భారతి భారతి ఓ భారతి
ఇంక మారదే మారదే ని ఇ గతి
మతినే మార్చే క్షణికావేశం
"దిశ"నే మార్చే పైశాచికం
స్వేచ్ఛగా బ్రతకనివ్వదే మగని లోకం
కామం మూర్ఖం దరించేనమ్మ
మౌనం భయం నాకు వదిలేనమ్మ
తొలి అడుగే అపేసే సంకెళ్ళ కంచెలు నా చుట్టూరా
ఆశయం ఆపితే నా బతుకేల
భారతి భారతి ఓ భారతి
చెప్పవ తల్లిలా నన్ను చూడాలని
కిచకుని దాటిన
సైన్దవుని గెలిచిన
మగడేనమ్మ మాలో దైర్యం
ద్రౌపదిగా చీర విడిచినా
సీతగా లంక చేరినా
మగడేనమ్మ మా శాపం
నిర్భయ ఏనాడో నిశిధి చేరే
కర్కశం మా చుట్టూ వలనే అల్లే
తండ్రిగా అన్నగా ఉన్నాడా మగాడు
భారతి భారతి ఓ భారతి
చెప్పవే చెప్పవే చేరిచే పాపం వద్దని
కృష్ణంవందే:జగద్గురుమ్