంది అందుకే అబద్దాల కోరు అని అంటున్నాడు ఇక నేను కూడా అబద్దాల కోరునే అయితే నన్ను మించిన అబద్దాల కోరు సుమ అని అంటున్నాడు విజయేంద్ర ప్రసాద్ .

ఇం

టాలీవుడ్ P 13






గో

విందుడు అందరి వాడేలే , ధృవ చిత్రాలతో ప్రయోగాల బాట పట్న టి రాంచరణ్ తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి తెరలేపుతున్నాడు . ఇప్పటివరకు బాండ్ చిత్రాలు అంతగా ఇటీవల కాలంలో తెలుగులో రాలేదు . 70 వ దశకంలో వచ్చాయి జనాదరణ పొందాయి ,సూపర్ స్టార్ కృష్ణ , తండ్రి మెగాస్టార్ చిరంజీవి లు జేమ్స్ బాండ్ పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు . అయితే తెలుగులో బాండ్ చిత్రాలు అంతగా రావడం లేదు కానీ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత చరణ్ జేమ్స్ బాండ్ గా నటించడానికి సమాయత్తం అవుతున్నాడు . అది కూడా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సంచలన చిత్రాన్ని అందించిన క్రిష్ దర్శకత్వంలో చరణ్ జేమ్స్ బాండ్ గా కనిపించనున్నాడట . ష్ చరణ్ కు మంచి ఫ్రెండ్ కూడా అయినప్పటికీ ఈ ఇద్దరి కాంబినేషన్ మాత్రం ఇప్పటివరకు సెట్ కాలేదు గతకొంత కాలంగా ఈ ఇదరూ ్ద కలిసి సినిమా చేయాలనీ భావిస్తున్నారు మొత్తానికి సుకుమార్ సినిమా తర్వాత చరణ్ - క్రిష్ ల కాంబినేషన్ లో తెరకెక్కే జేమ్స్ బాండ్ సినిమా పట్టాలెక్క నుంది .

క్రి

14 P టాలీవుడ్


             ఔ  త్సాహిక దర్శకుడు వై ఎస్ చంద్ర తెలుగు సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చేసిన సందేశాత్మక ప్రయోగమే '' కామన్ మాన్ '' . రైతులు ,విద్యార్థులు , పిల్లల సమస్యలను ఇతివృత్తంగా ఎంచుకొని కార్పొరేట్ వ్యవస్థ మనసు పెడితే అద్భుతాలు ఎలా ఆవిష్కరింపబడతాయో తెలియజెప్పే సందేశంతో హృదయానికి హత్తుకునేలా రూపొందించాడు చంద్ర . కామన్ మాన్ తల్చుకుంటే ఈ సొసైటీ కి ఏమి చేయగలడో మరింతగా ధృడంగా చెప్పాడు దర్శకుడు చంద్ర . ఇక విజువల్స్ కూడా చాలా బాగున్నాయి . గ్రాఫిక్ వర్క్ కూడా బాగుంది . దర్శకుడి ఆలోచనకు తగ్గట్లుగా విజువల్స్ ఇవ్వడంలో డి ఓ పి సురేష్ సక్సెస్ అయ్యాడు . అలాగే స్కై 9 ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి . హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో వేసిన ప్రీమియర్ షోకి అనూహ్య స్పందన వచ్చింది . పెద్ద ఎత్తున తరలివచ్చిన స్కై 9 ప్రొడక్షన్స్ సన్నిహితులు

కామన్ మాన్ షో చూసి దర్శక నిర్మాతలను నటీనటులను పొగడ్తలతో ముంచెత్తారు . ప్రీమియర్ షోకి అద్భుతమైన స్పందన రావడంతో కామన్ మాన్ యూనిట్ చాలా సంతోషంగా ఉంది . వై ఎస్ చంద్ర దర్శకత్వంలో వై . సునీత నిర్మించిన ఈ చిత్రంలో ప్రవీణ్ యండమూరి ,సంజయ్ , నాగయ్య తాత , మనోహర్ మను , సావీర్ మున్నా , యోగి కుమార్ , వెంకటేష్ కార్తీక్ , సాయి కుమార్ , గురుచరణ్ కోడూరు , సుస్మితా చౌదరి , రఘునాథ్ ఆకాశం , ప్రభాకర్ డి మంగిన , రాఘవ్ మూలుగు ,లక్కీ కుమార్ , రమేష్ బాబు , తేజ , ఈశ్వర్ , కర్ణ రాజీవ్ , బబ్లూ తదితరులు నటించారు .

టాలీవుడ్ P 15


 గా

యని గా చెరగని ముద్ర వేసిన సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న విషయం కూడా తెలిసిందే . తెలుగులో పలువురు హీరోయిన్ లకు గాత్ర దానం చేసింది సునీత . అయితే లక్కీ గా బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సునీత కు 750 వ చిత్రం కావడం విశేషం . గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం లో హీరోయిన్ శ్రియా శరన్ కు గాత్రదానం చేసింది సునీత . శ్రియా శరన్ కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది . అలాగే ఆమె డైలాగ్స్ కి కూడా మంచి అప్లజ్ వస్తోంది . దాంతో సునీత చాలా సంతోషంగా ఉంది . యని గా వేలాది పాటలు పాడిన ఈ భామ ఆమధ్య రెండు పాటల్లో నటించింది కూడా . బాలయ్య సినిమాలో నేనూ ఓ భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తోంది . సంక్రాంతి బరిలో దిగిన బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే .

గా

16 P టాలీవుడ్


త్వ



రగా పెళ్లి చేసుకోవాలి , సుఖ సంసారంలో తేలి యాడాలి పిల్లలను కనాలి అని తెగ తహతహలాడిందట హీరోయిన్ రాశిఖన్నా . అయితే ఈ ముచ్చట ఇప్పటిది కాదు రెండు మూడేళ్ళ క్రితం మాట అన్నమాట . ఎప్పుడు 23 ఏళ్ళు ఒంటి మీదకు వస్తాయా ? ఎప్పుడు పెళ్లి చేసుకుంటానా ? ఎప్పుడు విరహ తాపాన్ని తీర్చుకుంటానా ? అని తెగ ఆలోచనలు చేసేదట . సంసారం , మొగుడు , పిల్లలు అంటూ రకరకాలుగా ఆలోచించేదట రాశిఖన్నా . అయితే ఎప్పుడైతే హీరోయిన్ గా మారిందో , కాస్త సక్సెస్ లు వస్తున్నాయో అప్పటి నుండి మాత్రం తన మైండ్ సెట్ మారిపోయిందట . యితే ఇప్పుడు హీరోయిన్ గా బిజీ గా ఉంది కాబట్టి అలాంటి ఆలోచనలు లేవంట ! పైగా అప్పటి ఆలోచనలు తల్చుకుంటే సిగ్గేస్తోంది , నవ్వొస్తోంది ఎందుకు మెచ్యూర్డ్ గా ఆలోచించ లేకపోయానో అర్ధం కాలేదని నవ్వుకుంటోంది రాశి ఖన్నా . మరో విశేషం ఏంటంటే ఇప్పుడు సినిమా తప్ప పెళ్లి గురించిన ఆలోచన లేదట ఈ భామకు .

టాలీవుడ్ P 17






క్సర్ సైజ్ చేస్తున్నాను , మరింత ఫిట్ కోసం అంటూ ఆమె ఫిట్ నెస్ మాట ఏమో కానీ అందాలన్నీ చూపిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది చిరుత ఫేమ్ నేహా శర్మ . ఒక్క నేహా శర్మ మాత్రమే కాదు ఆమె చెల్లెలు సైతం ఎక్సర్ సైజ్ చేస్తూ కనువిందు చేసింది . చేసేది ఎక్సర్ సైజ్ ఇక వేసుకున్న బట్టలు అందాలన్నీ బయటకు కనిపించేలా , తొంగి చూడకుండానే కనిపించేలా వేసుకొని మరీ ఫిట్ నెస్ కోసం ఒళ్ళు వంచి కష్టపడుతున్నారు .

18 P టాలీవుడ్

ఒళ్ళు వంచి కష్టపడుతుంటే అందాలన్నీ వెలుగులోకి వచ్చి కావలసినంత మజా అందిస్తున్నాయి కుర్రకారు కి . గా వ్యాయామం చేస్తున్న సమయంలో వీడియో కూడా తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఆ వీడియో మరింతగా వైరల్ గా మారింది . తెలుగులో చిరుత చిత్రంలో చరణ్ సరసన నటించింది నేహా శర్మ కానీ ఆ భామ అనుకున్నంతగా అవకాశాలు రాకపోవడంతో ఇలా అందాల ఆరబోత కు దిగుతోంది .

పై


 కా

రులో షికారు కెళితే చిత్రంతో హిట్ కొడతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు . గులాబీ చిత్రంతో దర్శకుడి గా పరిచయమైన మాదాల కోటేశ్వర రావు తొలిచిత్రమే సందేశాత్మక చిత్రం చేసి మంచి ప్రయత్నమే చేసాడు .ఇక ఇప్పుడు మలి ప్రయత్నంగా హర్రర్ కథాంశాన్ని ఎంచుకొని మూడు జంటల మధ్య జరిగే సన్నివేశాలతో '' కారులో షికారు కెళితే '' చిత్రాన్ని రూపొందించాడు . తన మిత్రుల సహకారంతో ఈ చిత్రాన్ని రూపొందించిన మాదాల ఫిబ్రవరి 10న ఆ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు యితే చిన్న సినిమాలను రిలీజ్ చేయడం గగనమై పోతున్న ఈ రోజుల్లో ఎంతో శ్రమకోర్చి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు . మిత్రులు మధు , అనీష్ , అభిరాం ల అండదండలతో కారులో షికారు కెళితే చిత్రాన్ని వినోద భరితంగా రూపొందించానని తప్పకుండా హిట్ కొడతానన్న ధీమా వ్యక్తం చేసాడు దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు . హర్రర్ కథాంశం తో తెరకెక్కిన చిత్రాలు విజయాలు సాధిస్తుండటంతో కారులో షికారు కెళితే చిత్ర విజయం పై నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర యూనిట్ .


          హా

ట్ భామ శ్రియా శరన్ లాంగ్ ఫ్రాక్ ని మోకాళ్ళ పైకి లేపి మరీ ఫోజు కొడుతూ ఫోటోలకు ఫోజు ఇస్తూ సంచలనం సృష్టించింది . 30 ప్లస్ ఏజ్ లో సెగలు రేపుతున్న శ్రియా ఇటీవలే బాలయ్య సరసన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది . శ్రియా నటన గురించి ప్రశంసలు లభిస్తున్న సమయంలో లాంగ్ ఫ్రాక్ ని పైకి లేపి కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది . డపా దడపా క్లీవేజ్ షో చేస్తూ నేనున్నాను అంటూ కాక రేపుతున్న ఈ భామ తాజాగా లాంగ్ ఫ్రాక్ లో కుర్రాళ్ల మతి పోగొట్టింది .

టాలీవుడ్ P 23




లా



వోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై శ్రీ, ఎస్తేర్, నోయ‌ల్ ,అర్జున్ మీన‌న్ ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కృష్ణ‌మోహ‌న్, న‌రేన్, శ్రీరామ్ కందుకూరి నిర్మాత‌లు. క్రాంతి వడ్ల‌మూడి ద‌ర్శ‌కుడు. షెడ్యూల్ చివ‌రి రోజున చిత్ర సెట్ లో యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొనగా ‌ హీరో శ్రీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ...``ప్ర‌ధాన తారాగ‌ణమంతా పాల్గొనగా ‌ తొలి షెడ్యూల్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించాము. `స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా సాగే చిత్ర‌మిది. త్వ‌రలో ‌ రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామ‌న్నారు. ర్మాత‌లు మాట్లాడుతూ..``న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పూర్తి స‌హ‌కారం అందించ‌డంతో తొలి షెడ్యూల్ విజ‌యవంతంగా పూర్తి చేశాము. ఈ షెడ్యూల్ చివ‌రి రోజున లొకేష‌న్ లో హీరోల్లో ఒక‌రైన శ్రీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌ప‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. రో శ్రీ మాట్లాడుతూ...``ద‌ర్శ‌కుడు క్రాంతి నా కోసం ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ రోల్ డిజైన్ చేశారు. ఈ పాత్ర‌లో న‌న్ను చాలా కొత్తగా ఆవిష్క‌రిస్తున్నారు. ఎప్పుడెప్పుడు న‌న్ను నేను స్ర్కీన్ పై చూసుకుంటానా అన్న ఉత్సాహంతో ఉన్నాను. ఈ సినిమా ప్ర‌తి ఒక్కిరికీ మంచి

ని

హీ

24 P టాలీవుడ్

పేరు తెస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు. , నోయ‌ల్, ఎస్తేర్, అర్జున్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః చేత‌న్ మ‌ధురాంత‌కం; సం్గీతంః గీతా పూనిక్; ఎడిట‌ర్ః త‌మ్మిరాజు, డైలాగ్స్ః టైమ్ నాని; పిఆర్వోః వంగాల కుమార‌స్వామి (బాక్సాఫీస్‌) ;ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బి.సి.చౌద‌రి; నిర్మాత‌లుః కృష్ణ మోహ‌న్, న‌రేన్, శ్రీరామ్ కందుకూరి; ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః క్రాంతి వ‌డ్ల‌మూడి

శ్రీ


 



మా

రాఘవేంద్రరావుతో వర్కింగ్‌ఎక్స్‌పీరియెన్స్‌?

న్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తి కథా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్‌పై ఎ.మహేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్రలో నటించిన సౌరవ్‌ జైన్‌ పాత్రికేయులతో జరిపిన ముచ్చట్లు

బ్యాక్ గ్రౌండ్......

అమ్మ లాయర్‌. భార్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నాన్న బిజినెస్‌చేసేవారు. ఇప్పుడు ఆయన లేరు. నేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. కంపూటర్స్ లో గ్రాడ్యుయేషన్‌ను ఢిల్లీలో చేశాను. పూణేలో ఎం.బి.ఎ చేశాను. మోడలింగ్‌ చేయడంతో ఈ టీవీ రంగం వైపు అడుగులేశాను.

టాలీవుడ్ లో అవకాశం....

ఓం

నమో వేంకటేశాయ' నాకు తెలుగులో తొలి సినిమా. అంత కంటే ముందు నేను ఓ ఇరానీ మూవీలో యాక్ట్‌ చేశాను. హిందీ సీరియల్‌ మహాభారత్‌లో కృష్ణుడు రోల్‌ చేశాను. అది చూసిన భారవిగారు డైరెక్టర్ రాఘవేంద్రరావుగారికి చెప్పడం డైరెక్టర్ గారు నన్ను ఓం నమో వేంకటేశాయలో యాక్ట్ చేయమని అన్నారు. అలా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను.

రా

ఆయన్ను ఫాలో అయిపోయానంతే....

ఘవేంద్రరావుగారు నన్ను కలిసినప్పుడు వెంకటేశ్వరస్వామి రోల్‌కు నేను న్యాయం చేయలేనేమోనని అన్నాను. అయితే డైరెక్టర్‌గారు, సౌరవ్‌.. అంతా నేను చూసుకుంటాను..అని అన్నారు. ఆయన అన్నట్లుగానే నా రోల్‌కు సంబంధించిన వర్క్‌ అంతా ముందుగానే ఎలా డైలాగ్స్‌ చెప్పాలి. అనే విషయాలపై ఆయన దగ్గరుండి చూసుకున్నారు. దీంతో పాటు తెలుగు, ఇంగ్లీష్‌ తెలిసిన ట్యూటర్‌ను కూడా పెట్టారు.

సన్నివేశాలను ఎలా చేయాలో ప్రాక్టీస్‌ చేసేవాడిని. నేను ఎలాంటి ప్రామ్‌ప్టింగ్‌ను వాడలేదు. అల్రెడి నేను కృష్ణుడు క్యారెక్టర్‌ చేసి ఉండటం వల్ల, డైరెక్టర్గా ‌ రు కథ చెప్పగానే వెంకటేశ్వరస్వామి గురించి ఒక అవగాహన కలిగింది. సెట్స్‌ లోకి రాగానే రాఘవేంద్రరావుగారు చెప్పిన విధంగా ఫాలో అయిపోయానంతే.

ఓం

నమో వేంకటేశాయ చిత్రంలో రాఘవేంద్రరావుగారితో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. లైఫ్‌ టైమ్‌లో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం. వర్క్‌ పట్ల ప్యాషన్‌ ఉన్న డైరెక్టర్.‌ ఈ ఏజ్‌లో కూడా ఆయన కొత్తగా ఆలోచిస్తున్నారు. చాలా క్లారిటీతో ఓ సీన్‌ను ఎలా చేయాలో అలా నటీనటుల నుండి రాబట్టుకుంటారు.

ఇం

నాగార్జునతో పనిచేయడం ఎలా అనిపించింది?

తకు ముందు చెప్పిన విధంగా నాగ్‌ సార్‌తో వర్క్‌ చేయడం..జీవితంలో మరచిపోలేని అనుభూతినిచ్చింది. నటుడుగానే కాదు, వ్యక్తిగా కూడా ఎలా ఉండాలో ఆయన నుండి నేర్చుకున్నాను. చాలా పెద్ద స్టార్‌ అయినా, చాలా కేరింగ్‌గా, హంబుల్‌గా ఉంటారు. ఆయనతో వర్క్‌ చేయడం ఆశీర్వాదంగా భావిస్తాను. నాగార్జునగారు, రాఘవేంద్రరావుగారు వంటి లెజెండ్స్ తో ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటించడం నా అదృష్టంగా భావిస్తాను.

టా

టాలీవుడ్‌గురించి....

లీవుడ్‌లో చాలా మంచి వాతావరణం కనపడుతుంది. యూనిట్‌లో అందరూ నాకెంతో సపోర్ట్‌ చేసి సెట్‌లో నన్ను కంఫర్ట్‌బుల్‌గా ఉంచారు. అందరికీ ఈ సందర్భంగా థాంక్స్‌చెబుతున్నాను.

టాలీవుడ్ P 25






2016

చివ‌రిలో మంచి క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా కొత్త కాన్సెప్ట్ తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ అందుకున్న "అప్ప‌ట్లో ఓక‌డుండేవాడు" లాంటి న్యూవేవ్ మూవీతో గ‌త సంవ‌త్స‌రానికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికిన యంగ్ హీరో శ్రీవిష్ణు మ‌రియు ఓ స్టార్ హీరో, ఇంకో ఇద్ద‌రు పాపుల‌ర్ హీరో, హీరోయిన్స్ కాంబినేష‌న్ లో కాన్సెప్టెడ్ మ‌ల్టిస్టార‌ర్ చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఇంద్ర‌సేన ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. బాబా క్రియోష‌న్స్‌ బ్యాన‌ర్ పై డా. ఎం.వి.కె రెడ్డిగారు స‌మర ‌ ్ప‌ణ‌లో అప్పారావు బెల్లాన‌ నిర్మాత‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి లో సెట్స్ మీద‌కి వెల్ల‌నుంది. ర్శ‌కుడు ఇంద్ర‌సేన మాట్లాడుతూ.." ఈ చిత్రం రెగ్యుల‌ర్ క‌మ‌ర్ష‌య‌ల్ చిత్రాల కంటే భిన్నంగా వుంటుంది. కొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో కంప్లీట్ వెస్ట్ర‌న్ మూవీస్ బాట‌లో సాగుతుంది. ఈ చిత్రం లో స‌మాంత‌రంగా సాగే మూడు క‌థ‌లుంటాయి. అందులో వుండే మూడు మిస్ట‌రీస్ ని చేధించ‌డం మీద ఈ క‌థ ఆధార‌ప‌డి వుంటుంది. ఇది రొల‌ర్ కాస్టర్ ‌ థ్రిల్లర్ ‌ గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. మిగతా వివ‌రాలు అతి త్వ‌ర‌లో మీకు తెలియ‌జేస్తాం.." అని అన్నారు డాక్ట‌ర్‌. ఎం.వి.కె రెడ్డి స‌మ‌ర్ఫ‌ణ‌.. ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్- రాజీవ్ నాయిర్‌, సంగీతం- స‌తీష్ ర‌ఘునాధ‌న్‌, నిర్మాత‌- అప్పారావు బెల్లాన‌ క‌థ‌,క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం- ఇంద్ర‌సేన ఆర్

ద‌

26 P టాలీవుడ్




 మే

ఘన, సృజన, ప్రత్యూష, జస్వంత్ సమర్పణలో శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ బ్యానర్ పై క్రాంతి చంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్, కోయల్ దాస్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘చంద్రుళ్ళో ఉండే కుందేలు’. వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా సెన్సార్‌కు సిద్ధ‌మ‌వుతున్న సంద‌ర్భంగా... ర్శకుడు వెంకటరెడ్డి ఉసిరిక మాట్లాడుతూ - ``ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టై ‌ న‌ర్‌గా రూపొందుతోన్న మా చిత్రం `చంద్రుళ్ళో ఉండే కుందేలు` నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు స‌హా అన్నింటినీ పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధ‌మైంది. నటీనటులు అందరూ చ‌క్క‌గా న‌టించారు. వీరితో పాటు రంగ‌నాథ్‌గారు, సుమన్ ,నాజ‌ర్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణిగారు, రాజీవ్ క‌న‌కాల‌, తాగుబోతు ర‌మేష్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, స‌ప్త‌గిరి స‌హా సీనియ‌ర్ అండ్ ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు కూడా మా సినిమాలో న‌టించ‌డం సినిమాకెంతో ప్ల‌స్ అయ్యింది. దాము న‌ర్రావుల సినిమాటోగ్ర‌ఫీ, విజ‌య్ గోర్తి

సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. అంద‌రూ న‌టీన‌టులు, టెక్నిషియన్స్ స‌హాయంతో సినిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేయ‌గ‌లిగాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. కుటుంబంలో ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చేలా ఉండే సినిమా అవుతుంది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా పూర్తయ్యాయి. సినిమా సెన్సార్‌కు సిద్ధ‌మైంది. సెన్సార్ పూర్త‌యిన త‌ర్వాత విడుద‌ల తేదిని తెలియ‌జేస్తాం`` అన్నారు. వనిరెడ్డి, పమేల, కీ.శే.రంగనాథ్, సుమన్, నాజర్, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, సప్తగిరి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, పాటలు: శ్రీమణి, కరుణాకర్ అడిగర్ల, ఫైట్స్: విజయ్, జాషువా, రాంబాబు, డ్యాన్స్: స్వర్ణ, నిక్సన్, కిరణ్, రాజు, సంగీతం: విజయ్ గోర్తి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దాము నర్రావుల, నిర్మాతలు: ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి, దర్శకత్వం: వెంకటరెడ్డి ఉసిరిక.

పా

టాలీవుడ్ P 27




ఖై

దీనంబ‌ర్ 150` సినిమాలో ఐఏఎస్ రోల్ త‌న‌కి గొప్ప గుర్తింపు తెచ్చింద‌ని అంటున్నారు యాక్టర్ ‌ కం డాక్టర్ ‌ కిషోర్‌. కోయ ఐఏఎస్ క్యారెక్టర్ ‌ ‌లో చ‌క్క‌గా న‌టించావ‌ని ఐఏఎస్‌, ఐపీఎస్‌లే త‌న‌కి కాల్ చేసి అభినందించార‌ని చెబుతున్నారు. ఖైదీనంబ‌ర్ 150 సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డం, త‌న పాత్ర‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్క‌డం చాలా సంతోషాన్నిచ్చింద‌ని అన్నారు. .కిషోర్ కోయ మాట్లాడుతూ -``వి.వి.వినాయ‌క్ గారు చాలా స‌న్నిహితులు. ఒక‌రోజు స‌ర్‌ప్రైజింగ్‌గా `నాయ‌క్‌`లో మంచి క్యారెక్ట‌ర్ ఉంది చేయండి అని ఛాన్సిచ్చారు. నాయ‌క్‌లో కోల్‌క‌త పోలీసాఫీస‌ర్‌గా న‌టించాను. అది చేసిన త‌ర్వాత స్నేహితులు, ప‌రిశ్ర‌మ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. చాలా థ్రిల్ క‌లిగించింది. స్క్రీన్ ప్ర‌జెన్స్ చూసుకున్న‌ప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది.

డా

28 P టాలీవుడ్



చాలా మంది ఫ్రెండ్స్‌ ఫోన్ చేసి అభినందించారు. ఆ త‌ర్వాత `ఎవ‌డు`లో రామ్‌చ‌ర‌ణ్ - బ‌న్ని కాంబినేష‌న్లో ‌ డాక్ట‌ర్ క్యారెక్టర్ ‌ చేశాను. వినాయక్ గారి `అల్లుడు శీను` చిత్రంలోనూ అబూద‌బీ-ఇమ్మిగ్రేష‌న్ ఆఫీస‌ర్‌గా న‌టించాను. `వీకెండ్ ల‌వ్‌` చిత్రంలో నెగెటివ్ రోల్ చేశాను. ప్పుడు `ఖైదీనంబ‌ర్ 150`లో బ్రేక్ ఇచ్చే రోల్ చేశాను. 500 పైగా కాల్స్ వ‌చ్చాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఫోన్ చేసి క‌లెక్ట‌ర్ పాత్ర‌లో చాలా బాగా న‌టించావ‌ని ప్ర‌శంసించారు. ఇంత చక్క‌ని క్యారెక్ట‌ర్ ఇచ్చి ఎంక‌రేజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు, వినాయ‌క్ గారికి ధ‌న్య‌వాదాలు. ప్ర‌స్తుతం వ‌రుణ్‌తేజ్ - శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్‌లోని `మిస్టర్ ‌ ‌` సినిమాలో మ‌రో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ‌ చేస్తున్నా... అని తెలిపారు.


 

తె

లంగాణ మూవీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ ప్రచురించిన నూతన సంవత్సర డైరీని ప్రముఖ నిర్మాత, ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు సి. కళ్యాణ్‌ ఇటీవల ఫిలిం ఛాంబర్‌లో ఆవిష్కరించారు. యూనియన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు శివశంకర్‌(అపురూప్‌) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రముఖ నిర్మాత, ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు సి. కళ్యాణ్‌, ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఎస్‌ఎల్‌ గ్రూప్‌ అధినేత ననావత్‌ నాయక్‌, సెక్టార్‌ ఛైర్మన్‌ పి.సత్యారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ఆఫ్‌కామర్స్‌ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌, ఎస్‌ఎల్‌ అసోసియేట్స్‌ ఛైర్‌పర్సన్‌ గంప సిద్ధలక్ష్మీ, నోవా గ్రూఫ్‌ కాలేజెస్‌ ఛైర్మన్‌ ముత్తంశెట్టి కృష్ణారావు, ఇరు రాష్ట్రాల ఆర్‌ఐఏ(రైట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ కమీషన్‌) కమీషనర్‌ ముత్తంశెట్టి విజయనిర్మల, డైరీ ప్రచురణ కర్త ఓం సాయిగురు డిజిటల్స్‌ అధినేత కొల్లూరు శ్రీకాంత్‌, దర్శకులు తాడినాడ రాజసింహ దర్శకుల సంఘం అధ్యక్షులు మురళీ లను శివశంకర్‌(అపురూప్‌) ఆధ్వర్యంలో యూనియన్‌సభ్యులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన శివశంకర్‌ (అపురూప్‌) మాట్లాడుతూ..మా యూనియన్‌కి గౌరవ సలహాదారుగా ఉండాలని శ్రీ చేజర్ల ఇంద్రకుమార్‌



రాజు(ఇంద్రాణి చారిటబుల్‌ట్రస్ట్‌, కువైట్‌) గారిని అడగగానే.. మీ సంక్షేమం కోసం నావంతు కృషి చేస్తానని, సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి, డైరీ ప్రచురణకు ముఖ్య కారకులైనారు. అలాగే ఎస్‌ఎల్‌ గ్రూప్‌ అధినేత ననావత్‌ నాయక్‌ గారు యూనియన్‌ సంక్షేమం కోసం 25వేల రూపాయల చెక్కును అందచేశారు. అలాగే కొల్లూరు శ్రీకాంత్‌ గారి సహకారం కూడా మరువలేనిది. ఈ ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నావంతుగా యూనియన్‌ సభ్యుల శ్రేయస్సు కోసం నా శాయశక్తులా కృషిచేస్తాను. 300 మంది సభ్యులున్న మా యూనియన్‌ నెలరోజుల్లోపే 525కి చేరడంని బట్టి నాపై ఎంతగా బాధ్యత ఉందో తెలుసుకున్నాను. యూనియన్‌ తరుపున 12 మంది టాస్క్‌ఫోర్స్‌ సభ్యులను నియమించి అన్ని సమయాల్లో యూనియన్‌కి అందుబాటులో ఉండేలా చూస్తాను. అలాగే సభ్యులకు గృహవసతి, భీమా సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తాను. ఇక చివరిగా మా యూనియన్‌ డైరీ ఆవిష్కణ గావించిన సి. కళ్యాణ్‌గారికి, వారందిస్తామన్న తోడ్పాటుకి యూనియన్‌ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము...అని అన్నారు.

టాలీవుడ్ P 29






మె

గాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు . 9 ఏళ్ల విరామం తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి అవలీలగా వంద కోట్ల షేర్ ని సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించాడు . ఇప్పుడున్న హీరోలకు యాభై కోట్ల ని సాధించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో మెగాస్టార్ అవలీలగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు . మిగతా హీరోలకు చిరంజీవి కి తేడా ఏమిటంటే మిగతా హీరోలు నటించిన సినిమాలు ఇతర భాషలలో కూడా రిలీజ్ అయి భారీ వసూళ్ల ని సాధించగా చిరు నటించిన ఖైదీ నెంబర్ 150 మాత్రం కేవలం తెలుగులో రిలీజ్ అయి ఇంతటి భారీ వసూళ్ల ని సాధించింది . న్ బాహుబలి చిత్రాల్లో మొన్నటి వరకు మహేష్ నటించిన శ్రీమంతుడు నెంబర్ వన్ గా ఉండేది కానీ ఆ రికార్డ్ ని బద్దలు కొట్టాడు చిరంజీవి దాంతో నెంబర్ వన్ చిత్రంగా వంద కోట్ల షేర్ ని సాధించిన ఖైదీ నెంబర్ 150 నిలిచింది . వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ తేజ్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ అయ్యింది .

నా

30 P టాలీవుడ్




మల్ కల్యాణ్ మూవీ మేకర్స్ పతాకంపై సూర్య శ్రీనివాస్, అక్షయ్ కూరపాటి, దివ్య, ప్రవళ్లిక పద్రాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం "చెన్నయ్ చైత్రమా ".కమల్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలొ ఈ సినిమా తెరకెక్కుతొంది. ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా టైటిల్ లొగొ లాంఛ్ జరిగింది.నిర్మాతలు రాజ్ కందుకూరి, తుమ్మల్ల పల్లి రామ సత్యనారాయణ టైటిల్ లొగొను ఆవిష్కరించారు. రొలు సూర్య శ్రీనివాస్ , అక్షయ్ మాట్లాడుతూ.. ఓ మంచి లవ్ స్టోరీ చెస్తున్నాము. నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా చిత్రముంటుందన్నారు. రొయిన్ దివ్య, ప్రవల్లిక మాట్లాడుతూ.. టైటిల్ నుంచి, ప్రతి పాత్ర వరకు దర్శకుడు కల్యాణ్ సూబర్బ్ గా డిజైన్ చెశారు. ఈ సినిమా లొ మేము భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ర్శక నిర్మాత కమల్ కల్యాణ్ మాట్లాడుతూ.. పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ ను తీసిన రాజ్ కందుకూరి, వంద సినిమాలకు చెరువవుతొన్న మెగా నిర్మాత రామ సత్యనాతాయణ గారు మా సినిమా టైటిల్ లొగొను ఆవిష్కరించటం ఆనందంగా ఉంది. మన దగ్గర ఉన్నదాంతో మనం సంతృప్తి పొందాలన్న కాన్సెప్ట్ తో "చెన్నయ్ చైత్రమా " రూపొందుతుంది. ఎక్కడ చిన్నపాటి అశ్లీలత లేకుండా కుటుంబమంతా కలిసి చూసెలా ఈ సినిమా ఉంటుందని అన్నారు.

హీ హీ

తు

మ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. మంచి కథ,కథనాలతో కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా గా "చెన్నయ్ చైత్రమా " తెరకెక్కిస్తుండటం సినిమా పై కమల్ కల్యాణ్ కున్న అవగాహనకు నిదర్శనం. పెళ్లి చూపులు విజయం చాలా మంది కి స్పూర్తి. అదే తరహాలొ చెన్నయ్ చైత్రమా కూడా సక్సెస్ సాదించాలి. చిన్న సినిమా బత్రకాలని అన్నారు. జ్ కందుకూరి మాట్లాడుతూ.. దర్శక నిర్మాత కమల్ కల్యాణ్ మంచి ప్లానింగ్, కథతో ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ అందరు చూసెలా కంటెంట్ నమ్ముకుని చెస్తున్నారు. తనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానన్నారు.

రా

టాలీవుడ్ P 31


 కా

లింగ్‌ బెల్‌' చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు పన్నా రాయల్‌ ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న మరో హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ 'రాక్షసి'. పూర్ణ ప్రధాన పాత్రలో అభినవ్‌ సర్దార్‌, అభిమన్యు సింగ్‌, గీతాంజలి ముఖ్యపాత్రల్లో డ్రీమ్‌ క్యాచర్స్‌ఎంటర్‌టైన్‌మెంట్‌పతాకంపై అశోక్‌మందా, రాజ్‌ దళవాయ్‌, టోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్‌ వర్క్‌ను న్యూయార్క్‌లో చేస్తున్నారు. త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సందర్భంగా దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ - ''కాలింగ్‌ బెల్‌ కంటే టెక్నికల్‌గా ఎన్నో రెట్లు స్టాండర్డ్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా క్వాలిటీగా రావడం కోసం గ్రాఫిక్‌ వర్క్‌ను న్యూయార్క్‌లో చేయిస్తున్నాం. కంటెంట్‌ పరంగా, టెక్నికల్‌గా ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ చిత్రంలో పూర్ణపై చిత్రీకరించిన ఓ సాంగ్‌ సినిమాకే హైలైట్‌ అవుతుంది. నాలుగు నిముషాల నిడివి వుండే ఈ సాంగ్‌ని పూర్తిగా విజువల్‌ ఎఫెక్ట్స్‌లో చిత్రీకరించడం జరిగింది. ఈ పాట ఆడియన్స్‌కి ఓ డిఫరెంట్‌ ఎక్స్పీ ‌ రియన్స్‌ ఇస్తుంది. నేను

32 P టాలీవుడ్



అనుకున్నది హండ్రెడ్‌ పర్సెంట్‌ స్క్రీన్‌పై చూపించడంలో మా నిర్మాతల సహకారం ఎంతో వుంది. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చిత్రాన్ని చాలా రిచ్‌గా నిర్మించారు. 'రాక్షసి' ఈమధ్యకాలంలో వచ్చిన హార్రర్‌ చిత్రాల్లో ఓ డిఫరెంట్‌ మూవీ అవుతుందని ఖచ్ఛితంగా చెప్పగలను'' అన్నారు. ర్మాతలు అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్‌, టోనీ మాట్లాడుతూ - ''ఒక మంచి చిత్రంతో మా బేనర్‌ను స్టార్ట్‌ చేసినందుకు చాలా సంతోషంగా వుంది. పన్నా రాయల్‌ చెప్పిన కథ మాకెంతో నచ్చింది. అతను చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు అద్భుతంగా స్క్రీన్‌మీద చూపించాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించాం. త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేసి, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. ర్ణ, అభిమన్యుసింగ్‌, అభినవ్‌సర్ధార్,‌ గీతాంజలి, ప థ్వీ, బేబీ ధ్వని, బేబీ క తిక, సమ్మెట గాంధీ, తాగుబోతు రమేష్‌, ప్రభాస్‌శ్రీను, 'ఈరోజుల్లో' సాయి, షాని సాల్మన్‌, ఫణి, ప్రియ, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: కర్ణ పి., ఎడిటింగ్‌: శ్రీసంతోష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: షాని సాల్మన్‌, నిర్మాతలు: అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్‌, టోనీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్‌.

ని

పూ


సభ్యత, అశ్లీలతలకు పెద్ద పీట వేస్తూ.. హింసను ప్రేరేపిస్తూ, యువతను పెడ దారి పట్టిస్తూ.. అత్యంత జుగుప్సాకరమైన కధ, కథనాలు, రోత పుట్టించే సన్నివేశాలతో కూడిన సినిమాలకు "క్లీన్ సర్టిఫికెట్స్" జారీ చేసే సెన్సార్ బోర్డ్.. వతరాన్ని మేల్కొలుపుతూ.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ.. క్లీన్ ఎంటర్ టైనర్ గా.. ఎంతో నిబద్ధతతో.. నిజాయితీతో రూపొందించిన తమ "శరణం గచ్ఛామి" సినిమాకు మోకాలడ్డుతుండడం తమకు ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోందని అంటున్నారు చిత్ర నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ప్రేమ్ రాజ్. హేతుకమైన కారణాలు చూపకుండా.. రివైజింగ్ కమిటీకి వెళ్లమనడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. సెన్సార్ బోర్డ్ పక్షపాత ధోరణిని, ఒంటెత్తు పోకడలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. మ వాదనలో నిజముందని.. తమకు జరుగుతున్నది కచ్చితంగా అన్యాయమేనని భావిస్తే.. మీడియా మిత్రులు తమకు చేయూతనందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వతహా ఎన్. ఆర్.ఐ అయిన బొమ్మకు మురళి.. ఈ చిత్రానికి తనే స్వయంగా కథ-స్క్రీన్ ప్లే అందించారు. వీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్

యు

     

బొ

రెడ్డి, కాశీ విశ్వనాధ్, సుధ, సత్యకృష్ణ, దేశపతి శ్రీనివాస్, సుబ్బారాయశర్మ, మరియు బి.సి. సంఘ నాయకులుశాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి.. సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సామి, ఎడిటింగ్: సత్య గిడుతూరి, సంగీతం: రవి కళ్యాణ్, సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ-జర్నలిస్ట్ సతీష్ చంద్ర, సమర్పణ: బొమ్మకు హిమమాల మురళి, స్టోరీ-స్క్రీన్ ప్లే- ప్రొడ్యూసర్: బొమ్మకు మురళి, డైలాగ్స్ & డైరెక్షన్: ప్రేమ్ రాజ్ !!

టాలీవుడ్ P 33


   

యం

గ్ హీరో నిఖిల్ గొంతు పెంచాడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నాడు . తాజాగా కుప్పం వెళ్లిన నిఖిల్ అక్కడ ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా విలేఖరులు సంధించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ,దాని వల్లే యువత కు పెద్ద ఎత్తున ఉద్యోగ , ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపాడు . ఇటీవలే ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో మంచి హిట్ ని అందుకున్న నిఖిల్ మంచి జోరు మీదున్నాడు . స్తుతం కేశవ చిత్రం లో నటిస్తున్నానని దాని తర్వాత సీనియర్ హీరో నాగార్జున తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటించే ఛాన్స్ ఉందని ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఆ విషయం కన్ఫర్మ్ చేస్తామని అంటున్నాడు నిఖిల్ .

ప్ర





2017

, 2018 సంవత్సరాలలో ఏకంగా 9 సినిమాలు నిర్మించడానికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నాడు అగ్ర నిర్మాత అశ్వనీదత్ . వైజయంతి మూవీస్ పతాకంపై తెలుగులో అగ్ర హీరోలందరి తో భారీ చిత్రాలను నిర్మించిన ఘనమైన చరిత్ర ఉంది అశ్వనీదత్ కు అయితే గత కొంత కాలంగా భారీ ప్లాప్ లతో ఒక్కసారిగా చతికిల బడ్డాడు అశ్వనీదత్ . దాంతో ఇక ఇతడి పని అయిపొయింది లే అని అనుకున్నారు కానీ పడిలేచిన కెరటం లా మళ్ళీ చిత్ర నిర్మాణానికి పూనుకుంటున్నాడు . అయితే ఈసారి ఒకటి రెండు చిత్రాలు కాదు రెండేళ్లలో కనీసం తొమ్మిది సినిమాలు అందునా భారీ సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు . గాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత 152 లేదా 153 వ సినిమా అశ్వనీదత్ చేయడానికి ముందుకు వస్తున్నాడు అలాగే నాగార్జున , మహేష్ బాబు , ఎన్టీఆర్ , నాని లతో వరుసగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . మళ్ళీ వైజయంతి సంస్థ కీర్తి ప్రతిష్టలను రెప రెప లాడించేలా చేయడమే అశ్వనీదత్ లక్ష్యం అట .

మె

34 P టాలీవుడ్




మె

గాస్టార్ చిరంజీవి క్లాప్ తో రాంచరణ్ కొత్త సినిమా ప్రారంభమైంది . సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది . గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో చరణ్ చాలా కొత్తగా కనిపించనున్నాడు . జనవరి 30 న హైదరాబాద్ లో చరణ్ - సుకుమార్ ల కొత్త సినిమా ప్రారంభంఅయ్యింది . ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు . జనవరి 30 న ప్రారంభం అయినప్పటికీ ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది . రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో , అలాగే హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది ఈ చిత్రం . సుకుమార్ సినిమా కొత్త డైమన్షన్ లో చూపిస్తుంది అని భావిస్తున్నాడు చరణ్ .

టాలీవుడ్ P 35


 

బి

చ్చగాడు చిత్రంతో సంచలన విజయం సాధించడమే కాకుండా తెలుగులో మంచి మార్కెట్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ . బిచ్చగాడు చిత్రం తర్వాత చేసిన బేతాళుడు అంతగా ఆడలేదు కానీ బిచ్చగాడు ప్రభావంతో మంచి వసూళ్ల నే సాధించింది . అదే ఊపులో ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు విజయ్ ఆంటోనీ . జీవా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''యమన్ '' చిత్రాన్ని తెలుగు లో కూడా డబ్ చేస్తున్నారు . ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాన్ని అందించిన రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు . గా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24 న మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తెలుగు , తమిళంలో ఏకకాలంలో ఈ చిత్రం రిలీజ్ కానుంది . ఇటీవల రిలీజ్ అయిన యమన్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది దాంతో సినిమా విజయం పై ధీమాగా ఉన్నారు ఆ చిత్ర యూనిట్ .

కా





స్టార్ అల్లు అర్జున్ తాజాగా దువ్వాడ జగన్నాధం స్టైలిష్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా దాని

తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మాణం అయ్యే చిత్రంలో నటించనున్నాడు . పక్కనున్న తమిళనాడు పై కూడా కన్నేశాడు అల్లు అర్జున్ . ఇప్పటికే మలయాళంలో అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉండగా తాజాగా తమిళంపై దృష్టి పెట్టాడు . తమిళ హీరోలకు ఇక్కడ మార్కెట్ బాగుంది కానీ తెలుగు హీరోలకు మాత్రం తమిళంలో అంతగా లేదు అందుకే ఈసారి తమిళ ప్రేక్షకులను టార్గెట్ చేసాడు అల్లు అర్జున్. గుస్వామి చిత్రం తర్వాత కూడా మరో తెలుగు , తమిళ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . మనం , 24 వంటి విభిన్న కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ద్వి భాషా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు అల్లు అర్జున్ . దాంతో తన మార్కెట్ ని మరింతగా పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .

లిం

36 P టాలీవుడ్


 

మె

గా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయ్యింది . యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా దర్శకులు కొరటాల శివ కెమెరా స్విచాన్ చేసాడు ఇక వివివినాయక్ గౌరవ దర్శకత్వం వహించాడు ఈ ముహూర్తపు సన్నివేశానికి . యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర పనిచేసిన కృష్ణ ఈ చిత్రానికి నిర్మాత కావడం తో ఎన్టీఆర్ , దిల్ రాజు , దర్శకులు వివివినాయక్ , కొరటాల శివ లు '' జవాన్ '' చిత్ర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు . ముఖ రచయిత బివిఎస్ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు . దేశానికి సమస్య రాకుండా జవాన్ అండగా నిలబడతాడు , అదే కుటుంబానికి సమస్య వస్తే సమర్ధుడైన కొడుకు జవాన్ లా నిలబడే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మెగా మేనల్లుడు చాలా ఆశలే పెట్టుకున్నాడు .

ప్ర

టాలీవుడ్ P 37


 





టాలీవుడ్ P 38

శ్రీ

తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్ నుంచి వ‌రుస‌గా స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు తెలుగులో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అదే కోవ‌లో ఇప్పుడు మ‌రో థ్రిల్ల‌ర్ మూవీని ప్ర‌ముఖ బ్యాన‌ర్లు, నిర్మాత‌ల‌తో పోటీప‌డి ఈ సంస్థ ద‌క్కించుకుంది. `ధురువంగ‌ల్ ప‌దినారు` (డి-16) పేరుతో ఇటీవ‌ల రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌మిళ చిత్రాన్ని తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌` పేరుతో అనువ‌దిస్తున్నారు. మార్చిలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. సంద‌ర్భంగా చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మాట్లాడుతూ -``త‌మిళంలో ఇటీవ‌ల రిలీజై ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న `ధ‌రువంగ‌ల్ ప‌దినారు` చిత్రాన్ని తెలుగులో `16-ఎవ్వెరి డీటెయిల్ కౌంట్స్‌` పేరుతో అనువ‌దిస్తున్నాం. హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠ‌భరి ‌ తంగా తెర‌కెక్కిన థ్రిల్లర్ ‌ ‌గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న చిత్ర‌మిది. త‌మిళ‌నాట‌ ఇప్ప‌టికీ చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో దూసుకెళుతోంది. వాస్త‌వానికి ఈ సినిమాని టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖ నిర్మాత‌లు, హీరోలు నేరుగా తెలుగులో రీమేక్ చేసే ఉద్ధేశంతో భారీ మొత్తాల్ని వెచ్చించి చేజిక్కించుకోవాల‌నుకున్నారు. కానీ పోటీలో ఫ్యాన్సీ మొత్తాన్ని చెల్లించి చేజిక్కించుకున్నాం. ఈ చిత్రానికి కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రెహ్మాన్ హీరోగా న‌టించారు. అలాగే ధృవ సినిమాలో అర‌వింద్ స్వామి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన సింగ‌ర్ కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేమ‌చంద్ర ఈ చిత్రంలో హీరో పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతున్నారు. సుజిత్ స‌రంగ్ కెమెరా వ‌ర్క్‌, జాకేష్ బిజోయ్ సంగీతం, రీరికార్డింగ్ హైలైట్‌. తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించే అన్నిర‌కాల అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త అనుభూతినిచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. అనువాద కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి మార్చిలో సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.


 





గోరంట్ల సత్యం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ టాలీవుడ్ మ్యాగజిన్, టాలీవుడ్.నెట్


Tollywood Magazine Telugu February - 2017  

Tollywood Magazine Telugu February - 2017

Tollywood Magazine Telugu February - 2017  

Tollywood Magazine Telugu February - 2017

Advertisement