SaiBaba Masapatrika || September 2020

Page 1



 

పూజకు మించిన

సాధనం మరొకటి లేదు పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ

ము

ముక్షువులకు ఇష్టదేవతారాధనల కంటే పూర్ణజ్ఞాన స్వరూపులైన బ్రహ్మనిష్ఠులను ఆశ్రయించడమే శ్రేయస్కరమన్నది సనాతనుల అభిప్రాయము. కామ్యములను కోరినవారు మాత్రమే వారి వారి కామ్యాలననుసరించి ఆయా దేవతలను ఆరాధించడం వల్లనే -అంటే- నామ, రూప, గుణ, రహితుడు, అద్వితీయుడు అయిన ఆ పరమాత్మను తమ కామ్యాన్ననుసరించి ఆయా కార్యసిద్ధి కొరకు పూజించడం వల్లనే ఇన్ని దేవతామూర్తులు ఏర్పడ్డాయని తలచవచ్చు. కానీ ఆత్మజ్ఞానిని పూర్ణకాముడని తెల్పడంలో, మన శాస్త్రాలన్నీ భక్తులు కేవలం వారి విశ్వాసంలోని బలహీనతవలన దైవాన్ని వారి కోరికలననుసరించి పరిమితరూపంగా, దేవతలుగా కొలుస్తున్నారని చెబుతున్నాయి. అందుకే తీర్థస్థలాల దర్శనం కనిష్టమైన సాధనగా శాస్త్రాల్లో చెప్పబడియున్నది. బహుశా ఈ సూత్రాన్ననుసరించే కాబోలు బౌద్ధులు దేవతలను కాక బుద్ధుని, జైనులు తీర్థంకరులను ప్రధానంగా ఆరాధిస్తారని తలచవచ్చు. క్రైస్తవ, ఇస్లాం మతాలలో కూడా వివిధ దేవతా విగ్రహారాధన నిరాకరించి అద్వితీయమైన దైవాన్ని ఆరాధించడం ప్రధానంగా చెప్పటం జరిగిందని తలచవచ్చు. కనుకనే సమర్థ సద్గురుడు, బ్రహ్మనిష్ఠుడు, బ్రహ్మస్వరూపి అయిన శిరిడీ సాయినాథునికి

షోడశోపచార పూజ చేసుకుంటారు. పూజ చేయడం అనేది రూప రహితుడైన దైవానికి రూపం కల్పించడంకాదా అన్న ప్రశ్న రావచ్చు. కానీ భక్తులు తమ కామ్యం నెరవేరడం కోసం రూప గుణ రహితుడైన దైవాన్ని తన కామ్యాన్ననుసరించి కల్పించిన రూపం కాకపోవడమే సాయి రూపంలోని ప్రత్యేకత. ఆయన మనపై కరుణతో మానవాకారములో పూర్ణ జ్ఞానావస్థకు లోటులేని విధంగా అవతరించడం విశేషం. అటువంటివారు మానవాకారంలో అవతరించి అనుభవపూర్వకంగా మనకు ఆధ్యాత్మిక సత్యాన్ని నిరూపించనిదే ఆధ్యాత్మికతను కల్పితంగా, భ్రాంతిగా భావించవలసివస్తుంది. అంతేకాక ధ్యేయమూర్తిగా అట్టి పూర్ణస్వరూపుని పెట్టుకోవడం ప్రత్యేక ఫలయుక్తమని పతంజలి మహర్షి వంటివారు యోగసూత్రాలలో కూడా చెప్పడమైనది. కారణం ముముక్షువు ముందు ముందు తానెట్లు రూపొందాలోనన్న దాని ప్రతిరూపమే సాయి. మానవుడు దేహంతో వుండగానే అట్టి స్థితినొందగలడు అన్న ధైర్యానికి రూపం అది. అయితే ‘ముముక్షువు చేయవలసినది ధ్యానం గదా, పూజ ఎందుకు’ అన్న ఆలోచన రావచ్చు. ధ్యానాన్ని దృఢతరం చేయడానికి పూజకు సాటియైన సాధనం మరొకటి లేదనే చెప్పాలి. అందుకే క్రమంగా అన్ని మతాలలోనూ పూజ, ప్రార్థనలు ప్రాబల్యము చెందుతున్నాయి.

 2020

మిగతా 29వ పేజీలో 3


   OFFICIAL ORGAN OF SRI MANGA BHARADWAJA TRUST

:38

-2020

:05

       ,  ‘’

  01.

పూజకు మించిన సాధనం మరొకటి లేదు

02.

సత్సంగాలలో సమైక్యత

03.

సాయి జీవన విధానంలో ప్రధాన సూత్రం

04.

పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్ట రుగారు

05.

పూజ్య అమ్మగారితో దివ్యానుభవాలు

06.

భక్ తి, శ్రద్ధ ల దీపావళి

07. 08.

పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ

03

గురుపత్ని అలివేలు మంగమ్మ

05

‘సాయిబాబా’

10

గురుపత్ని అలివేలు మంగమ్మ

11 17

సమిత్పాణి

22

పూజ్య గురుపత్ని బోధలు

గురుపత్ని అలివేలు మంగమ్మ

26

ఆచార్యుని అద్భుత లీలలు

వేంకట బాలసుబ్రహ్మణ్యశర్మ

28

గురుపత్ని పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ తల్లి జన్మదిన వజ్రోత్సవ వేడుకల సందర్భంగా సాయిబాబా పత్రిక సెప్టెంబర్-2020 ప్రత్యేక సంచికగా ప్రచురించబడింది. ఈ కారణంగా ప్రతినెల ప్రచురించే వ్యాసములు, ధారావాహికలు స్థలాభావం వల్ల ప్రచురించలేక పోతున్నాము. పాఠకులు గమనించగలరు. -ఎడిటర్



Sri Manga Bharadwaja Trust, Bhakta Nivas, 12-1-170/46P, Hanuman Nagar, Jaipuri Colony, Nagole, Hyderabad - 500068 Phone No. +91 - 74160 41550

www.saibharadwaja.org www.saimasterforums.org

 :  .. , . 

 

   

: :

. 10-00 . 100-00

   ,    .


 

సత్సంగాలలో సమైక్యత గురుపత్ని అలివేలు మంగమ్మ

గురు ర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః l గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః ll అనంతార్య తనూజాతం సాయినాథ సమప్రభం l బుచ్చిమాంబాసుతం వందే సర్వాభీష్ట ఫలప్రదం ll

జై సాయిమాస్టర్ !

న మ ం ద ర ం గూ డా మాస్టరుగారి యొక్క, బాబా యొక్క మహోత్సవాలను చాలా సందర్భాలుగా జరుపుకుంటూవున్నాం. ఆయనిచ్చినటువంటి శక్తిననుసరించి బాగానే జరుపుకుంటున్నామని చెప్పుకోవచ్చు. బాగా జరుపుకోవటం అంటే ఏమిటి? అంటే చాలామందిని ఆహ్వానించుకోవటం, భోజనాలు పెట్టడం, తర్వాత భజనలు, ఉపన్యాసాలు చెప్పుకోవడం. విందు

భోజనాలు మనకు చేతనైనంత వరకు చేసుకుంటూ వుండటం చేస్తున్నాము. కొన్ని చోట్ల అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేస్తూవున్నారు. అయితే ఈ కార్యక్రమాల ద్వారా కొంత ఉపయోగం కొంతమందికి జరుగుతూనేవున్నది. మనకు కూడా జరుగుతూనేవుంది కాబట్టి మాత్రమే మనం చేసుకుంటున్నాం. మాస్టరుగారి ద్వారా మనకు ఎంతో కొంత మేలు జరగకపోతే మనం ఆయన దగ్గరికి రావటం గానీ ఆయనను యింతగా సేవించుకోవటంగాని, ఇట్లాంటి మహోత్సవాలను జరుపుకోవడం గానీ జరగదు. ఎందుకంటే ఎవరూ ఇవ్వని చోటికి వెళ్ళరు కదా! ఇచ్చే వాళ్లదగ్గరికే మనం వెళ్తాం. కాబట్టి ఆయన ఏదో యిస్తున్నారనే మనం వెళుతున్నాం. ఆయనకు ఎంతో కొంత మనం సమర్పించుకుంటాం. తృణమో ఫణమో మన శక్తి మేరకు. కొంతమంది శక్తికిమించి చేసే వాళ్ళున్నారు.

 2020

కొంతమంది శక్తి ఎంతో వుంటే కొద్దిగా చేసేవాళ్ళున్నారు. కొంతమంది వున్నంతవరకు చేసేవాళ్ళున్నారు. ఆయన ఎంత యిస్తే అంత స్వీకరిస్తారు. కాబట్టి మన సంస్కారాన్ని బట్టి, మన భక్తిని బట్టి, మన స్థోమతని బట్టి మనం చేసుకుంటూ వస్తున్నాం. అయితే మనం చేస్తున్న దానికి, ఆయన వైపునుంచి వచ్చేదానికి ఏమిటి తేడా? ఆయన మననుంచి ఆశించే దేమిటి? ఆయన మననుంచి కోరుకునేదేమిటి? అనేది కొంచెం ఆలోచించుకోవాలి. మనం ఆయన మార్గాన నడుస్తున్నామని చాలామంది అనుకుంటున్నాం. ఆయన మార్గాన నడవడం అంటే ఏమిటని ఆలోచిస్తే…. ‘మేము సత్సంగాలు చేసుకుంటున్నామండి, ఆయన మార్గంలోనే చేసుకుంటున్నాం’ అని చాలామంది అనుకుంటూ వుంటాము. ఆయన మార్గంలో సత్సంగం చేసుకోవడమంటే? అందరూ రావటం కూర్చోవటం, 5


  తర్వాత సద్గ్రంథ పఠన (అంటే) ఒక మంచి పుస్తకాన్ని చదువుకోవటం, కాసేపు భజన చేసుకోవటం తరువాత ఎవరన్నా సత్సంగం చేస్తే, కొంచెం మాట్లాడితే గనుక వినడం, ప్రసాదాలను స్వీకరించడం, వెళ్లిపోవడం. ఇదే అని మనం అనుకుంటున్నాం. మాస్టరుగారు చెప్పిన మార్గంలోనే కొంతమంది చాలా సింపుల్ గా, అంటే మాస్టరుగారు చెప్పినట్లుగా కొద్దిగా బొరుగులు, కొంచెం పళ్లు మాత్రమే యిస్తూ... అంటే పేదవాళ్లకుకూడా సత్సంగం చేసుకోవటానికి అవకాశం వచ్చేటట్టుగా మేము చేస్తున్నామండీ. అదే మార్గంలో మేము నడుస్తున్నాం. ఆయన చెప్పినటువంటి పారాయణ చేసుకుంటున్నాం. సాయి లీలామృతము పారాయణ, శ్రీ గురుచరిత్ర పారాయణ, మహాత్ముల చరిత్రల పారాయణ ఆయనకి చాలాఇష్టం. అందుకని తప్పకుండా మా దినచర్యగా ఏ రోజూ మానకుండా మేము చేసుకోగలుగుతున్నాం-- అని కూడా అనుకుంటున్నాం. ఆయన చెప్పినటువంటి పేదలకు సహాయం చేయడం అనేది కూడా చేస్తున్నాము. బాబా చెప్పారు కదా పేదలకు సాయం చేస్తే చాలా మంచిదని. అలా బాబా మార్గంలోనూ, మాస్టరు గారి మార్గంలోనూ మేము నడుస్తున్నాం అని మనం చాలా మందిమి అనుకుంటున్నాం. కాని మాస్టరుగారు అదేనా కోరుకుంటున్నది? అని మనం ఆలోచిస్తే, సత్సంగం చేసుకోమని చెప్పిన మాట నిజమే. సత్సంగం చేసుకుంటే ఆయన సంతోషించే 6

మాట కూడా చాలా నిజమే. కానీ సత్సంగం ఎలా చేసుకోమన్నారు? అనేది మటుకు మనకు కొంచెం తేడా కనిపిస్తున్నది. ఒక్కొక్క సత్సంగం మొదలుపెడుతున్నాం, (మొదట) ఉధృతంగా సాగుతుంది. వందమంది, రెండొందల మంది దాకా వస్తారు. అంటే చాలాబాగా చేసుకుంటాం. ప్రసాద వినియోగం భజన్లు మొత్తం పెట్టుకుంటాం. కానీ ఎక్కడో ఒక చోట ఒకళ్లకొకళ్లకి తేడా వస్తున్నది. మానసిక స్పర్థలు ఏర్పడుతున్నాయి. ఏర్పడగానే ఏం చేస్తున్నారు? దాన్లోనుంచి విడిపోవడం జరుగుతున్నది. ఒకళ్లకొకళ్లకి ఒక సత్సంగంలోనే పడటం లేదు! ఒక సత్సంగంలోని శిష్యులకి ఇంకో సత్సంగంలోని శిష్యులకి అస్సలు పడటం లేదు!

 2020

ఎందుకు పడటం లేదు? మాస్టరుగారు చెప్పినది ఇదేనా? అని ఆలోచిస్తే…. ఎందుకు పడటం లేదంటే చిన్నచిన్న కారణాలు కావచ్చు. చిన్న చిన్నవే, చాలా చిన్నవి, కొన్ని పెద్దవి కూడా వున్నాయి. కొంతమంది నాకు సరిగా మర్యాద చేయలేదనో, నన్ను ముందు కూర్చోపెట్టలేదనో, నాకు ప్రాధాన్యత యివ్వటం లేదనో, నాకు మైకు యివ్వటం లేదనో, పాట పాడించటం లేదనో... ఇలాంటి చిన్న విషయాలతో విభేదాలు పడుతున్నారు. ఒకరి అభిప్రాయాలు ఒకరికి సమన్వయ పడటంలేదు. అంటే…. ఇట్లా బాగా డెకరేషన్ చేద్దామని ఒకరన్నారనుకో, ఎందుకయ్యా సింపుల్ గా చేస్తే సరిపోతుందని ఇంకోరంటారు. నలుగురున్నప్పుడు నాలుగనక


  తప్పదు. వీళ్లిద్దరికే వస్తుంది ‘ఏందయ్యా బాగా చేసుకోక ఏం చేస్తాం’ అంటారు కొంతమంది. ఎందుకయ్యా అంటారు వీళ్లు. ఇద్దరూ సమన్వయ పడరు. పోని బాగా చేసుకుందాం అన్నదాని ప్రకారం పోయినా పర్వాలేదు. వద్దులే సింపుల్ గా చేసుకుందాము ఆ డబ్బుని వేరేగా వినియోగపరుచుకుందాము అనే మనస్తత్వంతో అందరూ కలసి వెళ్ళినా పర్వాలేదు. ఈ రెండూ కాకుండా చిన్న చిన్న విషయాల్లో విభేదాలు వచ్చి, విడిపోవడం జరుగుతున్నది. ఇలా ప్రతిచోట కూడా ఒకే బాబా సత్సంగం, ఒకే మాస్టరుగారి శిష్యులు అనేక రకాలుగా విడిపోయి, ఏ గ్రూపుకు ఆ గ్రూపు అయ్యి, మా గ్రూపుకంటే ఆ గ్రూపులో బాగా చేశారా? మనమెంత బాగా చేశాం. వాళ్ళెంత తక్కువగా చేశారు. దీన్లో మనం ఎంతమందిని పిలుచుకొచ్చాము, దాన్లో అంత మందిని వాళ్ళు పిలుచుకొచ్చారా? వాళ్ల కంటే మనకు ఎక్కువమంది మందీ మార్బలం, అంటే భక్తులు, వున్నారు. అంటే ఒక రకంగా రాజకీయ ఎలక్షన్స్ లాగా ఒక్కొక్క చోట తయారవుతున్నది. అన్ని చోట్ల అని నేను చెప్పలేను చెప్పడం లేదుకూడా. చాలా చోట్ల పెద్ద పెద్ద రాజకీయాలు జరుగుతున్నట్టుగా, మన ప్రజారాజ్యంలో ఎలా అయితే రాజకీయాలు జరుగుతున్నాయో, అలాంటి రాజకీయాలు మన సత్సంగాలలో కూడా జరుగుతున్నాయి. ఇదేనా మాస్టరుగారు ఆశించినది? అని మనం కొంచెం ఆలోచించాలి. మాస్టరుగారు ఆశించిందది కాదు. ఆయన అందరం కలిసి

బాగుపడదాం అని ఆలోచించారు. సత్సంగం అంటే అందరూ కలిసి బాగుపడటం. అందరూ విడిపోయి బాగు పడకుండా వుండటం కాదు. విడిపోతే బాగుపడమా అంటారేమో! విడిపోవటమే బాగుపడక పోవటం. ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేకపోవడమే బాగుపడక పోవటం. ఇంట్లో ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధం లేకపోతే ఆ ఇల్లు ఎలా వుంటుందో చెప్పండి. ఒకళ్ళకొకళ్ళకి ఇంట్లో సంబంధం లేదు. తండ్రి మాట కొడుకు వినడు, కొడుకు మాట తండ్రి పట్టించుకోడు. పిల్లల మాట తల్లిదండ్రులు పట్టించుకోరు, వాళ్ల మాట వీళ్లు వినరు. భార్యాభర్తలు యిద్దరికీ తగువులు, ఇక ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఆ ఇల్లు సమన్వయమైన కుటుంబమేనా? సరైన కుటుంబమేనా? అలాగే మన సత్సంగం. సత్సంగం అంటే ఏమిటంటే ‘సాయి భక్త కుటుంబము’. ఈ సాయి భక్త కుటుంబం, సాయి బిడ్డలనుకుందాము పోని, ఎలా వుండాలి? అందరూ కలిసి ఒక మాట మీదుగా వెళ్లాలి. ఒకళ్ళ మాటను ఒకరు గౌరవించుకుంటూ, ఏది మంచిదనేది ఆలోచించుకుంటూ, ఎట్లా చేస్తే మనందరమూ కలిసి చక్కగా చేసుకుంటాము అనేది ఆలోచించుకుంటూ సత్సంగాలు చేసుకుంటూ పోవాలి. ఒకరి బలహీనతను ఒకరు సరిదిద్దుకుంటూ పోవాలి. సరిదిద్దుకుంటూపోతూ మనలో మనం మార్పు తెచ్చుకుంటూ పోవాలి. మనకి కోపం వచ్చినట్టే

 2020

వాడికి వస్తున్నది. మనకీ కోపం వస్తున్నది కదా అనుకున్నప్పుడు పక్కవాడి కోపాన్ని మనం చాలా తేలికగా తీసుకుంటాం. అట్లా కాకుండా వాడు నామీద ఎందుకు కోపంగా వుండాలి? వాడికదేనా మాస్టరుగారు చెప్పింది? ‘ఎంత శాంతం ఆయనకి’ అంటారనమాట. ఆయనకెంత శాంతమో అదిసరే, మనకెంత శాంతముండాలో మనం చూసుకోవాలి. ఆయనకెంత శాంతం వుందో వాడికి తెలీదనుకుందాం పోనీ. వాడికి తెలియక ఎగిరెగిరి పడుతున్నాడు. మరి ఆ విషయం మనకు తెలుసు కదా! మాస్టరుగారు శాంతి స్వరూపులని, మనం నేర్చుకోవాలని మనకు తెలుసు కదా! ఎందుకు నేర్చుకోలేక పోతున్నాం? వాడిమీద మనకెందుకు కోపం వస్తున్నది? అనేది ఆలోచించుకుంటే మనం బాగుపడతాం. ఒకళ్లు బాగుపడ్డారా లేదా అనేది కాదు. మాస్టరుగారు ఒకచోట స్పష్టంగా రాస్తారు. ఈ సత్సంగాల్లో జరిగేటటువంటి లోపం ఏంటంటే ఇతరుల యొక్క బలహీనతలను గుర్తించటము, వాళ్లకి చెప్పటము. ‘ఏంటండీ మాస్టరుగారు యిట్లాగే చెప్పారా?’ అంటారన్నమాట. ఇట్లా కాదండి చెప్పింది. వాడు వినటం లేదు, పోనీ వాడు బాగుపడడు. వాడికి చెప్పరాదా అంటారు. మనం ఇద్దరిని గనుక కూర్చోబెట్టి ఒరే నువ్వూరుకోరా. పోనీ నువ్వూరుకోమ్మా తల్లీ, ఆమె అట్లాంటిదే అనుకో గయ్యాళి అనుకో.. నువ్వు ఊరుకో అంటే, ఆ మాట ఆమెకే చెప్పొచ్చుగా నాకెందుకు 7


  చెబుతారు అంటారు. ఎందుకు చెబుతారు? ఆమె బాగుపడదు. నువ్వు కూడా బాగుపడవా? అంటే నేను బాగుపడను. ఆమెను బాగు పరుస్తే బాగుపరచు నీకు శక్తి ఉంటే. అదీ ఉద్దేశ్యం. నీకు శక్తి వుంటే అవతల వాళ్ళని బాగు పరచవయ్యా. నాది తప్పంటావేమిటి. ఆమె మాట్లాడితే ఆమె అట్లాగే అంటుంది అంటూ సపోర్ట్ చేస్తావేమిటి? నీకేమైనా ఎక్కువ దక్షిణ యిచ్చిందో ఏమి పాడో అనుకుంటారు. పెద్ద పట్టుచీర పెట్టినట్టుంది అందుకని ఆమెకి సపోర్టు చేస్తున్నారు అని అనుకుంటారు. మాస్టరుగారు వున్న దగ్గర నుంచీ వచ్చిన గొడవలే యివన్నీ! మాస్టారు కాబట్టి భరించారు అది వేరే సంగతి. వాళ్ల దోవన వాళ్లు వెళ్లిపోతూ వుంటారు వీళ్లని తిట్టుకుంటూ అంతే. అట్లా ఉంటుందన్నమాట. అంతేగాని, చెప్పేవాళ్లు మాస్టరుగారుకదా. మనకు చెప్పారు గదా మనమాచరిద్దాం అనుకోడు.. వాడికెందుకు చెప్పలేదు. సరే వాడు భ్రష్టుడవుతాడు. నువ్వు కూడా అవుతావా? అవుతాను గానీ నేను మటుకు మారను. వాడిని మార్చండి ముందు తర్వాత నేను బాగుపడటం సంగతి చూస్తా అంటాడు. మన సత్సంగాలు అలా వుంటున్నాయి. అందుకని సత్సంగాల్లో మాస్టరుగారు చెప్పిందేమిటి? ఆయన ప్రబోధామృతములో ఎలా చెప్పారు? ప్రతి సత్సంగం వాళ్ళూ, సత్సంగముభజన అనేటువంటి పుస్తకం తీసుకుని దానిలో ఎటువంటి లోపాలు మనలో వస్తాయనేది ఆలోచించుకుని సత్సంగం చేస్తే మనం కొద్దిగా 8

మాస్టరుగారు యిష్టపడే రీతిన ప్రవర్తిస్తున్నట్టు లెక్క. అలాగే పెద్ద పెద్ద అన్నదానాలు. చాలా చాలా ఖర్చు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, ఇంకా వస్త్ర దానాలు చేస్తున్నారు, ఇంకా ఏంటేంటో చేస్తున్నారు. ఎన్ని చేసినా కూడా మనకు కావలసినదేంటంటే మనలోనున్నటువంటి సత్వగుణం పెరగటం. అదొక్కటే చూసుకోవాలి. అక్కడా మళ్లీ తేడాలొస్తున్నాయి. అన్నదానం చేసే చోటుకి నలుగురు వెడితే నలుగురిలో విభేదాలొస్తున్నాయి. నేను ముందంటే నేను ముందని, లేకపోతే ఒకడు ఫోటోలు తీసుకునే చోట నేను నిలబడాలంటే, ఇంకోకడికి ఇంకోచోట నన్ను నిలబెట్టలేదని బాధ. అంటే బృందం వెళతారు ఫొటోలు దిగుతారు. ఎందుకంటే పత్రికలో వేయాలి, ఏదో చూపించుకోవాలిగా. ఇది గుప్త దానమనేది కాదు ప్రస్తుతం. గుప్తదానమనేది లుప్తమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఆడంబర దానాలు ఎక్కువైనాయి. కాబట్టి మా సంస్థ చేసింది యిట్లా. ఆ ఫొటోలు దిగాలి. బావుంది. సంస్థ తరఫున చేస్తున్నారు. సంస్థకి దానాలు యిస్తున్నారు. చాలామంది దాతలు యిస్తున్నారు డబ్బులు. ఈ సంస్థలకు వెళ్లే వాళ్లు వెళతారు. ఒక అనాథ శరణాలయానికి వెళతారు. వెళ్ళిన తర్వాత అక్కడ సంస్థకి కావలసిన ప్రచారం కావాలికదా! కాబట్టి ఫొటోలు తప్పకుండా తీసుకోవాలి. వీడియోలు కూడా తీసుకోవాలి. అక్కడ వస్తుంది మళ్ళీ క్లాష్. ఎవరు ముందు దిగాలి ఫొటో. నన్ను

 2020

దింపలేదని వాడే దిగాడని ఇంకొకళ్ళు. ఇట్లా అన్నమాట. ఇట్లా యిచ్చేటప్పుడు ఫొటోలు కావాలి. ఫోటో ఎవరికీ తెలియదు. ఎవరో ఏదో సంస్థవారు వేశారు బ్యానరు చూశాము. ఆ మనిషి మనకేం తెలుస్తుంది. అసలు తెలీదు. సంస్థ వారు చేశారన్నదొక్కటే గుర్తుంటుంది. కానీ దగ్గర వాళ్లకి తెలియాలి. నేనిచ్చాననేటటువంటి లోపల గొప్పతనమనేటటువంటి భావన, చూసేవాళ్ళు గొప్పగా అనుకోవాలి.. మనం ఎవరో తెలియని వాళ్లు ఏమీ అనుకోరు. వాళ్ళెవరో మనకు తెలియదు. అనామకులు. ఎవరైనా ఒక్కటే. కానీ తెలిసిన వాళ్లకి ఫలాన వాళ్ళండి. చూశారా ఎట్టా ఇస్తున్నదో! అనుకోవాలి. అలా అనుకుంటే మనకు తృప్తి. అంటే ఏమిటన్నమాట లోపల సన్నగా కీర్తికాంక్ష. అది వాళ్లకూ తెలియదు. అది మనకీ తెలియదు. ఆ చిన్న కీర్తికాంక్ష అభివృధ్ధియై వ్రేళ్ళూనుకొని రానురాను అది వృక్షమై విభేదాలకు దారితీసి... అయిపోయిందిక. నెనీసారి వేరేపోతా అంటారు. వేరే పోవటమే ఇంక. వేరే కాపురం పెట్టినట్టే లెక్క. అలా అవుతున్న దన్నమాట. అక్కడ తేడాలు వస్తున్నాయి. ప్రతిచోట మాస్టరుగారు ఏవైతే చెప్పారో, ఏవైతే చెయ్యవద్దు అని చాలాసార్లు ఆయన ఊపిరి వున్నంతవరకు ప్రాకులాడరో, ఎటువంటి భావాలైతే ప్రజల్లో రాకూడదు, బాబా భక్తుల్లో రాకూడదు, బాబా చెప్పినదాన్ని ఎట్లా ఆచరించాలి, ఎలా ఉండాలి అనేదాని కోసం ప్రాకులాడారో అది తప్ప మిగతావన్నీ జరుగుతున్నాయి చాలా చోట్ల.


  మహాత్మాగాంధీ గనుక స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎలా వుండాలి భారతదేశం అని అనుకున్నారో, దానికి వ్యతిరేకంగా మనం ఎట్లా వుంటున్నామో మన దేశం ఎలా వుంటోందో! అలాగే మాస్టరుగారు ఆశించిన సత్సంగాలు గాని, మాస్టరు గారాశించిన అన్నదానాలు గానీ, మాస్టరు గారు ఆశించిన మరి ఏ కార్యక్రమాలైనాసరే అలా జరుగుతున్నాయో లేదో కొంచెం ఆలోచించండి. ఆలోచించి మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన కోరేది ఈ ఆర్భాటాలు కాదు. అట్లానే ఆర్భాటాలు చేయకూడదు అని కాదు. బాబాకూడా కోరలేదు. కానీ మనం హాయిగా చేసుకుంటున్నాం. బాబా కెన్నో కిరీటాలు, వజ్రకిరీటాలు కూడా అర్పిస్తున్నాం. మన సంతోషానికి అది చిహ్నం. తండ్రికి మనం అర్పించుకునేటటువంటి కానుకలు అవి. అయన ఇచ్చిన దాంట్లో ఎంతోకొంత మనం సమర్పించుకోవాల్సిందే తప్పదు. కానీ ఆయన కోరేదాన్ని కూడా మనం తప్పకుండా సమర్పించుకోవాలి. ఆయన కోరే దేమిటంటే సాటి మనిషితో సమన్వయంగా వుండటం. ప్రతిదానిలోనూ మన భావాలు సరిదిద్దుకోవటం. సత్వగుణాన్ని మనం పెంపొందించుకోవటం. అందరం కలిసి మెలిసి జీవించటం. అందరం కలిసి జీవించినప్పుడు దానికి ఎంతటి బలం ఉంటుందో స్వాతంత్ర పోరాటంలోనే మనం చూడవచ్చు. ఒక్క గడ్డిపోచ లాంటి, సన్నటి ఆయన ఎక్కడో దక్షిణాఫ్రికాలో

ఉండి స్వతంత్ర్య ఉద్యమాన్ని చేపట్టాడు. ఆ రోజు ఆయన్ని విసిరి అవతల పడేశారు, తన్నారు. కానీ ఆయన పట్టుదల, ఆయన కార్యదీక్ష, ఆయనలో వున్నటువంటి సద్గుణాలు దేశం మొత్తాన్ని కుదిపి పారేసినాయి. ఎవరంటే వాళ్లు వెళ్లిపోతాం తీసుకుపోండి అనే వాళ్లట. జైలుకు పంపిస్తామంటే; పద, నువ్వు తీసుకెళ్ళటమేమిటి జైలుకి మేమే వస్తున్నాం అనేటటువంటి ఊపు ఎక్కడ నుండి వచ్చింది?. ఆయనలో వున్న బలంలోంచి, ఆ సత్యదీక్ష, కార్యదీక్షలోనుంచి. కరెక్టుగా నడిచాడు కాబట్టి ఆయనను అనుసరించారు. కరెక్టుగా నడవని వాళ్లను అనుసరించడం లేదా అనకండి వాళ్లనీ అనుసరిస్తున్నారు. కానీ ఆ అనుసరణ ఎట్లాంటి వైపుకు దారితీస్తుంది. మూడువందల ఏళ్లు పాలించిన ఆ బ్రిటిషు సామ్రాజ్యాన్ని సునాయాసంగా వెళ్లగొట్టగలిగాం. సునాయాసమంటే వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయినారు. మనమేం తుపాకులు పట్టుకోలేదు. వాళ్ళు తుపాకులు పట్టుకుని కూడా మనల్ని ఏమీ చేయలేకపోయారు. మనం ఏమీ తుపాకులు పట్టుకోక పోయినా వాళ్ళని వెళ్లగొట్టగలిగాం. అది సత్య మార్గం అంటే. అదీ సమన్వయం అంటే. ఏకతాటి మీద నిలబడడం అంటే. అలా ఒక తాటి మీద బాబా భక్తులం అందరం, మాస్టరుగారి భక్తులం అందరం, బిడ్డలం అందరం నడవాలి. అలా నడిచినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. అట్టా చేసినప్పుడు మాత్రమే మనం మాస్టరుగారికి

 2020

యిష్టమైనట్లు ప్రవర్తించినట్లు లెక్క. ఎలాగంటే పూజలు చేస్తే సంతోష పడరా అంటే తప్పకుండా పడతారు. కానీ మాట వినని వాడితో అసంతృప్తి లోపల వుంటుంది తప్పకుండా. ఒక తండ్రికి పూజ చేస్తున్నాడు పిల్లవాడు నువ్వెంత గొప్పవాడవని, కానీ మాట వినడనుకోండి చాలా బాధ లోపల వుంటుంది. పూజ చేసినందుకు సంతోషమే. కానీ మాట వినటంలేదే, వీడు చెడిపోతున్నాడే అనిపిస్తూ చాలా బాధపడుతుంటారు వాళ్ళు. అందుకని ఆ బాధపెట్టేటటువంటి బిడ్డలుగా మనం ఎప్పుడూ వుండకూడదు. మనం ఆయనని సంతోషపరిచేటటువంటి వాళ్లుగా వుండాలి. అలాంటి గుణాల్ని, అలాంటి సమన్వయాన్ని మనం ఎప్పుడూ అలవర్చుకోవాలి. అట్లా అలవర్చుకునేటటువంటి శక్తిని, బోధని అన్ని పుస్తకాలలోనూ మాస్టరుగారిచ్చారు. బాబా సూక్తులుగా చెప్పారు. ఆ సూక్తులు ఆచరించడం కూడా మనకి అంత లోతుగా తెలియదు. కాబట్టి ప్రబోధామృతంలో మాస్టరుగారు ఆ సూక్తులకు వివరణ యిస్తూ ఎలా ఆచరించాలో చెప్పారు. దానిని మెల్లమెల్లగా మనం చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ ఆ రకంగా నడవాలని అట్టి శక్తిని ప్రసాదించాలని సాయిబాబాని, పూజ్యశ్రీ మాస్టరుగారిని ప్రార్థిస్తున్నాను. జై సాయిమాస్టర్!

(మార్చి 6, 2009న ఒంగోలులో పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ తల్లి అనుగ్రహ భాషణం) 9


 

సాయి జీవన విధానంలో ప్ర ధాన సూత్రం 'సాయిబాబా'

త్యుత్తమమైన సాయి జీవన విధానములోని ప్రధాన సూత్రం తమ గురువును గూర్చి అనన్య చింతన. వారి చరిత్ర గ్రంథాలలోను, బోధనలలోనూ చూస్తే ఎప్పుడో తప్ప వారి గురువు గురించి మాట్లాడేవారు కాదేమో అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. శ్రీ సాయి శరణానంద స్వామి వంటి ప్రత్యక్షభక్తులను విచారించగా, సాయి ఎంతో తరచుగా తమ గురువు గూర్చి ప్రస్తావించేవారు అని తెలుస్తుంది. వారి పేరు ‘రోషన్ షా’ అని కొందరితోను, ‘వెంకూసా’ అని కొందరితోను చెబుతూ ఎన్నో నిగూఢమైన సంగతి సందర్భాలు కూడా ప్రస్తావిస్తూ వుండేవారని తెలుస్తుంది. అయితే వారు చెప్పిన విశేషాలు కొద్ది పరిమిత అంశాలకు మాత్రమే సంబంధించినవై వుండడం వలన వాటిని గ్రంథస్థం చేసినప్పుడు అలా అనిపిస్తాయి. అనుక్షణమూ లోకుల తీరును, ప్రతి సంఘటనను వారి గురువు యొక్క చర్యలతో పోల్చుకుంటూ ఉండేవారని తోస్తుంది. ఉదాహరణకు “నా వద్దకు వచ్చే వారంతా తే,

10

తెమ్మంటారు. నా గురువు ఎంతకూ యిచ్చివేయమంటారు” అనేవారు. వారి గురువు వలె సాయికి కూడా ఒక ఊరు, పేరు, మతము, కులము లేవు. సర్వ జీవులతో సత్సంబంధాలే కానీ లౌకికము పరిమితం అయిన బంధాలే లేవు. వారిద్దరూ ఎవ్వరికీ ఎన్నడూ మంత్రోపదేశం చేయలేదు. ఎవరిని వారి శిష్యులుగా తలచలేదు. ఇద్దరూ ఈ సృష్టిలో సర్వము భగవంతుడిదేనన్న ప్రజ్ఞతో జీవించేవారు. ఇట్టి నిరంతర సద్గురు చింతన వారు మనకు చూపిన సూత్రం. ఇందుకు సహకారులుగా శ్రీ జ్ఞానేశ్వర మహారాజు (ఆళంది), శ్రీ తుకారాం మహారాజ్ (దేహు) వంటి మహనీయులను కీర్తించే హారతులను భక్తితో పొంగిపొరలే హృదయముతో నిత్యము నాలుగుసార్లు ఆలకించేవారు. గురుతత్వాన్ని చక్కగా వివరించే ఏకనాథ భాగవతము (భాగవతం ఏకాదశ స్కంధము), శ్రీ గురుచరిత్ర మొదలైనవి పారాయణ చేయమని భక్తులను ఉద్భోదించేవారు. తమను నాశ్రయించిన భక్తులలా సాధన

 2020

చేయగలందులకు తమ చరిత్ర రాయడానికి హేమాద్పంతుకే గాక శ్రీ బి.వి. నరసింహస్వామి, సాయి శరణానంద స్వామి మొదలైన ఎందరికో ఆశీస్సుల ననుగ్రహించారు. కేవలం పారాయణము ఏమి చేయగలదని శంకించే వారికి సమాధానంగా తాము కూడా అంత్యదశలో ‘శ్రీ రామవిజయము’ అనే సద్గ్రంథం మూడుసార్లు నిరంతర శ్రవణం చేశారు. అవసానదశలో తమ వద్దకు వచ్చిన విజయానందుడనే సన్యాసి చేత నిరంతరం భాగవత పఠనం చేయించారు. భక్తుడైన దాసగణు ఎక్కువ సమయం శిరిడీలోని విఠలుని ఆలయంలో కూర్చొని భక్తవర్యుల చరిత్రలు హరికథలుగా వ్రాసి గానం చేసేలాగా ప్రోత్సహించారు. మహనీయుల చరిత్రలు, బోధలుగాక, కేవల వేదాంతాది శాస్త్ర గ్రంథపఠనను ఆయన ప్రోత్సహించలేదు. వీరు గ్రంథాలలో బ్రహ్మాన్ని అన్వేషిస్తున్నారు. వారికి లభించేది భ్రమేననే వారు.


 

పూజ్య ఆచార్య

శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టరుగారు గురుపత్ని అలివేలు మంగమ్మ

పూ

జ్యశ్రీ భరద్వాజ మాస్టరుగారి గురించి చెప్పాలంటే ఏమని చెప్పగలము? ఎంతని చెప్పగలము? ఆయనను అంచనా వేయడంలో మన పాత్ర ఎంత స్వల్పము? ఆయన మహాసముద్రమువంటి వారు అనుకుంటే అందులోని అలలవంటి వాళ్ళమైన మనం సముద్రం గురించి పూర్తిగా తెలుసుకొనగలమా? అలాగే ఆయన వ్యక్తిత్వం మన స్వల్ప మేథస్సుకు అసలు అందుతుందా అన్నది అనుమానమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పరిపూర్ణ మానవుడు అంటే సరిపోతుందేమో! కారణం దానిలోనే ఆయనలోని గుణాలన్నీ యిమిడి వున్నాయి గనుక. పరిపూర్ణ మానవునిలో వుండే ధర్మగుణము, దయ, శాంతి, క్షమ, ప్రేమ, ధీరత్వము... ఇంకా ఎన్నో సద్గుణాలు ఆయనలో వున్నాయి. పూజ్యశ్రీ మాస్టరుగారికి

చిన్నప్పుడే మాతృవియోగం సంభవించడంలో జీవితంలో మొట్టమొదటి దెబ్బ తగిలింది. దానితో ఆయనలో అప్పుడే నిరాశ, నిస్పృహ, స్తబ్దత చోటుచేసుకొన్నాయి. తర్వాత గూడ దాని నుండి ఆయన పూర్తిగా కోలుకోలేదనే అనిపిస్తుంది. తర్వాత దెబ్బ మీద దెబ్బ అన్నట్లు అన్నగారి కుమారుని మరణంతో అణగివున్న ఆయన అన్వేషణ మేల్కొనడమే గాక తీవ్రతరమైంది. సత్యాన్ని తెలుసుకునేదాకా ఆ అన్వేషణ ఆయనను నిద్రపోనివ్వలేదు. అట్టి అన్వేషణలో భాగంగా అనేక ప్రశ్నలుద్భవించడమే గాక ఒకానొక రోజున సమాధానం దొరకడం గూడ సంభవించింది. ఆ తర్వాత ఆయన సమర్థ సద్గురువైన సాయినాథుని దర్శనానికి వెళ్ళడము, శ్రీసాయిబాబా పూజ్యశ్రీ మాస్టరుగారికి ఆత్మానుభవము ప్రసాదించడము అందరికీ తెలిసిన విషయమే.

 2020

అయితే ఎంతోమందికి అట్టి జ్ఞానం సాధన ద్వారాగాని, పూర్ణపురుషుల అనుగ్రహం వల్లగానీ కలిగివుండవచ్చు. అయితే అట్టి జ్ఞానం కలిగినవారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వుంటారు. వారి చర్యలు, బోధలు గూడ వేర్వేరుగానే వుంటాయి. అలాగే పూజ్యశ్రీ మాస్టరుగారి బోధనాదక్షత, వారి వ్యక్తిత్వము చాలా భిన్నంగా వుంటాయి. అంటే ఆయన వ్యక్తిత్వం మామూలుగా వున్నట్లు పైకి కన్పించినప్పటికీ ఆయన చేసే ప్రతి చిన్నపనీ గూడ ప్రత్యేకంగా వుండి మనలకు ఏదో ఒక బోధ చేస్తూనే వుంటుంది. ఇక ఆయన బోధనాదక్షత ఎంతటిదో చెప్పడం ఎవరికీ సాధ్యంకాదు. ఆయన చెప్పే ప్రతి విషయము నిత్య జీవితంలో మనము ఎదుర్కొనే వ్యక్తుల, సంఘటనలకు పరిష్కార మార్గం సూచిస్తూంటుంది. వాటిని ఆయన మనకు బోధించడం మాత్రమేగాక, 11


  అవి మనలను ఆలోచింపజేసేవిగా వుంటాయి. అంటే ఒక విధంగా ఆయన మనకు ఆలోచనా విధానాన్ని బోధిస్తున్నారన్నమాట. ఎలాగంటే ఒక లెక్కకు సమాధానం చెప్పడము, లేక చేసి చూపించడము గాక, ఆ లెక్కని ఎలా చేయాలో నేర్పితే అప్పుడు మనం ఎన్ని లెక్కలనైనా చేయగలుగుతాము. అలా వుంటుంది ఆయన బోధ. కనుక మనకు జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారాన్ని ఎలా ఆలోచించాలో నేర్పడం వల్ల ఎటువంటి పరిస్థితులను ఎలా పరిష్కరించుకోవాలో మనకు తెలుస్తుంది గదా! అట్టి ఆలోచనా విధానాన్ని తెలుపడం ఆయనలోని ప్రత్యేకత. సంతోషంలోను, దుఃఖంలోనూ ఎలా ఆలోచిస్తే మనం సుఖాలకు పొంగని, దుఃఖాలకు కృంగని మానసిక స్థితిని చేరుకోగలుగుతామో అట్టి కీలకమైన ఆలోచనా పద్ధతిని నేర్పుతారాయన. అందుకని ఆయన బోధనలను మనం ఆచరించగలిగితే ఎంతటి భక్తులకు, యోగులకు, తపస్వులకూ సాధ్యంగాని అసలైన పారమార్థికత మనకు లభిస్తుంది. ఇంతకంటే ఎవరైనా పొందవలసిన ఆధ్యాత్మికత ఏమున్నది? అందుకని ఆయన బోధనాదక్షత అసామాన్యమనే చెప్పాలి. ఇక జ్ఞాన విజ్ఞాన సమన్వయంలో ఆయన కాయనయే సాటి. నాస్తిక, హేతువాదులకు వచ్చే ప్రశ్నలను, అనుమానాలను ఆయనే వేసుకుని, వాటికి సమాధానాన్ని తమ వివేచన ద్వారా పొందగలిగారు గనుక వాటి సమన్వయాన్ని ఆయన చక్కగా వివరించగలరు. ఇది ఆయనలోని 12

మరొక విశిష్టత. సకల జీవుల పట్ల ఆయనకున్న కరుణ అపారము. తమ వద్దకు వచ్చిన ప్రతివారికి అత్యుత్తమ శ్రేయస్సు చేకూర్చడానికి ఆయనపడే తపన చూస్తూంటే ఆశ్చర్యమేస్తుంది. ఒకప్పుడు తమకు సన్నిహితంగా వుండి తర్వాత తమకు వ్యతిరేకమైనవారి పట్ల కూడా ఆయన కరుణ చూస్తూంటే కళ్ళు చెమర్చకమానవు. ఎవరు తమను ఎటువంటి ప్రశ్నలు వేసినా ఆయన ఓర్పుతో సమాధానం చెప్పేవారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అజ్ఞానుల నుంచి జ్ఞానార్థులవరకు, ఆకతాయతనంగా వుండే యువకులనుంచి, వెటకారంగా మాట్లాడే వ్యతిరేకుల వరకూ ఆయనను అడిగే ప్రశ్నలకు ఎంతో ఓర్పుతో సమాధానం చెప్పేవారు. ఉదాహరణకు ‘భగవంతుడు వున్నాడా? వుంటే ఎలా వుంటాడు?’ అన్న పెద్ద పెద్ద ప్రశ్నలు వేసేవారికి, ‘మీరెందుకు సిగరెట్లు తాగుతున్నారు? స్వామి ఇచ్చినా తర్వాత మానెయ్యవచ్చుకదా!’ అని ఎగతాళిగా ప్రశ్నలు వేసేవారికి ‘మీరు వ్రాసే శ్రీసాయిలీలామృతము ప్రతిసారీ ఎందుకు మార్పులు చేస్తున్నారు? డబ్బు సంపాదించుకోడానికా?’ అని నిలదీసేవారికి ఆయన ఎవరి మానసిక స్థాయికి అర్థమయ్యేరీతిలో వారికి తగిన సమాధానం చిరునవ్వుతోను, జోక్ గానూ సమాధానం చెప్పేవారు. ఇటువంటి ప్రశ్నలు నా అంతటివాణ్ణి వేయడమేమిటి? అన్న అహంకారం ఆయనలో మచ్చుకైనా కన్పించేది కాదు. ‘నీకేంటి సమాధానం చెప్పేది’ అని ఆయన ఎన్నడూ అనేవారు కాదు. చాలామంది గురువులు భక్తులకు

 2020

అంత చనువును యివ్వరు. అందుకని గురువులను ఏమి ప్రశ్నించాలన్నా ఏమంటారోనని, అడగవచ్చో, అడగకూడదోననీ వారు భయపడుతూ వుంటారు. గురువులు గూడ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కొన్నింటికి చెప్పరు, కొన్నింటికి కోప్పడతారు. అంతెందుకు? వారి దగ్గర నుంచోడానికి గాని కూర్చోడానికి గానీ శిష్యులకు భయమే. కానీ పూజ్యశ్రీ మాస్టరుగారి దగ్గర అలా వుండదు. చిన్నవారైనా, పెద్దవారైనా ఎటువంటి మంచి ప్రశ్నవేసినా, చొప్పదంటు ప్రశ్నవేసినా వారు ఎంతో సౌమ్యంగా సమాధానం చెప్పేవారు. అందరూ మనసులు విప్పి మాట్లాడేటట్లుగా వుండేది ఆయన ప్రవర్తన. ఆయన ఎదురుగా కొందరు కాళ్ళు జాపుకుని కూర్చునేవారు. కొందరు సిగరెట్టు త్రాగేవారు కూడ. అయినా ఆయన అవేవీ పట్టించుకునేవారు కాదు. ఒకసారి పూజ్యశ్రీ మాస్టరుగారిని కొంతమంది యువకులు అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన ఎంతో ఓర్పుగా సమాధానం చెబుతున్నారు. అప్పుడు మా మామగారు శ్రీమాన్ అనంతాచార్యులవారు మా వద్దనే వున్నారు. ఆయన గూడ ఆ వాదనలను వింటున్నారు. కొంతసేపటికి ఆయనకు అసహనం పెరిగిపోయింది. సత్సంగహాలు నుంచి గబగబా లోపలకు వచ్చి నాతో, “ఏమిటమ్మా వాళ్ళ పిచ్చి ప్రశ్నలు? వెధవలు, వెధవలు తెలుసుకోవాలనే జిజ్ఞాసే లేదు. పెడగా ప్రశ్నలు వేయడమే పనిగా పెట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళకు సమాధానం చెప్పడమెందుకు?


  వీడి ఓపికంతా పోవడం తప్ప ప్రయోజనమేమీ వుండదు. నువ్వైనా లోపలకు పిలువమ్మా. లేకపోతే ఆ వాదనలు అలాగే కొనసాగుతూనే వుంటాయి” అన్నారు. అంటే చూసేవారికి వినేవారికి అలా అనిపించేది. ఎంతసేపైనా వారిని సమాధానపరచి బాగుపరచాలన్నదే పూజ్యశ్రీ మాస్టరుగారి తాపత్రయం. ఆ తాపత్రయం చూస్తుంటే ‘మాతృప్రేమ’ అంటే యిదేనేమో అనిపిస్తుంది. పిల్లలు ఎటువంటివారైనా వాళ్ళు బాగుపడాలనే చూసే తల్లివలె ఆయన అందరిపట్ల ఎంతో తాపత్రయపడేవారు. ఇక నా విషయానికొస్తే ఆయన నాకు ఆధ్యాత్మిక శిక్షణను ఎంతగా యిచ్చారో! చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా ఎలా ఆలోచించాలో ఆయన నాకు బోధిస్తూనే వుండేవారు. చిన్నదైన గొంగళి పురుగును చూసి నేను భయపడుతున్నప్పుడు, ఇల్లు శుభ్రంగా లేకపోతే నాకు బాగుండదు అన్నప్పుడు ఆయన చెప్పిన ఆలోచనా విధానం నా మానసిక స్థాయినే మార్చివేసింది. ద్వేషమే కాదు, రాగము కూడా ఆధ్యాత్మికంగా ఆటంకమే అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది. రాగమెలా ఆటంకమో ఆయన వివరంగా చెప్పారు. మిన్ను విరిగి మీద పడ్డా మొక్కవోని ధైర్యము, ఆత్మవిశ్వాసము ఆయన స్వంతం. అది ఎన్నో సందర్భాలలో ప్రత్యక్షంగా చూసాను. ఇటువంటి పరిస్థితులలో గూడ యిలా వుండడం సాధ్యమా? అని ఆశ్చర్యపోవడం నావంతయ్యేది.

ఆయన తమ జీవితంలో ఎన్నో క్లిష్ట సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ అవేవీ నాతో చెప్పకుండా ఏమీ జరుగనట్లే మామూలుగానే వున్న తీరు నన్నెంతో ఆశ్చర్యపరచింది. అవతలి వాళ్ళను అంతగా ప్రేమించగలగడం ఆయనకే సాధ్యమనిపించింది. “వంతెనపై ఎవరూ ఇల్లు కట్టుకోరు” అన్న ఆయన సూక్తిని గూర్చి ఆలోచిస్తుంటే జీవితంలో ఏది నిలువనిదేనని నిలిచేది మన ప్రవర్తనేనని, మనం చేసుకునే కర్మలే ఎన్నో జన్మలెత్తడానికి కారణమవుతాయని, ఒకవేళ భో గ భా గ్యా ల న ను భ విం చే జన్మలొచ్చినప్పటికీ ‘ఇది వంతెన మాత్రమే’నని గుర్తుపెట్టుకుని దాటిపోవడానికి అంటే జన్మ పరంపరలను అతిక్రమించడానికి ప్రయత్నించకపోతే మళ్ళీ మళ్ళీ కష్టాలననుభవించే జన్మలెత్తే ప్రమాదం పొంచి వుంటుందనే సత్యాన్ని నాకు బోధపరచింది. అప్పుడు ఏది ఎలా జరిగినా ఏమిటి నష్టం? అన్న ధైర్యం వచ్చింది. ఇలా జరిగితే బాగుండననే ఆలోచనను తీసివేయడం ఎంతో తేలికగా అనిపించింది. అప్పుడు జీవితంలో ఏది ఎలా జరిగినా చింతపడాల్సిన అవసరం లేదు. పిల్లల పట్ల ఆయన చూపించే శ్రద్ధ, ప్రేమ మరెవ్వరూ చూపించరేమో! అంతటి పని ఒత్తిడిలోనూ వారి చదువు, ఆరోగ్యము, ఆధ్యాత్మికతకు అవసరమైన బీజాలు వేయడంలో ఆయన సమర్థత అమోఘము. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తమకు చేతనైనంత సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ

 2020

సంసిద్ధులుగా వుండేవారు. ఆపదలలో ఆదుకునేందుకు ఆయన వున్నారనే ధైర్యం ఆయన పరిచయస్థులలో వుండేది. మానవత్వ దృష్టిలో చూస్తే ప్రేమ, దయ, క్షమ, దానము, ధైర్యము, ఆత్మవిశ్వాసము, పెద్దల ఎడల గౌరవము మొllన సద్గుణాలన్నీ ఆయనలో వున్నాయి. అందుకే ఆయన పరిపూర్ణ మానవుడు. ఇక ఆధ్యాత్మిక దృష్టి చూస్తే వీటికి తోడు గురుభక్తి, వైరాగ్యము, తత్త్వజ్ఞానము మొllనవన్నీ ఆయనలో నిండుగా వున్నాయి. నాకు ఆయన గురించి వివాహం అయ్యేంతవరకూ పెద్దగా తెలియదు. చాలా మంచివారని, సాయిబాబా భక్తులనీ మాత్రమే తెలుసు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాతనే ఆయన యొక్క గొప్పతనం గురించి అవగతమవుతూ వచ్చింది. రాను రానూ యింకా యింకా తెలుస్తూ వచ్చింది. తర్వాత అంతటి గొప్పవారు మరొకరు వుండరని, వుండబోరనీ స్పష్టంగా తెలిసింది. ఆయన చెప్పే మాటలను పట్టుకుని వెళ్ళగలిగితే జీవితంలో దుఃఖానికి తావే లేదు అన్నది సత్యం. ఏ విషయంలోనైనా సరే ఆయనలో లోపమెంచడానికి కొంచెం గూడ అవకాశముండదు. గురుభక్తిపరంగా చూస్తే శిరిడీలో మొదటిసారిగా బాబా తమకు అనుభవము యిచ్చినప్పటి నుండి జీవితాంతము ఆయన స్మరణే తమ శ్వాసగా ఆయన జీవించారు. ఉత్తమ గురుభక్తుని వలె ఆయన తమ గురువు చెప్పినదానినే ఆచరిస్తూ గురువు తమను ఎలా 13


  వుంచితే అలా జీవించారు. ఆయన తమలోని దివ్యశక్తులను ఏనాడూ ప్రకటించుకోలేదు. అప్పుడప్పుడు అవంతట అవే బయటపడేవి. ఆయన ఒక్కొక్కప్పుడు ఇతరుల బాధలను తాము అనుభవించేవారు. ఆ సంగతి గూడ ఎవరికీ తెలియనిచ్చేవారు కాదు. ఒకసారి ఒకతనికి పిరుదుపై గడ్డ (కురుపు) లేచింది. అతడు కూర్చోలేక బాధపడుతున్నాడు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టరుగారు అతని, “ఒరేయ్! నీకు ఎక్కడ కురుపులేచిందో అటువైపు నీవు నేలకానించి కూర్చుని ఆ కుండలో నీళ్ళు ఒక గ్లాసెడు తీసుకొచ్చి నాకివ్వు” అన్నారు. విద్యానగర్ లో పూజ్యశ్రీ మాస్టరుగారు కూర్చునే హాలులో వాకిలి ప్రక్కగా అందరూ త్రాగడానికి ఒక కుండలో మంచినీళ్ళు వుంచేవారు. అతడు పూజ్యశ్రీ మాస్టరుగారు చెప్పినట్లే చేసాడు. ఆ మంచినీళ్ళు పూజ్యశ్రీ మాస్టరుగారు త్రాగారు. వెంటనే అతనికి ఆ కురుపు అణగిపోయింది. కానీ పూజ్యశ్రీ మాస్టరుగారికి మాత్రం కొద్ది క్షణాలలోనే నుదిటి మీద కురుపు వచ్చింది! ఎంత పని ఒత్తిడిలో వున్నా మధ్యాహ్న సమయంలో పిల్లలు బడినుంచి వచ్చి భోజనాలు చేసేటప్పుడు ఆయన సాధ్యమైనంత వరకూ పిల్లలతో కలిసి భోజనం చేసేవారు. ఆ సమయంలో వారికి యు.జి.సి కార్యక్రమాలు చూపించేవారు. చిll వేదవతి డాన్సు ప్రోగ్రామ్ కు ఊళ్ళో వుంటే తప్పకుండా వెళ్ళేవారు. కారణం పిల్లలకు తమ తల్లిదండ్రులు, తమ వాళ్ళు చూసి చాలా బాగుందంటే ఎంతో సంతోషం. పైగా అందరి పిల్లల తల్లిదండ్రుల 14

తమ పిల్లల ప్రోగామ్ లు చూడడానికి వస్తారు. నేనెటూవెళ్ళలేను. అందుకని వాళ్ళకు ఆ వెలితి తెలియకుండా ఆయన ప్రయత్నించే వారు. వాళ్ళకు పాఠాలు చెప్పడమే గాక వాళ్ళ ఆటలు గూడ ఆడేవారు. ద్వారకకు క్రికెట్లో మెళకువలు - వేదవతికి డాన్సులోని ఆధ్యాత్మిక తత్త్వం చెప్పేవారు. బాధ్యతను స్వీకరించి దానిని వందశాతం నిర్వర్తిస్తూ ప్రశాంతంగా వుండడం ఆయన యొక్క ప్రత్యేకత. ఆర్థిక పరిస్థితి ఎంతగా బాగుండకపోయినా తమ ప్రయత్నం తాము చేస్తూ, ఆందోళనపడే విక్రమ్ వాళ్ళకు ధైర్యం చెబుతూ ఎవరినీ, చివరకు తాము సహాయం చేస్తే పైకొచ్చిన వాళ్ళనైనా సరే అప్పుగా కూడా ఏమి అడగకుండా వుండే ఆయన నిశ్చింతను చూసి తీరవలసిందే! మానవత్వంగా చూసినా, భగవంతునిపై భారం వేయడం పరంగా చూసినా అలా ఎవరుండగలరు? అనిపిస్తుంది. దూషణ, భూషణ, తిరస్కారాలను సమానంగా స్వీకరించడం ఆయనకు మాత్రమే సాధ్యం. “మనలను గురించి ఎవరు ఎప్పుడు ఏమి మాట్లాడినా అది వారి వారి భావాలను బట్టి వుంటుంది. వారి భావాలు మళ్ళీ మరొకరకంగా మారినప్పుడు వారే విపర్యయంగా మాట్లాడవచ్చు. కానీ మనమెలా వున్నామో మనం చూసుకోవాలి. ఎలా వుండాలో ఆలోచించాలి. బాబాకు యిష్టమైనట్లు నేను ప్రవర్తించగలిగితే చాలు. మిగతావాళ్ళు పొగిడినా, తెగిడినా సంతోషించడానికి గాని, బాధపడడానికి గానీ ఏమున్నది?” అనే వారాయన.

 2020

ఎవరినైనా ఏదైనా చెయ్యమని బలవంతపెట్టడం ఆయన అభిమతంకాదు. అలా చేస్తే హృదయపూర్వకంగా ఎవరూ ఏది చేయలేరు అని చెప్పేవారాయన. అందుకని ఏ విషయంలోనూ ఎవరినీ ఇది చెయ్యవలసిందేననిగాని, ఇలా చెయ్యవలసిందేనని గానీ చెప్పడం చూడలేదు నేను. నా విషయంలో గూడ అంతే. ఏదీ యిలా చెయ్యమని గాని, వద్దనిగానీ ఆయన చెప్పలేదు. ఏది ఎలా చేస్తే మంచిదో, ఎలా ఆలోచిస్తే మంచిదో మాత్రమే చెప్పేవారు. మామూలుగా ప్రపంచంలో మనం చూసే చాలామంది గురువుగార్లకుండే భేషజాలు ఆయనకు లేవు. “తాను గురువునని తలచేవాడు గురువుకాడు” అన్నట్లు ఆయన తాము గురువునని ఏనాడూ చెప్పలేదు, తలచలేదు గూడ. అందుకే ఎక్కడికైనా ఎవరితోనైనా, కొద్దిమందితో కావచ్చు. చాలామందితో కావచ్చు - కలిసి వెళ్ళినప్పుడు ఆయనే స్వయంగా అక్కడి ఏర్పాట్లన్నీ చూసేవారు. సామాన్యంగా గురువులను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలంటే భక్తులు అక్కడ గురువుగారికి ప్రత్యేక ఏర్పాటు చేసి, ప్రత్యేక వాహనంలో వారిని తీసుకువెళ్ళి, వారికి అవసరమైన భోజన సౌకర్యాలు భయభక్తులుతో చేస్తారు. ఎక్కడ వారికి లోపం జరుగతుందేమోనని, పాపం వస్తుందేమోనని, గురువుగారికి ఆగ్రహం వస్తుందేమోనని చాలా జాగ్రత్తగా వుంటారు. కానీ పూజ్యశ్రీ మాస్టరుగారి విషయంలో మాత్రం అది పూర్తి వ్యతిరేకం. భక్తులకే మాస్టరుగారు అన్ని సౌకర్యాలూ చూసేవారు. అంటే ఆయన తమని తాము ఎంతగా


  తగ్గించుకునే వారో అర్థమవుతుంది. “తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడుదురు” అన్న బైబిల్ వాక్యం ఆయన పట్ల ఎంతగా సరిపోతుందో! “నీ దాసుడను, నీ దాసానుదాసుడను” అన్న దానికి ఆచరణ రూపం ఆయన. ఆయన విశ్వసించినది ఆచరించారు. ఆచరించినదే చెప్పారు. ఆయన తాము ఆచరించనిదేదీ చెప్పలేదు. ఆయన నిరంతర శ్రామికుడు. కష్టాలు భగవంతుడిచ్చిన వరాలేమో! ఎప్పుడూ ఏదో పని నిర్విరామంగా చేస్తూనే వుండేవారు. “కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు గదా!” అని అంటే ఆయననే వారు. “సృష్టిలో సహజమైన దేనికి లేని విశ్రాంతి మనకెందుకు? ఒక పనిలో నుంచి మరొక పనిలోకి వెళ్ళడమే విశ్రాంతి. శరీరానికి విశ్రాంతి చాలా తక్కువ అవసరం. విశ్రాంతి సుఖానికి ప్రతీక. సుఖం బద్దకానికి దోవతీస్తుంది. అదీగాక సుఖపడడం వల్ల పుణ్యం ఖర్చయిపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ (Bank Balance) అయిపోయినట్లే. ఎంతగా శ్రమిస్తామో అంతగా ప్రకృతిలోని ప్రతిజీవి యొక్క ఋణము తీర్చుకుంటాము లేకపోతే ఋణానుబంధాన్ని పెంచుకోవడమే జరిగేది. తిరిగి తిరిగి వాటిని తీర్చుకోవడానికి జన్మలెత్తవలసిందే. దానికి అంతమెక్కడ?” అనేవారు. ధ ర ్మ ర క్ష ణ లో ను , న్యాయపోరాటంలోనూ ఆయనెన్నడూ వెనుకంజ వేయలేదు. ప్రేమించినవారు విభిన్నకులాల, మతస్థులవారైనప్పటికీ వారికి వివాహం చేయడం శాస్త్ర సమ్మతమని ఆయన చెప్పేవారు. అందుకని ప్రేమవివాహాలను ఆయన

ధైర్యంగా జరిపించారు. అలాగే కాలేజీలో అధికారులనుంచి ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి ముందుండేవారు. ప్రస్తుత రాజకీయాలు ఆయనకు నచ్చేవి కావు. “సమర్థవంతంగా ఎవరూ పరిపాలించలేనప్పుడు ఎవరికని ఓటెయ్యాలి” అని నిలదీసి అడిగేవారాయన. సమాజ శ్రేయస్సుకు, కుటుంబ శ్రేయస్సుకు, వ్యక్తిగత శ్రేయస్సుకు ధర్మబోధ ఒక్కటే మార్గమని, అది చేస్తూ వుంటే మెల్ల మెల్లగా ప్రజలలో మార్పు వస్తుందని చెప్పేవారు. ధర్మం తప్పి నడచుకోవడం వల్ల వచ్చే కష్టనష్టాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించాలనేవారు. పిల్లలలో నైతిక పరివర్తన తేవాలని ఆయన ఆకాంక్షించేవారు. నేటి సమాజ పరిస్థితులకు లొంగకుండా వుండే ప్రాథమిక బోధన ఇంట్లోనే జరగాలని, సాధ్యమైనంతవరకూ పాఠశాలలకు పంపించకుండా ఇళ్ళల్లోనే విద్యను గరిపే కుటుంబ పరిస్థితులను ఎవరికి వారే ఏర్పరచుకోవాలని ఆయన చెప్పేవారు. అప్పుడు పెద్ద వాళ్ళయిన తర్వాత వాళ్ళు ఎక్కడ వున్నా నైతిక ప్రవర్తన కలిగి వుంటారని ఆయన బోధించేవారు. ఇంతటి గురువు లభించడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలమే. అయినప్పటికీ ఆయన నాశ్రయించి, తర్వాత ఆయన లోపాలెంచి ఆయనకు దూరమవడం దురదృష్టకరమైన విషయమే. ఆయన మాత్రం తమ వద్దకు వచ్చిన ప్రతివారికి ఆధ్యాత్మ బోధ చేస్తూనే వుండేవారు. తమను

 2020

విడిచి ఎవరైనా వెళ్ళినా ఆయన పట్టించుకునేవారు గాదు. వచ్చినవారు తమకు పూజ్యశ్రీ మాస్టరుగారు నచ్చకపోతే వారికై వారే ఆయనను విడిచి వెళ్ళిపోయేవారు. ఆయన దగ్గరకి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళకు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కడైనా మనకు కన్పిస్తుందా? అది మనవైపు నుంచి ఆలోచించినా సమంజసమేనా? ఎవరైనా మనలను కొంచెం అవమానించినా, మనపట్ల వ్యతిరేకంగా ప్రవర్తించినా మనం సహించగలమా? తిరిగి మన వద్దకు వస్తే అంతకుముందు లాగానే ఏమాత్రం తగ్గని ప్రేమతో వాళ్ళతో ప్రవర్తించగలమా? అది ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన పిల్లలను నిజంగా ప్రేమించే తల్లి, తండ్రి గూడ. సాంసా రి క జీవితాన్ని ఆధ్యాత్మికతనూ స మ న ్వ య ప రు చుకుం టూ జీవించడమెలాగో ఆయన చేసి చూపించారు. రెండింటికి ఎక్కడా ఆటంకం రాకుండా జీవించడంలోని మెలకువలు ఆయనను చూసి నేర్చుకోవాలి. ‘కర్మసుకౌశలం’ అన్న గీతా వాక్యానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆయన. మామూలుగా కొద్దిగా భక్తిగా వున్నవారు గూడ లౌకిక విషయాలను పట్టించుకోకుండా వుండడం లోకంలో చూస్తుంటాము. అందుకనే ఆధ్యాత్మిక జీవితమంటే లౌకికత వదులుకోవడం గాబోలు అన్న భయం వల్ల ఆధ్యాత్మిక వైపుకు చాలామంది తొంగిగూడ చూడరు, తొలగిపోతుంటారు. అలాగాక రెండింటినీ సమానంగా తీసుకురావడం పూజ్యశ్రీ మాస్టరుగారి 15


  యందు ప్రకటమవడం చూస్తాము. మామూలు వ్యక్తులకంటే ఎక్కువగా అందరినీ ప్రేమించడం. వారిని పట్టించుకోవడం, వారి అవసరాలు తీర్చడం చేసేవారాయన. ఇంట్లో భార్యా బిడ్డలనే గాదు, సహోధ్యాయులను, విద్యార్థులను, సహోపాధ్యాయులను, తమకు పరిచయమున్న వారందరినీ, తమ వద్దకు వచ్చే ప్రతివారినీ ఆయన ఆదరంగా చూడడము, వారి లౌకిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు పాటుపడడం చేసే వారాయన. ఈ ప్రత్యేక లక్షణం గూడ అందరిలో వుండదు. ఎందుకంటే జీవితంలో అంతవరకూ కష్టాలే చూడని బుద్ధుడు, అన్నగారి పాపను విపరీతంగా ప్రేమించిన వేమన, భార్యను ఎంతగానో ప్రేమించిన తుకారాము, తమకు సంభవించిన ఏదో ఒక సంఘటన ద్వారా పూర్తి విరాగులై సర్వాన్నీ త్యజించారు. ఇక మహాభక్తుల, జ్ఞానుల విషయం చెప్పనవసరం లేదు కానీ పూజ్యశ్రీ మాస్టరుగారు అలాగాదు అట్టి విషాద సంఘటనే ఆయన జీవితంలో గూడ జరిగినప్పటికీ ఆయన వైరాగ్యం పరిధులు దాటలేదు. లోపల పూర్తి విరాగి అయినప్పటికీ బయటకు మాత్రం రాగి వలె (అనురాగి వలె) అన్ని కర్తవ్యాలూ ఆయన నిర్వర్తించారు. “నాకేమీ ఈ ప్రపంచంలో చేయవలసింది లేదు. కానీ నేను ఇతరులకోసం అన్నీ చేస్తాను” అన్న గీతాచార్యుని వచనం పూజ్యశ్రీ మాస్టరుగారి పట్ల పూర్తిగా వర్తిస్తుంది. మళ్ళీ ఆత్మానం మానుషం మన్యే “మామూలు మనిషిగానే నన్ను నేను భావిస్తున్నాను” అన్నట్లు ప్రవర్తించేవారు ఆయన.. ఒక ప్రక్క అన్నీ తెలిసినా 16

గుప్పిడి విప్పకూడదంటూ ఏమీ తెలియనవానివలె ప్రవర్తించేవారాయన “అబ్బే! నాకేమీ తెలియదు. నేను మీకంటే ముందు శిరిడి వెళ్ళాను గనుక మీకు ఆ మార్గం చెబుతున్నాను అంతే!” అని, “నేను గురువును గాదు. అందరికీ గురువు ఆ సాయినాథుడే” అనీ, “నేను ఆయనను చేర్చే వంతెన లాంటి వాడిని” అని చెప్పుకున్నారాయన. పరమ వైరాగ్యంతో సంసారమే వద్దని. సర్వాన్ని త్యజించాలని తలచిన ఆయన గుర్వాదేశంపై వివాహం చేసుకుని, సంసార జీవితంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నారు. ఆయనకు వైరాగ్యమే లేకపోతే “బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లడమేనని” ఎలా చెప్పగలిగేవారు? అలాగాకపోయినా బాబా ఎలా వుంచితే అలా వుండాలనుకోకపోతే గూడ అది సాధ్యంకాదు. అందుకే ఆయన ఉత్తమ గురుభక్తుడు, పరమ వైరాగ్యమూర్తి, ఆయన నన్ను, పిల్లలని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. మాకు ఏ లోటూ రానివ్వలేదు. నా సాధన గూర్చి ఎంతో శ్రద్ధ వహించేవారు. సాధనలో ఎన్నో మెలకువలు చెప్పేవారు. ఏయే సమయాలలో, సందర్భాలలో, పరిస్థితులలో భావనలను సరిగ్గా ఎలా మలచుకోవాలో, ఎలా వివేకంతో ఆలోచించాలో ఆయన చెబుతుండేవారు. ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ వాటినెప్పుడూ నాతో చెప్పేవారు గాదు. నాకు చెప్పి నన్ను బాధ పెట్టడమెందుకని ఆయన భావం కావచ్చు. అలాగాక అనవసరమని గూడ చెప్పకపోయివుండవచ్చు.

 2020

ఇక ఆయన వద్దకు వచ్చిన తర్వాత నా జీవితం వడ్డించిన విస్తరే. నాకు ఏమి లోటున్నది? అవసరమైన అన్నింటినీ ఆయన సమకూర్చారు. పదిమంది వున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు మామూలే. అందరితో సర్దుకుపోవడమే సాధన. ఆయన వద్దకు వచ్చిన ఎవరికీ ఏ చింతా వుండదు. అంతా ఆనందమే. అలాంటిది ఆయన సన్నిధిలో నిరంతరం వున్న నాకు చింతకు తావెక్కడ? ఆయన పవిత్ర ప్రశాంత ఆనంద సాగరం. అందుకని ఆయన సన్నిధిలో నాకు నా శారీరక బాధలు ఏమీ కలత పెట్టలేదు. పెట్టబోవు గూడ. ఇప్పటికీ ఆయన ఈ కుటుంబానికి ఎటువంటి కొరతా లేకుండా చూసుకుంటున్నారు. అదే ఆయనకు మామీద వున్న ప్రేమకు నిదర్శనం. బాబా అద్భుత లీలకు ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన గురించి యిలా చెప్పుకుంటూ పోతే అంతుండదు. అందుకే అన్నాను - సముద్రంలోని అల సముద్రాన్ని అంచనా వేయగలదా? దాని గొప్పతనాన్ని మొత్తంగా చెప్పగలదా? అందుకే నేనెప్పుడూ అనుకుంటుంటాను. “మా కుటుంబంలోని వారికంటే అదృష్టవంతులెవరుంటారు?” అని. ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన ఆ బాబాకు ఏమని కృతజ్ఞత తెలుపగలను?


 

పూజ్య అమ్మగారితో దివ్యానుభవాలు ఒం

గోలు కి చెందిన శ్రీ జగదీష్ మురారి గారు పూజ్యశ్రీ అలివేలు మంగమ్మతల్లి లీలా వైభవాన్ని ఇలా తెలియచేస్తున్నారు -

“ఒకసారి కలలో నాకు పూజ్యశ్రీ అమ్మగారు ఒక మంత్రం చెప్పారు. దాంట్లో 3 పదాలున్నాయి. మెలకువ వచ్చాక ఒక పదమే గుర్తుంది. ఎంత ప్రయత్నించినా మిగిలినవి గుర్తు రాలేదు. అది నా భ్రమ అయివుంటుందా అనిపించింది. కొన్నిరోజుల తరువాత నాగోలు(హైదరాబాదు) వెళ్లాను. శ్రీ ద్వారకబాబుగారిని కలిసి మాటల సందర్భంలో నా కల గురించి చెప్పాను. అదంతా పేపర్లో రాసి ఇవ్వమన్నారు. నేను కావాలనే నాకు గుర్తున్న మొదటి పదం రాయలేదు. ఎందుకంటే నా కల నిజమే అయితే నాకు గుర్తున్న మొదటి పదంతోనే మంత్రం మొదలవ్వాలని వ్రాయలేదు. ‘నాకు ఒక కల వచ్చింది. అందులో మీరు నాకు ఒక మంత్రం చెప్పారు. కాని నేనది మర్చిపోయాను’, అని మాత్రమే వ్రాసి ఇచ్చాను. బాబుగారు నేను వ్రాసిచ్చిన ఆ పేపర్ లోపలికి తీసుకునివెళ్లి తిరిగి తెచ్చి ఇచ్చారు. అది చూడగానే నా గుండె ఝల్లుమంది. నాకు తెలిసిన మొదటి పదంతోటే మంత్రం వ్రాసిచ్చారు. అంతేకాదు. మొదటిపదం క్రింద గీత గీశారు (underline). అంటే ‘నీకు తెలిసున్న పదం సుమా!’ అని!!!

ఇక అప్పటినుంచి నేను రోజు కొంత సమయం ఆ మంత్రం పఠించుకుంటున్నాను. అయితే ఆ మంత్రం ఇప్పటివరకు నన్నెలా అనుగ్రహించిందో, ఆ మంత్రప్రభావం ఎంతటిదో తెలిపే లీలలు కొన్ని పంచుకుంటాను . 1) ఒకసారి కొన్ని సమస్యలవల్ల అశాంతికి గురై పూజ్యశ్రీ అమ్మగారి ఆశీస్సుల కోసం నాగోలు వెళ్లాను. నిలయం దగ్గర చాలాసేపు ఎదురుచూశాను గాని ఎవరూ కనిపించలేదు. కాసేపటికి ఎవరో బాబుగారు ఊర్లో లేరని చెప్పారు. వేదక్క కనపడితే బాగుండునని ఎదురుచూశాను. అదీ కుదరలేదు. ఇక నిలయం పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుని పూజ్యశ్రీ అమ్మగారు ఇచ్చిన మంత్రం మననం చేయడం మొదలుపెట్టాను. ‘110 సార్లు మననం చేస్తాను’, అనుకున్నాను. 8 లేక 10 సార్లు అవ్వగానే తలుపు తీసుకుని వేదక్క బయటికి వచ్చారు. మళ్ళీ గుండె ఝల్లుమంది. ఎందుకంటే మంత్రం ఫలించినందుకు! వేదక్కకి నా సమస్య విన్నవించుకుని, పూజ్యశ్రీ అమ్మగారి ఆశీస్సులు తీసుకుని ఆనందంతో తిరిగి వచ్చాను 2) ఒకసారి బెంగుళూరు వెళ్లాను. అక్కడ చింతామణి అన్న ప్రదేశంలో ‘హయత్ బాబా’ అనే మహాత్ములున్నారని తెలిసి వారి దర్శనానికి వెళ్లాను. అక్కడ వేలల్లో భక్తులుంటారట. ఆరోజు కూడా చాలామంది వున్నారు. వాళ్ళన్నారు, ‘ఇక్కడ ఆయన దర్శనంకోసం చాలసేపు ఎదురు చూడాలి. ఒక్కోసారి 2 లేక ౩ రోజులు కూడా పట్టొచ్చ్చు’ అని. ఆయన చిన్న సైకిల్ మీద తిరుగుతూ

 2020

17


  ఉంటారట. ఒకసారి బయటికి వెళితే ఎప్పుడు వస్తారో తెలియదట. సరేనని నేను ఎదురుచూస్తున్నాను. సడెన్ గా నాకు పూజ్యశ్రీ అమ్మగారు ఇచ్చిన మంత్రం గుర్తొచ్చింది. పఠించడం మొదలు పెట్టాను. 23 సార్లు అవగానే బాబా సైకిలు మీద తిన్నగా వచ్చి నా ముందే బ్రేక్ వేశారు. నాకు మతిపోయినంత పనైంది. ఒక పక్క ఆయన, ఒక పక్క ఆ మంత్ర ప్రభావం!! “యే షెహర్ సే ఆయేరే!”, అని “ఎక్కడినుంచి వచ్చావు?”, అని తెలుగులో అడిగారు. నేను “ఒంగోలు” అని చెప్పగానే , “ఓ ఒంగోల్!” అని, “అక్కడే వున్నారు కదా, మళ్ళీ ఇక్కడికెందుకు?” ఆన్నారు. మీ ఆశీస్సులకోసం అంటే, “అక్కడ వుంటే చాలు. అన్నీ అక్కడే దొరుకుతాయి!” అని, “ఏం తెచ్చావు?” అని అడిగారు. ఈ సంతోషంలో నేను తెచ్చినవి సమర్పించలేదు. పూలమాలలు, ఆకు, వక్క (ఆయనకి అందరు అవే సమర్పిస్తారు) ఇచ్చాను. ఆకు, వక్క బాగా నమిలి ఉమ్మేసి, “ఆ పోయిందిలే!”, అన్నారు. పాదనమస్కారానికి అవకాశం యిచ్చారు. నేను నమస్కారం చేసుకోబోతూ వుండగా అక్కడివాళ్లు, “పాదాలు ముట్టుకోవద్దు”, అన్నారు. వెంటనే ఆయన, “యే షెహెర్ సే ఆయేరే!” అని గట్టిగా చెప్పి నాకు ఆశీస్సులిచ్చి పంపించారు. అక్కడివాళ్ళందరూ చుట్టుముట్టి ఎక్కడినుంచి వచ్చావని అడిగారు. పూజ్యశ్రీ అమ్మగారికి అక్కడినుంచే కృతజ్ఞతా పూర్వక నమస్కారములు తెలియచేసుకున్నాను. 3) నా శ్రీమతి ఈశ్వరికి డెలివరీ టైం. సడెన్ గా ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయాయి. మా డాక్టర్ ఇక ఇక్కడ లాభం లేదు, హైదరాబాద్ తీసుకుని పొమ్మన్నారు. నాకేమి చెయ్యాలో తోచక అలాగే మాస్టర్ గారి సమాధి మందిరానికి వచ్చాను. నమస్కారం చేసుకుని బయటికి రాగానే ఒకతను కనబడి, “మన వాలంటీర్ వాళ్ళ అమ్మాయికి బాబు పుట్టాడు”, అన్నాడు .”ఓహో సంతోషం!”, అన్నాను. ‘ఆ అమ్మాయికి ప్లేట్ లెట్స్ డౌన్ అయిపోతే ఇక్కడే ఫలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారట’ అని చెప్పాడు! నేను వెంటనే ఈశ్వరిని తీసుకుని ఆ హాస్పిటల్ కి వెళ్లాను. అక్కడ డాక్టరు, “6 లేక 7 ప్లేట్లెట్స్ పాకెట్స్, ఒక లక్ష రూపాయలు, అంబులెన్సు రెడీ చేసుకోండి. ప్లేట్లెట్స్ వేరేచోట ఎక్కించాలి అవసరమైతే” అని చెప్పి, “ముందే చెప్తున్నాను, ఎవరో ఒకరే దక్కవచ్చు. ఈ అమ్మాయి కోమాలోకి కూడా వెళ్లిపోవచ్చు. కనుక 18

భగవంతుని మీద భారం వేసి నా ప్రయత్నం నేను చేస్తాను”, అని చెప్పారు. మావాళ్ళందరూ ఏడుపులు మొదలుపెట్టారు. వాళ్ళందరినీ అక్కడనుంచి పంపించేసి నేనొక్కడినే అక్కడ నిల్చొని పూజ్యశ్రీ మాస్టరుగారిని, అమ్మగారిని తలచుకుంటూ పూజ్యశ్రీ అమ్మగారు ప్రసాదించిన మంత్రాన్ని మననం చేస్తూ వున్నాను. అయిదు నిముషాల్లో డాక్టరు వచ్చి “నీకు బాబు పుట్టాడు”, అన్నారు. వెంటనే నేను, “ఈశ్వరి?” అని అడిగాను. ఆమె మౌనంగా లోపలికి వెళ్ళిపోయి రెండు నిముషాలలో బయటికి వచ్చి, “అంబులెన్సుని పంపించెయ్. నీ డబ్బులు బ్యాంకులో వేసుకో! మీ ఆవిడకి అద్భుతంగా ప్లేట్ లెట్స్ రెండులక్షల డబ్బై వేలకి పెరిగాయి!”, అని సంతోషంగా చెప్పారు. ఆ తరువాత తెలిసిన విషయం--- ఆ డాక్టరు మన మాస్టరు గారి డీవోటీ అట! ఆ హాస్పిటల్ శంకుస్థాపనకు, గృహప్రవేశానికి మనవాళ్లే అక్కడ శ్రీసాయిలీలామృతం, శ్రీగురుచరిత్ర పారాయణలు చేశారట. అందుకే నాకు మాస్టరుగారు సమాధి మందిరం దగ్గర అలా సుచించారు అనిపించింది . పూజ్యశ్రీ అలివేలుమంగమ్మ తల్లికి , ‘మంత్రదాత్రే నమః’, ‘ప్రాణదాత్రే నమః’ అని వందనసహస్రాలు హృదయపూర్వకంగా సమర్పించుకుంటున్నాను .”

శ్రీ

కాళహస్తికి చెందిన శ్రీ మోహన్ గారు పూజ్యశ్రీ అమ్మగారి లీలావైభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు -

“నేను 1999 లేదా 2000 సంవత్సరంలో గుంటూరు నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒంగోలులో మాస్టరుగారి సమాధి దర్శనం చేసుకుని, అమ్మగారు ఒంగోలులోనే ఉంటారని తెలిసి ఆమె దర్శనం కూడా చేసుకుందామని అనుకున్నాను. సాయంత్రం 7-8 గంటల మధ్యలో మొదటిసారి మాస్టరుగారి సమాధి దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. తరువాత పూజ్యశ్రీ అమ్మగారి దర్శనం కూడా చేసుకోవాలని భావించాను. కానీ వారు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆటోవాళ్ళను అడిగితే ఒకరిద్దరు

 2020


  తెలియదు అన్నారు. ఒక ఆటో డ్రైవర్, “నాకు తెలుసు. నేను తీసుకువెళతాను రండి!” అని తీసుకువెళ్ళాడు. అమ్మగారు ఉండే ఇంటిముందు దించాడు. నేను, నాతో ఉన్న నా స్నేహితుడు అమ్మగారు ఉండే ఇంటిముందు దిగి లోపలికి వెళ్ళాము. హాల్ లోకి వెళ్ళగానే ఎవరో ఒకావిడ వచ్చి, “ఎవరు కావాలి? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగారు. నేను, “అమ్మగారి దర్శనం కోసం వచ్చాము. మాది శ్రీకాళహస్తి” అని చెప్పాను. “కూర్చోండి!” అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళారు. మేము హాల్ లో ఒక పక్కగా కూర్చున్నాము. రెండు నిమిషాలలో అమ్మగారు లోపలినుండి నెమ్మదిగా నడుచుకుని వచ్చి అక్కడ ఉన్న బల్లమీద కూర్చున్నారు. అప్పటికే నేను అమ్మగారిని ఫోటోలలో చూసి వుండడం చేత లేచి నిలబడి వెళ్ళి పాదనమస్కారం చేసుకుని, అంతకుముందు నేను కూర్చుని ఉన్న చోటికే వచ్చి కూర్చున్నాను. అయిదు నిమిషాల తరువాత నేను లేచి వెళ్ళి అమ్మగారికి మళ్ళీ పాదనమస్కారం చేసి, “అమ్మా! వెళ్ళొస్తాం!” అన్నాను. “మంచిది!” అన్నారు అమ్మగారు. మేము తిరిగి మా ఊరు వచ్చేశాము . తరువాత చాలాకాలం నా ప్రారబ్దం చేత, సహవాసాల వలన చెడుదారి పట్టి పారాయణ చేయడం కూడా మానేసాను. 2016లో గాణ్గాపురంలో తంతుకసేవకు వచ్చిన గుంటూరు భక్తులలో ఒకరైన శ్రీమతి సుశీలగారు, వారు మాస్టర్ గారిని, అమ్మగారిని దర్శించుకున్న అనుభవాలు చెబుతూ నన్ను కూడా అడిగారు, “మాస్టర్ గారిని చూశావా? అమ్మగారిని చూశావా?” అని. “నేను మాస్టర్ గారిని చూడలేదు. అమ్మగారిని ఒంగోలు లో దర్శించుకున్నాను” అని పై విషయమే చెప్పాను. నేను చెప్పినది విని ఆవిడ ఆశ్చర్యంగా, “అమ్మగారు నడుచుకుంటూ రావడం ఏంటి? నువ్వు నిజంగా ఒంగోలులోనే దర్శించావా లేక అంతకుముందే దర్శనం చేసుకున్నావా?” అని అడిగారు. నేను ఒంగోలులోనే దర్శించానని, అమ్మగారు నడిచే వచ్చారు అని చెప్పి, ఎందుకు ఆ విషయం గురించి అలా అడుగుతున్నారని ప్రశ్నించాను. ఆవిడ, “అమ్మగారు నడుచుకుంటూ రావడం ఏంటి?! అసలు అమ్మగారు నడవలేరు కదా?” అన్నారు. నేను అప్పటివరకు చదివిన

పుస్తకాలలోని ఈ విషయం గుర్తొచ్చి, “నిజమే! నేను చదివిన గ్రంథాలలో కూడా అలానే ఉన్నదే! కానీ ఒకవేళ నేను దర్శనం చేసుకున్న కాలంలో ఇంకా నడుస్తూండేవారేమో!” అన్నాను. కానీ ఆవిడ, “ఒకసారి ఆ సంవత్సరంలో అక్కడ వున్నవారిని ఎవరినైనా అడిగి నిర్ధారించుకో !” అన్నారు. ఇక నేను ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. నేను అడిగిన వారెవ్వరూ సరిగ్గా చెప్పలేకపోయారు. సులోచనగారు కూడా ‘అమ్మగారు ఆ సమయంలో నడవట్లేదు’ అని చెప్పి కావాలంటే వేదమ్మని కుడా అడగమన్నారు. నేను వేద్దక్కను అడిగాను. వేదక్క, “ద్వారక పుట్టిన కొద్ది సంవత్సరాలకే అమ్మగారు నడవలేకపోయారు. అప్పటినుంచి కూర్చునే ఉంటారు” అని చెప్పారు! “మాస్టరుగారి కుటుంబమంతా కలిసివున్న ఫోటోలో అమ్మగారు ద్వారకబాబుగారిని ఎత్తుకుని నిలబడేవున్నారు కదా?” అని అడిగాను. “అప్పుడు అతి కష్టం మీద కొద్దిగా నడవగలిగేవారు. ఆ ఫోటోకి కూడా ఎంతో కష్టంగా నిలబడ్డారు అంతే! ఆ తరువాత కాలంలో అసలు నడవలేదు” అన్నారు వేదమ్మగారు. అయినా నా అనుమానం తీరలేదు. అమ్మగారు అలా దర్శనం ఇవ్వలేరని కాదు. .... నావంటి అల్పునికి అంతటి అర్హత ఉంటుందా అని! శ్రీకాంత్ బావగారికి చెప్పాను. అంతా విని “ఒకవేళ మాస్టరుగారి ఇల్లనుకుని ఇంకెవరింటికైనా వెళ్ళావేమో!” అన్నారు. “ఆటో అతను సరైన ఇంటికే తీసుకెళ్ళాడు” అని చెప్పాను. “ఒకవేళ వేరే ఎవరినైనా చూసి అమ్మగారు అనుకున్నావేమో!” అన్నారు. నాకు కూడా అనుమానం వచ్చింది. ఫోన్ లో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు వేదక్క, “అమ్మగారు నీకు కనిపించినపుడు ఎలా ఉన్నారు?” మొదలైన వివరాలు అడిగి, “అన్నీ సరిగ్గానే చెబుతున్నావు!” అన్నారు. అయినా నా అనుమానం తీరలేదు కానీ నేను మొదటిసారి ఒంగోలు బాబా మందిరానికి వెళ్ళిన సందర్భంలో దత్తస్వామి విగ్రహాన్ని చూచినప్పుడు నా మానసిక స్థితి, మాస్టరుగారి సమాధి దగ్గర వ్రాసివున్న వాక్యం చదవడం .... . అప్పుడు నాకు వచ్చిన భావం... అమ్మగారిని దర్శించినపుడు ఆమె కట్టుకున్న చీర రంగు, అమ్మగారి ప్రశాంతమైన మొహము, అమ్మగారు నడిచివచ్చిన ఆ

 2020

19


  నడక అన్నీ కళ్ళముందు మెదులుతున్నాయి. అయినా నా మనస్సు సమాధానపడలేదు. అదృష్టవశాత్తూ ఒకరోజు ఒంగోలులో అమ్మగారు అప్పుడు నివసించిన నిలయంలో ద్వారకబాబుగారితో పాటు వున్నాను. కొంత ఇతర విషయాలు మాట్లాడుకోవడం అయ్యాక నేను బాబుగారిని ‘అమ్మగారు ఒంగోలులో వున్నప్పుడు దారి ఎటు ఉండేదో, బల్ల ఎక్కడ వుండేదో, బయటివారు వస్తే లోపలకి ఎలా వచ్చేవారో, అమ్మగారు ఎక్కడ వుండేవారో’ - అన్నీ తిరిగి తిరిగి అడిగాను. అప్పుడు బాబుగారు అమ్మగారు నడవలేరు కనుక బయటకి వచ్చేవారుకారని, బల్ల వుండేది కాదని చెప్పారు. ఇంకా నేను అడిగిన విషయాలన్నింటికీ సమాధానమిచ్చారు. అప్పుడు నాకు అనుమానమే లేకుండా నిశ్చయంగా అర్థమైంది .... నాకు ఖచ్చితంగా పూజ్యశ్రీ అమ్మగారే దర్శనమిచ్చారు!!! నాకు ఒక విషయం బోధపడింది. పూజ్యశ్రీ అమ్మగారి కరుణకు, అనుగ్రహానికీ మన అర్హతలతో పనిలేదు. వారు అనుగ్రహించదలచు కుంటే ఎంతసేపు? ఎక్కడైనా, ఎప్పుడైనా భౌతికంగా దర్శనమిస్తారు. వారి భక్తవత్సలతకు అంతెక్కడ? స్మృతిమాత్రప్రసన్నాయై నమః !”

నె

ల్లూరుకి చెందిన శ్రీ కొత్తూరు శ్యాంప్రసాద్ గారు పూజ్యశ్రీ అమ్మగారి లీలావైభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు -

“1990వ సంవత్సరంలో నేను ఒంగోలులో పూజ్యశ్రీ మాస్టరుగారి యింట్లోనే వుండేవాడిని. ఆ సంవత్సరం పూజ్యశ్రీ మాస్టరుగారి కొత్త ఇంటి కట్టుబడి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. లక్ష్మయ్య అనే అతను బాడుగకు ఇసుక తోలేవాడు. ఒకరోజు లక్ష్మయ్య నా దగ్గరకు వచ్చి, “అమ్మగారి దర్శనంకోసం చాలామంది భక్తులు వస్తున్నారు కదా! అమ్మగారు ప్రశ్న చెబుతారా?” అని ప్రశ్నించాడు. నేను, “పూజ్యశ్రీ అమ్మగారు గొప్ప మహాత్మురాలు. ఆమెకు నమస్కారం చేసుకొని మన బాధ 20

మనసులో చెప్పుకొంటే చాలు, అది తీరిపోతుంది!”, అని చెప్పాను. అతడు, “అయితే నేనూ నా బాధ చెప్పుకోవచ్చా?” అని అడిగాడు. “తప్పకుండా చెప్పుకోవచ్చు!” అన్నాను. లక్ష్మయ్య కాళ్ళు, చేతులు కడుగుకొని పూజ్యశ్రీ ఆమ్మగారిని దర్శించుకుని నమస్కారం చేసుకొని వెళ్ళాడు. రెండురోజులు అతను ఇసుక తోలడానికి రాలేదు. ఇసుక కోసం నేను కర్నూలురోడ్డుకి వెళ్లి అతని గురించి విచారించాను. అక్కడివారు, “రెండురోజుల క్రితం లక్ష్మయ్య వాళ్ళ అబ్బాయిని కారు గుద్దింది. ఆ బాబు ఆసుపత్రిలో ఉన్నాడు. లక్ష్మయ్య వాళ్ళ అబ్బాయి దగ్గర వున్నాడు” అని చెప్పారు. అంటే లక్షయ్య అమ్మగారికి నమస్కారం చేసుకొన్న మరురోజే వాళ్ళ అబ్బాయిని కారు గుద్దిందన్నమాట! అది విని నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నేను గబగబా అమ్మగారి ఇంటికి చేరాను. నాలో అలజడి. ‘నువ్వు చెప్పావు గాబట్టి అమ్మగారికి నమస్కారం చేసుకొంటే మా అబ్బాయికి ప్రమాదం జరిగింద’ని నన్ను ఎక్కడ నిలదీస్తాడో అని భయపడి, ‘ఇంకెవ్వరికీ అలా చెప్పకూడదు!’ అని నిర్ణయించుకున్నాను. పదిరోజులు గడిచాయి. ఒకరోజు నేను పూజ్యశ్రీఅమ్మగారి ఇంటి వరండాలో కూర్చొని వున్నాను. ఇంతలో గేటు తీసుకొని లక్ష్మయ్య వచ్చి నాదగ్గరగా కూర్చొన్నాడు. నాకు లోపల ఒక్కటే వణుకు. నెమ్మదిగా, “ఎలావున్నావు?” అని అడిగాను. అతను, “అయ్యా, అమ్మగారు చాలా గొప్పవారయ్యా!” అన్నాడు. అప్పుడు నామనసు తేలికపడింది. “ఏమి జరిగింది?” అన్నాను. అతను, “నేను అమ్మగారికి నమస్కారము చేసుకుని మా ఇంటి పరిస్థితి వివరించాను. నాకు వచ్చే ఆదాయంతో ఇల్లు గడపడం, మా అబ్బాయికి చదువు చెప్పించడం కష్టం. నేను పనికోసం బయటకు వస్తే వాడి ఆలనాపాలనా చూడడం చాలా ఇబ్బందిగా వుంది. ‘అమ్మా నన్ను, నా కుటుంబాన్ని మీరే కాపాడండి!’ అని మనసులోనే ప్రార్థించాను. మరుసటిరోజు మా అబ్బాయి బడికి వెళ్తూ రోడ్డు దాటుతుంటే కారు గుద్దింది. ఆ కారు యజమానులు మా అబ్బాయికి ఆసుపత్రిలో చికిత్స చేయించి, వాడి చదువుకు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారు. అబ్బాయి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. అమ్మగారు చాలా

 2020


  మహిమ గలవారయ్యా!” అన్నాడు. నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. అతనిలా హృదయపూర్వకంగా ప్రార్థన నేను ఎన్ని జన్మలకైనా చేయగలనా? పూజ్యశ్రీ అమ్మగారు దయచూపవలసిందే!!”

ణుకుకు చెందిన శ్రీ రాణి గోపాలకృష్ణగారు పూజ్యశ్రీ అమ్మగారితో తమ అనుభవాన్ని యిలా తెలియ జేస్తున్నారు “1978-79 మధ్యకాలంలో పూజ్యశ్రీ మాస్టరుగారు విద్యానగరులో వుండేవారు. ఒకసారి పూజ్యశ్రీ మాస్టరుగారు అమ్మగారిని, మరికొంతమందినీ విద్యానగర్ నుండి అవధూత శ్రీ చివటం అమ్మ, శ్రీ సుధీంద్రబాబుగార్ల దర్శనం కోసం తణుకుకు పంపారు. అవధూత శ్రీ చివటం అమ్మ దర్శనం చేసుకున్న తరువాత గొప్ప మహాత్ములైన శ్రీ సుధీంద్రబాబుగారి దర్శనానికి బయలుదేరాము. ఆ రోజు జరిగిన సంఘటన మరువరానిది, అమూల్యమైనది. ఆరోజు పరమపవిత్రమైన రోజు. ఇద్దరు మహాత్ములు ఒకేచోట కలిసిన రోజు. సుమారుగా ఉదయం 10 గంటల ప్రాంతంలో నేనూ, మాతృశ్రీ అలివేలుమంగమ్మగారు, ఆమెతో వచ్చినవారూ -- అందరం శ్రీ సుధీంద్రబాబుగారి దర్శనం కోసం వెళ్ళాము. ఆ రోజుల్లో శ్రీ బాబుగారు మేడ మీద వుండేవారు. మేము మెట్లు ఎక్కుతుండగా తలుపు తీసుకుని శ్రీ బాబుగారు బయటకు వచ్చారు. నన్ను చూసి “ఎవరు నాన్నా?” అన్నారు. పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీమతి, వారి విద్యార్థులు వచ్చారని చెప్పాను. అంతే, వెంటనే “ఒక్క ఐదు నిమిషాలు నాన్నా!” అని తన గదిలో వున్నవాళ్ళందరినీ పంపించేశారు. పూజ్యశ్రీ అమ్మగారిని “రండమ్మా, రండి!” అంటూ లోపలికి ఆహ్వానించారు. అక్కడున్నవారు అందరికీ కాఫీ ప్రసాదం ఇచ్చారు. ఆరోజు గ్రహణం విడుపు రోజు. ప్రయాణాలు చెయ్యరు. కానీ పూజ్యశ్రీ అమ్మగారూ వాళ్ళు ఆరోజు మధ్యహ్నం రైలుకి విద్యానగర్ వెళ్లిపోవాలి. టికెట్ల రిజర్వేషన్లు అయిపోయాయి. శ్రీ సుధీంద్రబాబుగారి దర్శనం ఒక అరగంటలో పూర్తిచేసుకుని ప్రయాణానికి బయలుదేరవచ్చని అందరమూ అనుకున్నాము.

శ్రీ సుధీంద్రబాబుగారిని దామోదర్ అనే విద్యార్ధి, “బాబుగారూ! గురువు అంటే ఎవరు?”అని ప్రశ్నించాడు. బాబుగారు అక్కడ వున్న అందరినీ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పమని అడిగారు. ఎవరూ పెదవి విప్పలేదు. ఆ తరువాత వారే, “లఘువు కానిది గురువు నాన్నా!” అన్నారు. మామూలుగా స్త్రీలకు ఎక్కువసేపు దర్శనం ఇవ్వని శ్రీ బాబుగారు ఆ రోజు సాయంత్రం 5 గంటలవరకు దర్శనం అనుగ్రహించి మాకు అనందాన్ని పంచిపెట్టారు. అందరినీ నిండుగా ఆశీర్వదించారు. ప్రేమగా సాగనంపారు. ఆ తరువాత ఆ ఇంటి యజమాని నన్ను అడిగారు - “బాబుగారు ఆడవాళ్లకు యింతసేపు దర్శనం యివ్వరు కదా! మీతో వచ్చిన ఆమె ఎవరు?” అని. “ఆమె పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టరుగారి శ్రీమతి!” అని చెప్పాను. “అందుకే యింతసేపు దర్శనమిచ్చారు. ఇది చాలా గొప్ప విషయం!” అని అన్నారు. ఇంతలో రిజర్వేషన్ అయిన టికెట్స్ క్యాన్సిల్ చెయ్యడానికి నేను రైల్వేస్టేషనుకి వెళ్ళవలసివచ్చింది. పూజ్యశ్రీ అమ్మగారూ వాళ్ళు అక్కడే వున్నారు. ఆ సమయంలో శ్రీ బాబుగారు అవధూత శ్రీ చివటం అమ్మగారి గురించి ఎన్నో విషయాలు చెప్పారట. నాకు వినే అదృష్టం లేకపోయింది. మరుసటిరోజు పూజ్యశ్రీ అమ్మగారూ వాళ్ళు విద్యానగర్ వెళ్లిపోయారు. కొద్దిరోజుల తరువాత శ్రీ సుధీంద్రబాబుగారు నన్ను అడిగారు --”నాన్నా! వాళ్ళు క్షేమంగా చేరారా?” అని. “చేరారు బాబుగారూ, ఉత్తరం వచ్చింది!” అన్నాను. వెంటనే వారు, “ఆమె గొప్ప మహాత్మురాలు నాన్నా!” అన్నారు. అప్పటికి పూజ్యశ్రీ అమ్మగారి గురించి ఎవ్వరికీ ఎక్కువగా తెలియదు. మొట్టమొదటిసారి పూజ్యశ్రీ అమ్మగారిని మహాత్మురాలిగా గుర్తించి లోకానికి తెలియజెప్పింది శ్రీ సుధీంద్రబాబుగారే! ఆయన అలా చెబుతుంటే వినే అదృష్టం నాకు కలిగింది. ఆ రోజు నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు, మరచిపోలేని రోజు. ఆ సమర్ధసద్గురువైన సాయినాథుడు, ఆదిదంపతులైన పూజ్యశ్రీ భరద్వాజ మాస్టరుగారు, మాతృశ్రీ అలివేలుమంగమ్మ తల్లి మనలనందరినీ ఎల్లప్పుడూ ఆశీర్వదించుదురు గాక!”

 2020

21


 

భక్తి, శ్రద్ధల దీపావళి సమిత్పాణి

మా

నవ జీవితమంతా అనేక సంఘటనలతో కూడి, అనేక భావాలు రేకెత్తిస్తూ కొనసాగుతూ వుంటుంది. సామాన్యమైన మానవుడికి ఆశ, వ్యామోహములు, భయాందోళనలు, దుఃఖము, నిస్పృహ, యిష్టము, సుఖము, జాడ్యము, స్తబ్దత మొదలైన అనుభవాలతో, ఎంతో కాలవ్యయంతో భగవత్ ప్రసాదమైన ఆయుర్దాయం గడిచిపోతుంది. కొద్దిమందికి మాత్రం సంఘసేవ, వైద్యము, విజ్ఞాన శాస్త్రము, విద్య మొదలైన రంగాలలో చక్కని అభినివేశం కలిగి జీవితంలో కొంత భాగం సార్థకంగా నడుస్తుంది. వీరిలోనూ కొద్ది మందికి మాత్రమే వారి జీవితం విశ్వశ్రేయస్సుకు వుపయోగపడేలా, వారి వారి రంగాలలో అభివృద్ధికి తోడ్పడేలా కొనసాగుతుంది. పూర్వ పుణ్యం వలన జీవితంలో సుఖానుభవం కలగడం,

22

పాపాల వలన దుఃఖం కలగడం జరుగుతూ జీవితాలు కాలప్రవాహంలో నడిచి పోతుంటాయి. ఈ మొత్తంలోనూ, కొద్దిమంది ఆధ్యాత్మిక వేత్తలకి తప్ప, తక్కిన తక్కినవారందరికీ ‘ఉన్నదానితో అసంతృప్తి లేనిదేనికోసమో తపన’ అన్నట్టుంటుంది జీవితం. అలాగాక జీవితాన్ని నిర్దుష్టంగానూ, సుఖశాంతులతోనూ ధర్మబద్ధంగా, ధైర్యంగా గడపాలంటే జీవితానికి చక్కటి సంస్కారపూరితమైన నిత్యకృతము, లౌకిక పారమార్థిక రంగాలలో చక్కని ఆశయము, దానిని సాధించడానికి కావలసిన నిష్ఠసబూరీలు, ఒడిదుడుకులు తట్టుకోగల స్థైర్యము, సత్యముపట్ల జిజ్ఞాస అవసరం. ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారి బోధంతా యిట్టి జీవితాన్ని సాధించుకోవడం కోసమే. వారి

 2020

జీవితము, ఆచరణ అట్టి జీవితాన్ని మనం పొందడానికి చక్కని ప్రేరణను, స్ఫూర్తిని కలిగించే సమగ్ర బోధనా స్వరూపమే. వారి రచనలు యిట్టి జీవిత విధానాన్ని అనేక కోణాలనుంచి మనకు నిర్దేశిస్తాయి. వాటిలో ‘రాజమార్గము’ గా కీర్తించబడిన మార్గం సద్గురు భక్తి. నిజమైన సద్గురువును తెలుసుకొనడం, వారినాశ్రయించి వారికి ప్రీతి కలిగేలా సేవించి, జీవితాన్ని, అందులోని జీవితానుభవాలను వారి పరంగా మలచుకొని, ఫలితంగా వారి కృపను తప్ప మరేమీ ఆశించక, వారి నిరంతర స్మరణలో ప్రాణశక్తినంతటినీ అర్పించడమే యీ విధానం. సద్గురువు తారసిల్లే లోపల సద్గ్రంథపఠన, చక్కని నడవడి, మహనీయుల దర్శనసేవనాదులు, సత్సంగము చేస్తూ నిలవడమే కర్తవ్యము. సద్గురువు తారసిల్లి మార్గ-నిర్దేశం చేయగానే వారి అనుమతి, ఆశీస్సులను పొంది అట్టి


  మార్గంలో నడవడమే కర్తవ్యము. ఇట్టి అద్భుతమైన బోధ మనకు ఆచార్యులు అందించినా వారి అశేష భక్త జనావళిలో దానిని సంపూర్ణంగా అందుకున్న వారు అరుదు. వారిలో గురుపత్ని దివ్యజనని శ్రీ అలివేలు మంగమ్మ ఒకరు. అమ్మగారి జీవితమంతా యిట్టి నిర్దుష్టమైన మార్గానికి నిలువుటద్దంగా నిలిచింది. లోతుగా ఆలోచిస్తే, ఆచార్యులు యెట్టి జీవిత విధానాన్ని ఆదేశించారో, అది అమ్మగారికి జన్మతః అబ్బిందా అనిపిస్తుంది. కారణజన్ములైన ఆ దివ్య దంపతులు దివ్యమైన ప్రణాళికతో భగవదాదేశంతో జన్మిస్తారు గనుక, అట్టి జీవన విధానం వారికి సహజంగా జన్మించినప్పటినుండే ఆరంభం అవుతుందంటే ఆశ్చర్యం ఏముంది? చిన్నతనంనుండి యింట్లో భగవత్ చింతనతో, మహనీయుల లీలాశ్రవణంతో ఆరంభమైన అమ్మగారి జీవితం క్రమేణా మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ సేవగా, కాలాంతరంలో పరమాత్మ స్వరూపులైన ఆచార్యుని సహధర్మచారిణిగా సేవించడందాకా యెంతో అద్భుతంగా కొనసాగింది. నేటికీ కొనసాగుతున్నది. చిన్ననాటినుండి అలివేలు మంగమ్మ దైవచింతనపై యెంతో ప్రీతిని కనబర్చేవారు. ఆమె స్వభావం యింట్లోని యితర పిల్లలకంటే విభిన్నంగా, విలక్షణంగా వుండేది. ఆమె బాల్యం నుండి కూడా యెటువంటి పరిస్థితులకీ చలించక యెంతో నిబ్బరంగా వ్యవహరించేవారు. సరదాలు, విలాసాలపట్ల ఆసక్తి చూపక నిర్లిప్తురాలై అందరిపట్ల ప్రేమానురాగాలు కలిగియుండేవారు.

సుమారు 13 సం॥ వయస్సులో ఒకసారి అమ్మగారు, తెలిసిన వారింట్లో జరిగే సత్సంగ కార్యక్రమానికి స్నేహితులతో కలిసి వెళ్ళారు. అక్కడవున్న చాలా పెద్ద సైజు బాబా పటము ముందు నిలబడగానే ఆమెకు చిత్రమైన అనుభూతి కలిగి కొద్దిక్షణాల్లోనే బాహ్యస్కృతి కోల్పోసాగారు. గత జన్మల సంస్కారబలం వుంటేగాని ఒక మహనీయుని చిత్రపటదర్శనం అంతటి ప్రభావం వ్యక్తం చేయదు. అలానే కుటుంబం అందరికీ మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మపట్ల యెంతో భక్తిశ్రద్ధలుండటంవలన చిన్న వయస్సులోనే అమ్మగారికి కూడా ఎంతో భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. ఆమె నిరంతరం జిల్లెళ్ళమూడి అమ్మ నామస్మరణ చేస్తూండేవారు. 18 సం॥ వయస్సప్పుడు అమ్మ దర్శనానికని కుటుంబం అందరితో వెళ్ళిన అలివేలు మంగమ్మ తాను జిల్లెళ్ళమూడి అమ్మ సన్నిధిలో, సేవచేస్తూ వుండిపోతానని చెప్పి అక్కడే వుండిపోయారు. అక్కడ అమ్మగారి జీవితమంతా సాధనామయం. నిరంతరం భగవత్ చింతనచేస్తూ ఎంతటి శ్రమనైనా లెక్కపెట్టక నిరంతర సేవలో వున్నారు. అక్కడ వారు చేసిన సేవ అత్యద్భుతం. ‘అమ్మ సేవ’ (జిల్లెళ్ళమూడి అమ్మ సేవ) అంటే చాలు ఎంతటి కష్టమైనా పనికైనా సిద్ధపడేవారామె. చెరువునుండి బిందెలు భుజాన పెట్టుకుని నీళ్ళు తీసుకొని రావడం, పొలం పనులు, గృహ నిర్మాణ పనులు, అక్కడికి వచ్చిన భక్తులకు సదుపాయాలు చేయటం మొ॥న సేవలెన్నో చేశారామె. ఆరతులు, భజనలు పాడటమన్నా, మరే సేవ

 2020

అయినా యింకెవరూ చేయలేనంత బాగా చేసేవారు అమ్మ. శక్తికి మించిన శ్రమవలన సున్నితమైన ఆమె శరీరం శుష్కించిపోయింది. ఆరోగ్యం సన్నగిల్లసాగింది. అయినప్పటికీ లెక్కచేయక కొన్ని నెలలపాటు రోజుకి కొద్ది నిమిషాల నిద్రతోనే సరిపుచ్చుకొని జిల్లెళ్ళమూడి అమ్మ సేవలో అంకితమయ్యారు అమ్మ. అంటే చిన్నప్పటినుండే అమ్మగారి జీవితంలోని ప్రతికణం శ్రద్ధాభక్తులతోను, భగవత్ చింతనలోనూ, మహనీయులు సాంగత్యము, సేవలతోను నిండిపోయింది. అట్టి ఆధ్యాత్మిక జీవిత విధానానికి కావలసిన వివేక వైరాగ్యాలు ఆమెలో స్థిరంగా నిలిచాయి. అప్పటికే ఆమె శరీరభ్రాంతిని వీడి ఆంతర్యంలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను పరిపూర్ణంగా పొందివున్నారని అప్పటి వైఖరి మనకు సృష్టపరుస్తుంది. ఆమెకు తెలిసినవారంతా ఆమె సత్ప్రవర్తనకు ఆమెనెంతో గౌరవించేవారు. ఆమె వివాహం చేసుకోకుండా అలానే సాధనలో వుండిపోవాలని ఆశించారు. అలా ఆశించేవారు మాత్రమే నిజంగా గృహస్థాశ్రమానికి అర్హులని, వారు మాత్రమే దానిని సార్థకం చేసుకోగలరని కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. కారణ జన్మురాలైన సీతమ్మను వివాహం చేసుకోవడానికి శ్రీరాముడుగాక మరెవ్వరు అర్హులు? ఇంతటి సాధనాశీలియైన అలివేలు మంగమ్మను సహధర్మచారిణిగా పొందగల ధీరులు ఆచార్య భరద్వాజులుగాక మరెవ్వరు? కారణ జన్ములైన వీరిద్దరినీ 23


  వివాహబంధంలో జతపరచగలవారు మహనీయులుగాక వేరెవ్వరు? అందుకే ఆచార్య భరద్వాజులకు గృహస్థాశ్రమాన్ని నిర్దేశించిన శ్రీ పాకలపాటి గురువుగారు ఆయనకు అలివేలుమంగమ్మను వివాహ మాడవలసినదిగా సూచించారు. అందుకే మొదట శ్రీ పాకలపాటి గురువుగారు తరువాత శ్రీ శిరిడీసాయి ఆదేశించిన మీదట వీరి వివాహం బ్రహ్మవేత్తలు నిశ్చయించిన బ్రహ్మవివాహంగా, లోక కళ్యాణంగా జరిగింది. అమ్మగారి గృహస్థాశ్రమ జీవనం కూడా యెంతో ఆదర్శప్రాయంగా నడిచింది. పరమ పురుషుడైన భరద్వాజ మహరాజ్ భర్తగా, ప్రత్యక్ష గురువుగా నిలిచి వీరిచే ఎన్నో సాధనలు చేయించారు. రోజంతా వారాదేశించిన సాధనలు చేయడంలోనూ సేవించడంతోనూ నింపుకుని చెక్కుచెదరని ఆధ్యాత్మిక జ్యోతిలా నిలిచారు అమ్మ. అంతటి మహనీయుడినే భర్తగా పొంది నిరంతరం వారిసేవలో వున్న అమ్మ ఆధ్యాత్మిక సాధన గురించి ఏమని చెప్పగలం? అంతటి మహనీయుని సన్నిధిలో, సాన్నిహిత్యంలో భౌతికంగా నిలవడము, అంతటి మహనీయుని హృదయంలో సహధర్మచారిణిగా నిత్యనివాసం పొందటం ఆమె స్థాయిని స్పష్టపరుస్తాయి. ఎంతటి మహనీయుల సన్నిధి లభించినా, దానిని సార్థకం చేసుకోవడం చేతగాక కాలదన్నుకున్నవారెందరో. కాని అమ్మగారు అలా కాదు. ఆచార్యులు మెచ్చే విధంగా అంటే గురువుకు 24

 2020


  నచ్చిన విధంగా – సేవ చేసుకున్నారు అమ్మ. తీవ్ర అనారోగ్యంలో వున్నప్పటికీ, ఇల్లు నిరంతరం ఎందరో భక్తులతో కిటకిటలాడుతూ తనకంటూ ప్రత్యేకంగా ఒక గదైనా లేనప్పటికీ, కుటుంబాన్ని ఎంతో సమర్థవంతంగానూ ధర్మబద్ధంగానూ నడిపించి ఆదర్శ గృహిణిగా నిలిచారు అమ్మ. అందుకే మాస్టరుగారు తరచు అనేవారు, “నేను యింతగా సాయిసేవ చేయగలుగుతున్నానంటే, సత్సంగాలు, గ్రంథరచన చేయగలుగుతున్నానంటే అదంతా ఆమె సహకారం వల్లనే”, “ఆమె సహకారం లేనిదే నేను యివన్నీ చేయగలిగేవాణ్ణి కాదు. కుటుంబ నిర్వహణంతా ఆమె చూసుకోబట్టి నేను సాయిసేవ యింతగా చేయగలుగుతున్నాను”. కేవలం యింటిపనులేకాక ఆచార్యులు చేసిన ఆధ్యాత్మిక ధర్మప్రచారంలో కీలకపాత్రను వహించారు అమ్మ, ఆయనతోబాటు శిరిడి మొదలైన క్షేత్రాలను దర్శిస్తూ అక్కడ భక్తులనుండి సేకరించిన సాయిలీలలను డైరీలలో రాస్తూ, భద్రపరుస్తూ గ్రంథాల సంకలనంలో ఆచార్యులకు కుడిభుజంగా నిలచి ఆయన డిక్టేట్ చేస్తుంటే గ్రంథాలను రాయడమూ, ప్రూఫ్ లు దిద్దడమూవంటి కార్యక్రమాలను చేసేవారు అమ్మ. ఆయన హృదయంలోనూ, ఆయన కార్యక్రమంలోనూ ఆయనలో సగభాగంగా నిలచిన అమ్మగారు మనందరికీ గురువుతో సమానంగా గౌరవించదగ్గ గురుపత్ని. అందుకే ఆచార్యులు ఒక భక్తురాలితో “నేను, ఆమె వేరు అని తలచేట్టయితే, అట్టివారు ఆంతరంగిక

భక్తులుగా, యింట్లోని వారుగా వుండటానికి తగరు, మేమిద్దరము ఒకటిగా భావించేటట్లయితే నీవింట్లో వుండవచ్చు, లేకుంటే అందరిలాగే బయటనుండి రోజూ సత్సంగానికి వచ్చి శ్రీ సాయికి నమస్కరించుకుని వెళ్ళవచ్చు” అని చెప్పారు. ఇలా ఆమె జీవితమంతా ఆయన సన్నిధిలో ఆయనపట్ల శ్రద్ధా-భక్తులతో నిండిపోయింది. నేటికీ అమ్మగారి దినచర్య అంత విలక్షణంగానూ వుంటుంది. గుడ్లగూబ సూర్యుని దర్శించలేనట్లు, మన నుంచి ఆచార్యులవారు కనుమరుగయ్యారేగాని అమ్మకు వారు నిత్యసత్యులు. ఎప్పటిలాగే సమయానికి కాఫీ, నైవేద్యము ఆయనకు సమర్పిస్తారు అమ్మ. ఎప్పటిలాగే ఆమె జీవితంలోని ప్రతి అంశాన్ని యిప్పటికీ ఆయనే నిర్దేశిస్తారు. ఆమె జీవితం యిప్పటికీ ఆయన మయం. అనుక్షణమూ ఆయన స్మరణ, ఆయన నిర్దేశించిన అద్భుత, ఆధ్యాత్మిక జీవనవిధానమే ఆమె ఆచరణ. జీవితంలోని ప్రతి సన్నివేశమూ ఆయన సేవ. ఇలా నిరంతర ఆధ్యాత్మిక సాధనలో భాగంగా జీవితాన్ని నడిపిన అమ్మ ఎందరో భక్తులకు ఆదర్శప్రాయం. అమ్మ అండన సేదతీరిన ధన్య జీవులెందరో. ఆమె క్షమాగుణానికి అంతులేదు. ధర్మనిరతికి సాటిలేదు. ఆమె భక్తికంటే లోతైన సముద్రమే లేదు. ఆమె హృదయంకంటే విశాలమైన ఆకాశమే లేదు. నేటికీ ఆచార్యులు చెప్పిన నిర్దుష్టమైన ఆచరణ ఆమెలో సంపూర్ణంగా దర్శనమిస్తుంది. సాయి

 2020

మాస్టర్ పట్ల సరైన భక్తికి సాకార రూపమే అమ్మ. జీవితంలో ప్రతీ సన్నివేశాన్ని యిలా భగవన్మయంగా మలచుకోవడమేగదా మహనీయుల బోధనాసారం. ప్రతీ అనుభూతినీ సాధనలో మరో మెట్టుగా, భగవత్ ప్రసాదంగా స్వీకరించి చూపారు అమ్మ. అనుక్షణమూ అశాంతితో అంధకార బంధురంగా జీవితాన్ని యీడ్చడం కాకుండా హృదయ పూర్వకమైన శ్రద్ధాభక్తులను, ప్రతి శ్వాసలోను, ఆలోచనలోను ఆశయంలోను, అనుభవంలోను, మాటలోను, సన్నివేశంలోనూ నింపుకుని జీవితాన్ని నడపడమే ఆధ్యాత్మికసారం. ఇలా చేసే ప్రతీక్షణమూ శ్రద్ధా భక్తులు అనే దీపాలతో వెలిగించబడుతుంది. అట్టి క్షణాల వరుసైన జీవితమంతా ఆధ్యాత్మిక దీపావళిగా శాంతి ఆనందాలను నలుదిశలా ప్రసరింపచేస్తూ, సకల సృష్టికి ప్రతి దినమూ పర్వదినములా ఆనందదాయకంగా జరుగుతుంది. ఇదే నిజమైన దీపావళి. ఇట్టి దీపావళే అమ్మ. గురుపత్ని దివ్యజనని అలివేలు మంగమ్మ పుట్టినరోజు సందర్భముగా మరియు వచ్చే దీపావళి సందర్భంగా అమ్మ, మనకందిస్తున్న స్ఫూర్తిని పురస్కరించుకొని మనందరి జీవితాలుగూడా ఆ పుణ్యదంపతుల కృపాశీస్సులతో దివ్యమైన దీపావళిగా తీర్చిదిద్దాలని ఆ గురుదంపతులను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

25


 

పూజ్య గురుపత్ని బోధలు గురుపత్ని అలివేలు మంగమ్మ

పూజ్యశ్రీ మాస్ట రుగారు ఆచరించి చూపినట్లు మనం గూడ మన గురుదేవులైన పూజ్యశ్రీ మాస్ట రుగారిని గురించి యింకా యింకా తెలుసుకోవడానికి, ఆయన చెప్పిన వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి. సామాన్యంగా మనము పూజ్యశ్రీ మాస్ట రుగారి గురించి ఎంతో తెలుసనుకుంటాము. కానీ ఆలోచించిన కొద్దీ ఆయన గురించి ఎంతో తెలియదని తెలుస్తుంది.”

‘నేను మాస్ట రుగారు చెప్పినవిధంగా సత్సంగాలు చేస్తు న్నాను, ఇన్ని సత్సంగాలు చేసాను. నన్ను వాడు గౌరవించడా?’ అని ఎప్పుడైనా అనిపించడము, అనడమూ జరిగిందనుకుందాం. దాని వెనకాలవున్న భావమేమిటో ఆలోచించుకోవాలి. అంటే మనం సత్సంగాలు చేస్తు న్నామన్న అహంకారము, మనం గొప్పవాళ్ళమన్న గర్వము, మనలను యితరులు గౌరవించాలన్న కీర్తి కాంక్ష వున్నాయని అర్థం. మనలను నలుగురూ గౌరవించడము, మనలను కార్లలో త్రిప్పడము, ఎక్కడెక్కడికో సత్సంగాలకు తీసుకెళ్ళడము, విదేశాలకు తీసుకువెళ్ళడము, మనకు అనుచరులు లక్షల కొద్దీ వుండడమూ-ఇవేవీ మన ఉన్నతికి సరియైన కొలబద్ద లు కావు. మనలోని బలహీనతలను గుర్తించి, వాటిని తొలగించుకోవడానికి ఎంతగా ప్రయత్నిస్తు న్నాము అన్నదే పూజ్యశ్రీ మాస్ట రుగారు చెప్పిన దానిని అమలు పరుస్తు న్నామనడానికి నిదర్శనం. ఒక ప్రక్క ఆయన చెప్పినట్లు

26

 2020


 

“ “

“ “

సత్సంగాలు మొ॥నవి చేసుకుంటూ, మరొకప్రక్క మనలోని బలహీనతలను తొలగించుకుంటూ పోతుండడమే పూజ్యశ్రీ మాస్ట రుగారి అనుగ్రహానికి పాత్రులమవడానికి, అర్హత సంపాదించు కోవడానికి మార్గము.” ‘శ్రద్ధ ’ అనే పదానికి అర్థం - మమకారంతో గూడిన లేక ప్రేమతో గూడిన జాగ్రత్త లేక ఆసక్తి అని చెప్పుకోవచ్చు. శ్రద్ధ అనేది మనిషికి చాలా అవసరం. అటు ఆధ్యాత్మికోన్నతికి గాని, ఇటు ఐహిక శ్రేయస్సుకుగానీ శ్రద్ధ లేనిదే ఉపయోగం వుండదు. అందుకే పెద్ద లు ‘శ్రద్ధా వాన్ లభతే జ్ఞానం’ అన్నారు.” ‘కృతజ్ఞ తకు మరోపేరు సాయి’ అని పూజ్యశ్రీ మాస్ట రుగారన్నారు. అలాగే కృతజ్ఞ తకు మరోపేరు పూజ్యశ్రీ మాస్ట రుగారు గూడా. శ్రీ సాయినాథుడు తమకు ప్రసాదించిన ఆధ్యాత్మికానుభవానికి కృతజ్ఞ తగా ఆయన తమ జీవితాన్నే సాయి సేవకు అంకితం చేసారు.పూజ్యశ్రీ మాస్ట రుగారు చేసినట్టు మనం గూడ సేవ చేసి ఆయనకు కృతజ్ఞ తలు తెలుపుకోవాలి. దయ, సహనము, పరోపకారము, సద్గ ్రంథ పఠనము, శ్రవణ, మనన, నిధి ధ్యాసనము, సత్సంగము, భజన, సద్గు రు సమాగమము, మహాత్ముల దర్శనము సాధ్యమైనంతవరకూ వీటన్నింటినీ చేయడానికి ప్రయత్నించాలి.” పూజ్య శ్రీ మాస్ట రుగారు చెప్పిన వాటిని మననం చేసుకుంటూ, మన ఆలోచనలను, ప్రవర్తనను మలచుకుంటూ పోతుంటే మనకు సాధన సులభతరమవుతుందని వేరే చెప్పుకోనవసరం లేదు.” పూజ్యశ్రీ మాస్ట రుగారు ఏమేమి చేసారో, ఏమేమి చెప్పారో, ఎంత ధర్మబద్ధంగా జీవించారో ఆయన గురించి తెలిసిన మనందరికీ తెలుసు. ఆయన కోరుకున్న విధంగా మన జీవితాలను మలచుకోవడమే మన కర్తవ్యము. కనుక మనలో ఆయన తొలగించుకోమన్న గుణాలు వున్నాయో లేదో నిష్కర్షగా గమనించుకోవాలి. ఆచరించడానికి ప్రయత్నించాలి. నిష్కర్షగా గమనించుకోకుండానే మనలో అటువంటి తొలగించుకోవలసిన గుణాలేవీ లేవని అనుకుంటే ఇతరులకు ఏమీ నష్టం లేదు. ‘చెప్పేవాళ్ళు లేక చెడిపోయారు’ అన్న సామెత లోకంలో వుంది. కానీ మనం చెప్పేవాళ్ళు వున్నా చెడిపోయిన వాళ్ళమవుతాము. ఇంతటి అదృష్టాన్ని చేజేతులా జారవిడచుకున్న వాళ్ళమవుతాము. ఎన్నో జన్మలు నష్ట పోతాము.”

 2020

27


 

ఆచార్యుని అద్భుత లీలలు కా

వలి వాస్తవ్యులు వేదపండితులు శ్రీ వేంకట బాలసుబ్రహ్మణ్యశర్మగారు ఈవిధంగా తెలియచేస్తున్నారు -2015లో కావలిలో బాబాగుడి నిర్మించారు. దానిలో ప్రతిష్టించే యంత్రాలను పూజ్యశ్రీ అమ్మగారిచేత తాకించుకుని ఆశీస్సులు తీసుకుని రావాలని కావలిడాక్టరుగారి కుటుంబసభ్యులతోపాటు నేను కూడా నాగోలుకి వచ్చాను. నిజానికి పూజ్యశ్రీ అమ్మగారి నిలయం అన్ని ఇళ్ల మధ్యలో ఒక ఇల్లు. కానీ నాకు ఆ ఇంటి ద్వారంవద్దకు రాగానే హృదయంలో విపరీతమైన ఆనందం, పారవశ్యం కలిగాయి. పూజ్యశ్రీ అమ్మగారు ఎంతటివారో అప్పుడు నాకు అర్థమైంది. అదే మొదటిసారి నేను అక్కడకి రావడం. మేము వచ్చిన పని పూర్తయ్యాక రాత్రి కావలికి తిరుగుప్రయాణమయ్యాము. స్లీపర్ బస్సు ఎక్కాము. అర్ధరాత్రి డ్రైవరు బస్సును ఒక చోట ప్రయాణీకుల

28

అవసరాలకు ఆపాడు. నేను నిద్రపోతున్నాను. బస్సు ఆగేసరికి నాకు కూడా మెలుకువ వచ్చింది గాని నేను దిగలేదు. అకస్మాత్తుగా నాకు సిగెరెట్ వాసన వచ్చింది. ‘AC బస్సులో సిగరెట్ ఎవరు తాగుతున్నారా?!’ అనిపించి లేచి చూశాను. నా పై బెర్త్ లో ఒకాయన గళ్ళలుంగీ, తెల్లబనీను వేసుకుని వున్నారు. కాళ్ళు క్రిందకు వేళ్ళాడేసి కూర్చుని సిగరెట్ తాగుతున్నారు. నావైపుచూసి, “యంత్రప్రతిష్ఠ కోసం ఆశీస్సులకు వచ్చావా? బాగా జరుగుతుందిలే! నేను కూడా వస్తాను” అన్నారు! నాకు అది పూర్తి మెలకువ కాదు, నిద్రాకాదు. ఈమాటలు మాత్రం బాగా వినిపించాయి. నేను ఆలోచిస్తూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను. మా బస్సు బయలుదేరబోతోంది. మాతో వచ్చిన ఒకతను బస్సు ఎక్కగానే, “నీకు సిగరెట్ వాసన వస్తోందా? ఆ పైబెర్త్ లో ఎవరైనా కనిపిస్తున్నారా?” అని అడిగాను. “ఏమీ రావటంలేదు, ఎవరూ

 2020

లేరు!” అని చెప్పాడు. నేను నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు ఇంట్లో నేను సంధ్యావందనం చేసుకుంటుంటే అకస్మాత్తుగా నా మనసుకి తట్టింది -రాత్రి జరిగినదంతా నిజమేనని, నాతో మాట్లాడినది పూజ్యశ్రీ మాస్టరుగారేననీ! జరగబోయే కార్యక్రమం గురించి కొన్నిపరిస్థితులవల్ల మేమందరమూ కొంచెం ఆందోళన పడుతున్నాము. నేను పూజ్యశ్రీ మాస్టరుగారిచ్చిన అభయం అందరితో పంచుకోగానే రెట్టించిన ఉత్సాహంతో పనులు చేసుకుంటూ వున్నాము. కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా జరిగింది. అప్పటి మా సమస్యలకు పూజ్యశ్రీ మాస్టరుగారి, పూజ్యశ్రీ అమ్మగారి అండ లేకపోతే ఈరకంగా కార్యక్రమం పూర్తయ్యేది కాదు! మళ్ళీ మూడు సంవత్సరాలక్రితం పూజ్యశ్రీ మాస్టరుగారి, పూజ్యశ్రీ అమ్మగారి కళ్యాణోత్సవానికి నాగోలుకి వచ్చాను. ఆ అనుబంధం ఇప్పటివరకు కొనసాగుతోంది.


  ఈ సంవత్సరం (మార్చి 2020) కళ్యాణోత్సవానికి రావడం కూడా ఒక అద్భుతమైన లీలే! నేను పనిమీద చెన్నై వెళ్లాను. అక్కడినుంచి హైదరాబాదుకి ప్రయాణమయ్యాను. అయితే ఎదురుకోలు కార్యక్రమానికి హాజరవ్వాలన్న ఉద్దేశంతో విమానంలో బయలుదేరాను. కానీ అప్పటికే కరోనా ప్రభావం మొదలవ్వటంవల్ల మావాళ్ళందరూ “బస్సులో కానీ , ట్రైన్ లో కానీ వెళ్ళు. విమానంలో వెళ్తే పరీక్షచెయ్యాలని చెప్పి అక్కడ ఆపేస్తారు. ఇబ్బంది పడతావ్!” అని చెప్పారు. కానీ సమయం ఎక్కువ లేదని ఫ్లైట్ లోనే బయలుదేరాను. ఎక్కిన దగ్గరనుంచి పూజ్యశ్రీ మాస్టరుగారినే స్మరించుకుంటున్నాను. ఆయన దయవల్ల నన్నెలాంటి ఇబ్బంది పెట్టకుండా పంపించేశారు. కొంచం ఆలస్యమైనా ఎదురుకోలు కార్యక్రమానికి హాజరయ్యాను. వెనక్కి వెళ్లి ఆలోచిస్తే పూజ్యశ్రీ మాస్టరుగారితో అనుబంధం నా చిన్నతనంలోనే మొదలైందని చెప్పాలి. నేను ఒంగోలులో బాబా గుడి పక్కనే వున్న వేదపాఠశాలలో చదువుకునేవాడిని. తరచుగా ఏ సందర్భం వచ్చినా బాబా గుళ్లోను, పూజ్యశ్రీ మాస్టరుగారి సమాధి దగ్గరా వేదపారాయణం చేసేవాళ్ళం. కానీ నాకు అప్పుడు వారి గురించిన అవగాహన ఏమాత్రమూ లేదు. కానీ పూజ్యశ్రీ మాస్టరుగారు మాత్రం నన్ను తనవాడిని చేసుకున్నారు! ఇంకొక అద్భుతం కూడా మీతో పంచుకుంటాను. నెల్లూరులో నవాబ్ పేటలో బాబా గుడి వుంది. ఆ

గుడివాళ్ళు బాబా ఊరేగింపుకోసం పల్లకీ చేయించారు. దానిని శిరిడితో పాటు మిగిలిన దత్తక్షేత్రాలన్నీ తీసుకెళ్లి పూజచేయించుకుని రావడానికి వెళ్తున్నారు. నాకు అప్పుడు 8 సంవత్సరాలు. నాకు కూడా వాళ్ళతో శిరిడి వెళ్లాలనిపించి మా నాన్నని అడిగాను. మా నాన్న అంతవరకూ నన్ను ఎప్పుడూ వదిలివుండలేదు. కానీ అప్పుడు మాత్రం వెళ్లిరమ్మన్నారు! ఆ వయసులో ఆవిధంగా దత్తక్షేత్రాలు దర్శించుకునే అవకాశం వచ్చింది. ఆ యాత్రనుంచి తిరిగి రాగానే అందరం పూజ్యశ్రీ అమ్మగారిని దర్శించుకున్నాము. అందరితోపాటు నేనూ పూజ్యశ్రీ అమ్మగారికి పాదాభివందనం చేసుకున్నాను. నాకు అరటిపండు ప్రసాదంగా ఇచ్చారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరవాత నాగోలుకి రాగలిగాను. ఒక్కసారి నమస్కారం చేస్తే మనం గుర్తించినా గుర్తించకున్నా వారు మన వెన్నంటే వుంటారనడానికి నేనే నిదర్శనం. శివపార్వతులవంటి ఆదిదంపతులైన పూజ్యశ్రీ అమ్మగారి, పూజ్యశ్రీ మాస్టరుగారి కల్యాణోత్సవంలో పాల్గొనే మహదవకాశం, గురుకుటుంబంతో సాన్నిహిత్యం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారి పాదపద్మములకు న మ స్ సుమాం జ లు లు సమర్పించుకుంటున్నాను. జై సాయిమాస్టర్!!

పూజకు మించిన సాధనం మరొకటి లేదు 03వ పేజీ తరువాయి

భక్తిభావాన్ని వ్యక్తం చేసుకునే విధానమే పూజ, వేరేదో కాదని ముందు గుర్తించాలి. అందుకే షోడశోపచార పూజలోని ఉపచారాలన్నీ మన ఇంటికి వచ్చిన పూజనీయులైన వ్యక్తికి మనం చేసే సత్కారములోని అంశాలే ఐవున్నాయి. మనం అట్టివారికి చేసే సత్కారం అంతా వారిపట్ల మనకు గల ప్రేమ, గౌరవ, విశ్వాసాలను వ్యక్తంచేయడమే! ‘వ్యక్తం చేయడమెందుకు?’ అనడం సరికాదు. నిజమైన ప్రేమగల చోట- ప్రేమను వ్యక్తం చేసుకోవడంలో ఒక ఆనందం, తృప్తి వున్నదనడానికి మన జీవితానుభవమే ఋజువు. పిల్లలపై ప్రేమను ఎత్తుకోవడం, ముద్దిడడం, వారికి గుడ్డలు, మిఠాయిలు కొనివ్వడంలో వ్యక్తం చేస్తుంటే ఒక తృప్తి కలుగుతుంది. అలాగే ప్రేయసి విషయంలోనూ. అలా ప్రేమ వుండి వ్యక్తం చేయనవకాశం లేకుంటే చాలా వ్యధ కలుగుతుంది. అసంతృప్తి మిగులుతుంది. అలా వ్యక్తం చేసుకునే అవకాశం వుండదు కనుకనే తల్లి బిడ్డ నుండి, ప్రియుడు ప్రేయసి నుండి ఎడబాటును సహించలేరు. హృదయగతంగా ప్రేమ వుండటం చాలదు. దానిని వ్యక్తం చేసుకొని తిరిగి వారి ప్రేమను మనము అలా పొందగలిగినప్పుడే ప్రేమ వుంటుంది. మనకు ప్రీతిపాత్రమైన వారి -వేంకట బాలసుబ్రహ్మణ్యశర్మ చిత్రపటాలను, వస్తువులను శుభ్రంగా అలంకరించుకోవడంలోని తృప్తి కూడా అలాంటిదే!

 2020

29


              -                               -       ?  ?            -                        ( ) - 

450-00 90-00 99-00 99-00 120-00 125-00 80-00 40-00 10-00 15-00 10-00 5-00 40-00 99-00 99-00 50-00 50-00 99-00 49-00 75-00 128-00 40-00 10-00 49-00 49-00 70-00 49-00 80-00 49-00 49-00 70-00

                                (2)     BOOKS IN ENGLISH

Sai Baba the Master Sree Guru Charitra Supreme Master(Swami Samartha) Sai Baba of Shiridi and His Teachings Life and Teachings of Hazarat Tajuddin Baba Children’s SaiBaba the Master

120-00 70-00 70-00 125-00 80-00 40-00 175-00 25-00 50-00 125-00 50-00 175-00 99-00 99-00 99-00 99-00 60-00

BOOKS IN OTHER LANGUAGES Sadguru Sai Baba(Hindi) Sai Leelamrutham(Kannada) Sai Baba Jeevitha Charitham(Malayalam) Sai Baba Leelamrutham(Tamil) Sri Guru Charitra (Hindi) Swami Samartha (Kannada) Sri Guru Charitra(Kannada) Shiridi Aarathi(Tamil) Stavana Manjari(Tamil) Tibet Yogi Milarepa Jeevitha Charitra(kannada) Sri Sainath Prabodhamruthamu (Kannada)

150-00 150-00 220-00 175-00 99-00 99-00 45-00 15-00 10-00 55-00 65-00

SRI GURUPADUKA PUBLICATIONS, C/O SRI MANGA BHARADWAJA TRUST, Regd. Office: Bhakta Nivas, 12-1-170/46P, Hanuman Nagar, Jaipuri Colony, Nagole, Hyderabad - 68 Phone : +91 - 74160 41550 Branch Office: Kondaiah Bunk Street, Kothapet, Ongole, Prakasam Dt., Andhra Pradesh. Phone: 08592 233271 Send DD in favour of ‘‘Sri Manga Bharadwaja Trust(Publications)’’, payable at Hyderabad or Ongole.




Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.