Page 1

MAY 2017 VOL 14 ISSUE 5

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET


   

 ప్ర

స్తుతం స్పైడర్ చిత్రంలో నటిస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే . భరత్ అను నేను అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అన్న తీవ్ర తర్జన భర్జన అనంతరం రకుల్ ప్రీత్ సింగ్ నే ఎంపిక చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట కొరటాల శివ అండ్ కో . ప్రస్తుతం స్పైడర్ చిత్రంలో మహేష్ సరసన నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ . కాబట్టి ఆమెనే కంటిన్యూ చేస్తే సరిపోతుంది అని ఫిక్స్ అయ్యారట . కుల్ ని అనుకోకముందు దిశా పటాని లేదంటే కియారా అద్వానీ లలో ఎవరో ఒకరిని తీసుకోవాలనుకున్నారు కానీ వాళ్లకు ఆ అదృష్టం లేకపోవడంతో మళ్ళీ రకుల్ నే వరించింది .


“BE WHO YOU ARE AND SAY WHAT YOU FEEL, BECAUSE THOSE WHO MIND DON’T MATTER, AND THOSE WHO MATTER DON’T MIND.” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By

: : : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MAY 2017

టాలీవుడ్ P 3






సా

యి శ్రేయ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనివాస్ బోని, పార్వతినాయుడు నిర్మాతలు ‌ గా సాయిబాబాపై స్వ‌ర సుంద‌ర్ ర‌చ‌న‌లో జి.ఆర్‌.న‌రేన్ సంగీత సారథ్యంలో రూపొందిన `పిలిచినా ప‌లుకుతావ‌నీ..` పాట‌ల సీడీ విడుద‌ల కార్య‌క్రమ ‌ ం ఇటీవల హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ముర‌ళీమోహ‌న్ బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. అనంతరం.. రళి మోహన్ మాట్లాడుతూ - ``సాయినాథునిపై పాట‌లు ఎప్పుడు విన్న బాగానే ఉంటాయి. శ్రీనివాస్ బోని, పార్వతినాయుడు చేసిన ఈ ప్ర‌య‌త్నం చాలా బావుంది. న‌రేన్ చ‌క్క‌ని సంగీతాన్ని అందించారు. మంచి సాహిత్యంతో స్వ‌ర‌సుంద‌ర్ పాట‌ల‌ను చ‌క్క‌గా రాశారు. నేను 350 సినిమాల‌కు పైగా న‌టించిన న‌టుడినే ఓ వ్య‌క్తి న‌న్ను ఓ సంద‌ర్బంలో క‌లిసి సాయిబాబాపై వేటూరిగారు రాసిన పాట‌ను బాలుగారు ఆర‌గంట పాటు పాడార‌ని, ఆ పాట‌లో న‌న్ను సాయిబాబా భ‌క్తుడిగా న‌టించ‌మ‌ని అన్నారు. నేను కూడా నిజ‌మైన భ‌క్తుడిలా కనిపించాల‌ని, ఒక నెల రోజులు గ‌డువు టైం కావాల‌ని చెప్పి, ఏ మేక‌ప్ లేకుండా గ‌డ్డం పెంచి త‌ర్వాత న‌టించాను. ఆ పాట ఇప్ప‌టికీ టీవీ చానెల్స్‌లో వ‌స్తుంటుంది. అంత పెద్ద పాట‌ను రెండు రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశామంటే కారణం సాయిబాబానే అని నేను భావిస్తుంటాను. ఆ పాట విన్న‌వారంద‌రూ ఆ పాట‌లో నేను బాగా చేశాన‌ని మెచ్చుకోవ‌డం విన్న‌ప్పుడంతా, నాకు సంతోషంగా ఉంటుంది. `పిలిచినా ప‌లుకుతావ‌నీ..`ఆల్బ‌మ్ చేసిన అంద‌రికీ న‌చ్చే పాట‌ల‌తో చ‌క్క‌గా ఉంది. ఈ నిర్మాతలు ‌

ము

4 P టాలీవుడ్

భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని మంచి ప్ర‌య‌త్నాలు చేస్తార‌ని భావిస్తున్నాను`` అన్నారు. వాజీ రాజా మాట్లాడుతూ - ``పిలిచినా ప‌లుకుతావ‌నీ` పాట‌లు చాలా బావున్నాయి. నిర్మాతలు ‌ శ్రీనివాస్‌, పార్వ‌తినాయుడు, సంగీత ద‌ర్శ‌కుడు న‌రేన్‌ల‌కు నా అభినంద‌న‌లు`` అన్నారు. నిల్ చంద్ర మాట్లాడుతూ - ``దేవుడి భ‌క్తిని ఇలా తెలిపిన నిర్మాతల ‌ ‌కు మంచి భ‌విష్య‌త్ ఉంటుంది. న‌రేన్ చాలా మంచి సంగీతం అందించాడు`` అన్నారు. కార్య‌క్ర‌మంలో రేలంగి న‌ర‌సింహారావు, డా.జ‌యంతిరెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ క‌మీష‌న‌ఱ్ సుదాన్ష్ త‌దిత‌రులు పాల్గొన్నా ఆర్.నరే న్ మాట్లాడుతూ, సాయిబాబు పాటలను కంపోస్ చేసే గొప్ప అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

శి

ఈ జి


సీ



నియర్ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా కథానాయకుడిగా, షిరాగార్గ్, అంజలిరావు కథానాయికలుగా, బేబి శాతన్య, బేబి శ్రీవర్షిని ముఖ్యపాత్రల్లో డి.సురేష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన బేబి చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. పాలపర్తి శివకుమార్ శర్మ సమర్పణలో సాయిప్రసన్న పిక్చర్స్ పతాకంపై బి.వి.ఎన్. పవన్ కుమార్, కొలవెన్ను ఆంజనేయప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సతీష్, హరీష్ సంగీతాన్ని సమకూర్చారు. కాగా ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. బిగ్ ఆడియో సీడీలను సీనియర్ నటుడు సుమన్ ఆవిష్కరించగా, ఆడియో సీడీలను ఆర్.పి.పట్నాయక్ విడుదలచేసి, తొలి సీడీని సుమన్ కు అందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, నేను పరిశ్రమలోనికి వచ్చిన తొలి రోజుల్లో అంటే 1975వ సంవత్సరంలో ఇద్దరు రాజాలు ట్రెండ్ ను మార్చివేశారు. వారెవరో కాదు ఒకరు భారతీరాజా, మరొకరు ఇళయరాజా. సహజత్వానికి దగ్గరగా సినిమాలను తెరకెక్కించి కొత్తపంథాకు వారు తెరతీశారు. ఇప్పుడు భారతీరాజా అబ్బాయి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతుండటం ఆనందంగా ఉంది. పాటలతో పాటు ఈ చిత్రం ట్రైలర్స్ కూడా ఎంతో బావున్నాయి అని అన్నారు. రో అతిథి ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ, ట్రైలర్ లోని హారర్ అంశాలు చూస్తుంటే మంచి ఉత్కంఠను కలిగిస్తోందని, పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పారు.ఇంకో అతిథి తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య

ఉన్నప్పటికీ, కంటెంట్ ఉన్న సినిమాలకు విడుదల సమయంలో థియేటర్లు బాగానే దొరుకుతున్నాయని అన్నారు. ఇప్పటికే తమిళ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న ఈ చిత్రానికి తప్పకుండా తెలుగు ప్రేక్షకుల మద్దతు కూడా లభిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇంకో అతిథి శ్రీరంగం సతీష్ కుమార్ మాట్లాడుతూ, నిర్మాతలు ఎంతో అభిరుచితో చిత్ర పరిశ్రమలోనికి ప్రవేశించారని, ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. గీత రచయిత చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, మదర్ సెంటిమెంట్, హారర్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించారు. పాటలతో పాటు హారర్ హైలైట్ గా ఉంటుంది అని అన్నారు. త్ర నిర్మాతలు బి.వి.ఎన్.పవన్ కుమార్, కొలవెన్ను ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ, సస్పెన్స్, హారర్ కథాంశంతో ఫ్యామిలీ ప్రేక్షకులు చూసేవిధంగా ఈ చిత్రం ఉంటుందని, మే నెలలో చిత్రాన్ని విడుదలచేస్తామని చెప్పారు.దీని తర్వాత తెలుగులో స్ట్రయిట్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాయివెంకట్, రమేష్, పిశాఛి-2 చిత్రం ఫేమ్ శిప్రాగౌర్, చిత్ర సమర్పకుడు పాలపర్తి శివకుమార్ శర్మ, సహ నిర్మాతలు బత్తుల కూర్మయ్య, బత్తుల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శివరంజని మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో విడుదలైంది.

చి

టాలీవుడ్ P 5


   TFJA

  TFJA

    

   TFJA

  TFJA

6 P టాలీవుడ్

TF


TFJA

TFJA

TFJA 

 



FJA with Mamidi

TFJA  టాలీవుడ్ P 7


   TFJA

 టా

8 P టాలీవుడ్

లెంటెడ్ హీరో నందు నటించిన రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇంతలో ఎన్నెని వింతలో విడుదలకి ముస్తాబవుతోంది. హరి హర చలన చిత్ర పతాకం పై తెరకెక్కిన ఈ సినిమాతో వి.వి. వినాయక్ శిష్యుడు వరప్రసాద్ వరికూటి దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి విశేష స్పందన లభించిందని, అదే ఉత్సాహం తో చిత్రాన్ని కూడా మే 26న విడుదల చేసి సక్సెస్ అందుకుంటామని దర్శకనిర్మాతలు అంటున్నారు.. ఇప్పటివరకు టాలీవుడ్ లో రాని ఓ ఢిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమా రూపొందినట్లుగా చిత్ర బృందం తెలిపింది. నూతన దర్శకుడు అయినప్పటికి వరప్రసాద్ ఈ సినిమాని ప్రేక్షకుల్ని అలరించే రీతన తీర్చిదిద్దనట్లు యూనిట్ సభ్యలు చెబుతున్నారు. వేసవి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో హీరో నందుతో పాటు స్వామిరారా ఫేమ్ పూజారామచంద్రన్ కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సాధ్యమైనతం త్వరగా వాటిని ముగించి ఈ మండు వేసవిలోప్రేక్షకుల్ని హాయిగా అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా దర్శకుడు వరప్రసాద్ తెలిపారు.






నే

చురల్‌స్టార్‌నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను కోరి'. ఈ చిత్రాన్ని జూన్‌ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రం ప్రోగ్రెస్‌ గురించి నిర్మాత దానయ్య డి.వి.వి. తెలియజేస్తూ - ''అమెరికాలో భారీ షెడ్యూల్‌ చేశాం. ఏప్రిల్‌ 17 నుంచి వైజాగ్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెల 29 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్‌ మినహా టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. జూన్‌ 23న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌చేశాం'' అన్నారు. చురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌

ఈ నే

నేహంత్‌ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్:‌ లక్ష్మణ్‌ముసులూరి, ప్రొడక్షన్‌కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి. వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.

టాలీవుడ్ P 9


 సౌ



తిండియాలో న‌య‌న‌తార‌ను సూప‌ర్‌స్టార్‌ని చేసిన మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ `పుదియ నియ‌మం` శ్రీ‌రామ్ సినిమా ప‌తాకంపై ఎస్‌.ఆర్. మోహ‌న్ తెలుగులో `వాసుకి`గా అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెన్సార్‌కి సిద్ధ‌మైంది. సంద‌ర్భంగా నిర్మాత ఎస్‌.ఆర్‌. మోహ‌న్ మాట్లాడుతూ -``తెలుగు కోసం మా `వాసుకి` చిత్రాన్ని ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా మ‌న నేటివిటీని ప్ర‌తిబింబిస్తూ, భారీ స్థాయిలో సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేశాం. నెలాఖ‌రులోగా సెన్సార్ పూర్తి చేసి, వేస‌వి కానుక‌గా రిలీజ్ చేస్తాం. తొలికాపీ చూశాక ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా భారీ స్థాయిలో సినిమాని రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం. వాసుకి చిత్రం తెలుగులో అద్భుత విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ చిత్రంలో త‌న న‌టన ‌ ‌తో న‌య‌న్‌ ప్ర‌తి తెలుగు ప్రేక్ష‌కుని మ‌న‌సులో సుస్థిర స్థానం ఏర్ప‌రుచుకుంటుంది. న‌య‌న‌తార చిత్రంతోనే మేం తెలుగు చ‌ల‌న‌చిత్ర రంగంలో అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

10 P టాలీవుడ్

ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దిస్తార‌నే న‌మ్మ‌కంతోనే వేస‌వి కానుక‌గా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. స‌హ‌క‌రించిన‌అంద‌రికీ ధ‌న్య‌వాదాలు`` అన్నారు. చిత్రానికి కెమెరా: వ‌ర్గీస్ రాజ్‌, సంగీతం: గోపి సుంద‌ర్‌, బ్యాన‌ర్:‌ శ్రీ‌రామ్ సినిమా, నిర్మాత:‌ ఎస్‌. ఆర్‌.మోహ‌న్, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.కె.షాజ‌న్‌, మాటలు:వెంకట్ మల్లూరి, పాటలు:భువనచంద్ర,వెన్నెలకంటి


దే



వుళ్ల పాత్ర‌ల్లో ఒదిగిపోయే నటులు విజ‌య్ చంద‌ర్. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో భ‌క్తి సినిమాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. క‌రుణామ‌యుడిగా.. శిరిడీసాయిబాబాగా ఆయ‌న ఆహార్యం..న‌ట‌న తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకుంది. తాజాగా ఇప్పుడు `సాయి నీ లీల‌లు` అంటూ మరోసారి అల‌రించ‌డానికి వ‌స్తున్నారు. రాధా చిత్ర ప‌తాకంపై విజ‌య్ చంద‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం ఇటీవల‌ం హైద‌రాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో జ‌రిగింది. నంత‌రం విజ‌య్ చంద‌ర్ మాట్లాడుతూ, ` ఈ చిత్రం తెర‌కెక్క‌డానికి కార‌ణం సాయి బాబానే. 35 ఏళ్ల క్రితం సాయిబాబా మ‌హ‌త్యం సినిమా చేశాం. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఆయ‌న‌కు నా పై కృప క‌ల్గింది. ఆయ‌న ఆశీర్వాదాల వ‌ల్లే మ‌ళ్లీ ఈ సినిమా చేస్తున్నాను. భ‌క్తుల కోసం ఆయ‌న బాధ్య‌త‌గా నాతో ఈ సినిమా చేయిస్తున్నారు. ఈ సినిమా టీమ్ కూడా బాబా స‌మ‌కూర్చిందే. సాయి లీల‌ల‌ను ప్రేక్ష‌కులంతా చూసి త‌రిస్తార‌ని కోరుకుంటున్నాం` అని అన్నారు. ట‌ల ర‌చయి ‌ త తోట‌ప‌ల్లి మ‌ధు మాట్లాడుతూ, ` అక్టోబ‌ర్ 18 నాటికి సాయిబాబా స‌మాధికి 100 ఏళ్లు పూర్త‌యింది. ఇప్పుడు మ‌ళ్లీ సాయి నీల‌లు సినిమా రావ‌డం ఆనందంగా ఉంది. సాయిబాబా మ‌హ‌త్యానికి అప్ప‌ట్లో మాట‌లు అందించాను. మ‌ళ్లీ అదే సినిమాకు ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నా. దేవుడి పాత్ర లో విజ‌య్ చంద‌ర్ గారు ఒదిగిపోతారు. గ‌తంలో ఆయ‌న చేసిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకున్నాయో అంద‌రికీ తెలిసిందే` అని అన్నారు. నంత శ్రీరామ్ మాట్లాడుతూ, ` అప్ప‌ట్లో సాయిబాబా మ‌హ‌త్యం సినిమాకు ఆత్రేయ గారు పాట‌లు రాశారు. ఇప్పుడు సాయి నీ ల‌ల‌కు పాట‌లు రాసే అవ‌కాశం

మా

నాకు ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్నా. ఆధ్యాత్మిక సినిమాకు ప‌నిచేయ‌డం కొత్త అనుభూతినిస్తుంది. అలాగే ఈ సినిమాకు న‌న్నే స్వ‌ర‌కర్త అవ్వ‌మ‌ని విజ‌య్ చంద‌ర్ అన్నారు. అందుకు నేను అర్హుడిని కాన‌న్నాను. కానీ ఆయన ప‌ట్టుబ‌ట్టి మ‌రీ స్వ‌ర‌క్త‌ను చేశారు. ఈ టీమ్ అంద‌ర్నీ ఒకే చోట క‌లిపింది ఆబాబానే` అని అన్నారు. ర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` విజ‌య్ చంద‌ర్ గారు గ‌తంలో చేసిన భ‌క్తి సినిమాలు ఎంత పెద్ద హిట్ నో అంద‌రికీ తెలుసిందే. మ‌ళ్లీ భ‌క్తి సినిమా చేయ‌డం అదీ..బాబాగా క‌నిపించ‌డం ప్రేక్ష‌కుల‌కు కొత్త ఫీల్ ను ఇస్తుంది. ఈ చిత్రానికి యంగ్ స్టార్స్ ప‌నిచేస్తున్నారు. సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు. దిశేష గిరిరావు మాట్లాడుతూ,` విజ‌య్ చంద‌ర్ గారు క‌రుణామ‌యుడు, సాయిబాబా పాత్ర‌ల్లో న‌టించి ప్ర‌ప‌చ‌మంతా పాపుల‌ర్ అయ్యారు. విదేశాల్లో కొన్ని షోస్ కూడా నిర్వ‌హించ‌డంతో ఆయ‌న‌కు మంచి పేరు ప్రఖ్యాత‌లు సంపాదించారు. మళ్లీ ఇన్నేళ్ల‌కు భ‌క్తి సినిమాలో న‌టిస్తున్నారు. ఇలాంటి సినిమాల‌కు విదేశాల్లో కూడా చ‌క్క‌ని ఆద‌రణ ‌ ల‌భించాలి. అలాగే జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న సినిమాల‌ను మీడియా ఎక్కువ ప్ర‌మోట్ చేయాలి` అని అన్నారు. బ్లీ హిల్స్ కార్పోరేట‌ర్, ఫిలిం న‌గ‌ర్ హౌసింగ్ సొసైటీ సెక్ర‌ట‌రీ కాజా సూర్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ` దైవం పాత్ర‌లో లీన‌మైపోయే గొప్ప న‌టులు విజ‌య్ చంద‌ర్. అలాంటి పాత్ర‌లు ఆయ‌న మాత్ర‌మే చేయ‌గల‌రు. దేవుడు పాత్ర‌కు అత‌ని శ‌రీరం..రూపం బాగా కుదురుతాయి. మ‌ళ్లీ చాలా కాలం త‌ర్వాత సాయిబాబా గా న‌టించ‌డం ఆనందంగా ఉంది` అని అన్నారు. చిత్రానికి ఆది అనంత్ ( అనంత శ్రీరామ్) సంగీతం అందిస్తున్నారు. అలాగే అతిధులుగా హ‌జ‌రైన వారంతా జ్యోతిప్రజ్వ‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ని

జా ఈ

టాలీవుడ్ P 11




‌ స సూప‌ర్హి రు ‌ ట్‌ చిత్రాల త‌రువాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, బ‌న్నివాసు నిర్మాతగా ‌ జిఏ2 బ్యాన‌ర్ లో ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో, పెళ్ళిచూపులు ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరొగా చిత్రం ఇటీవల మాస్ట‌ర్‌అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్‌, సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు. త్ర నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ..శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 ప్రోడ‌క్ష‌న్ నెం-4 గా , శ్రీర‌స్తుశుభ‌మ‌స్తు చిత్రాన్ని ద‌ర్శక‌ ‌త్వం చేసిన‌ ప‌రుశురాం , పెళ్ళిచూపులు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో , మాస్ట‌ర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్‌, సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.అని అన్నారు. రో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో, బ‌న్ని వాసు నిర్మాతగా ‌

చి

హీ

12 P టాలీవుడ్

,జిఏ2 బ్యాన‌ర్‌లో , ప‌రుశురాం గారి ద‌ర్శ‌కత్వంలో చేస్తున్న చిత్రానికి పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం. ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం చేయ‌టం చాలా ఆనందంగా వుంది. అని అన్నారు. ‌ర్శ‌కుడు ప‌రుశురా మాట్లాడుతూ.. అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో , బ‌న్ని వాసు నిర్మాతగా ‌ , జిఏ2 బ్యాన‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా చేస్తున్న చిత్రానికి మాస్ట‌ర్‌ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్టై ‌ న‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్,‌ సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు నిర్మాత అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.అని అన్నారు. కెమెరా- మ‌ణికంఠ‌న్‌ సంగీతం-గోపిసుంద‌ర్‌ స‌మ‌ర్ప‌కులు- అల్లు అర‌వింద్‌ నిర్మాత‌- బ‌న్ని వాసు క‌థ‌,మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం- ప‌రుశురాం


రే

సుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో, శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ఈ చిత్రాన్ని జూన్ 23న విడుద‌ల చేస్తున్నారు. ర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఆర్య‌, ప‌రుగు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో చేస్తోన్న హ్యాట్రిక్ మూవీ `డిజె దువ్వాడ జ‌గన్ ‌ నాథ‌మ్`‌ . మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న 25వ సినిమా కూడా ఇదే కావ‌డం విశేషం. ఈ చిత్రంలో బ‌న్నిని స‌రికొత్త లుక్‌లో చూస్తారు. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. నేను, బ‌న్ని, హ‌రీష్ శంక‌ర్‌, దేవిశ్రీప్ర‌సాద్, ఇలా మా కాంబినేష‌న్లో ‌ మూవీ అన‌గానే సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గట్టుగానే సినిమాను మా డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్ర‌స్తుతం సినిమా అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్రమా ‌ ల‌ను పూర్తి చేసి సినిమాను జూన్ 23న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు. చిత్రానికి ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్,‌ సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్‌: ఛోటా కె.ప్ర‌సాద్, ఆర్ట్‌: రవీందర్‌, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌ నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్‌, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌శంకర్‌.ఎస్‌

ని

  

టాలీవుడ్ P 13


'2.0'



సూ

పర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. '2.0' చిత్రాన్ని సుభాష్‌ కరణ్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ 350 కోట్ల భారీ బడ్జెట్తో ‌ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్‌చేశారు. సందర్భంగా లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం మాట్లాడుతూ - ''సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారు, శంకర్‌గారి కాంబినేషన్‌లో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎంతో లావిష్‌గా రూపొందుతున్న '2.0' ఇండియన్‌ సినిమాలో ఒక చరిత్ర సృష్టిస్తుంది. మా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న

14 P టాలీవుడ్

'2.0' చిత్రాన్ని జనవరి 25, 2018 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం. మొదట దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని అనుకున్నాం. అయితే విఎఫ్‌ఎక్స్‌లో వరల్డ్‌ క్లాస్‌ స్టాండర్డ్స్‌ని అందుకోవడానికి ఎంతో కేర్‌ తీసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని చేస్తున్నాం. దాని వల్ల దీపావళికి రిలీజ్‌ చెయ్యాలనుకున్న ఈ చిత్రాన్ని జవనరి 25, 2018న విడుదల చేస్తున్నాం. విజువల్‌గా ఇప్పటివరకు ఇండియన్‌ సినిమాలో చూడని క్వాలిటీని '2.0'లో ఆడియన్స్‌చూస్తారు'' అన్నారు. పర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్,‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.

సూ




ర్చనవేద ప్రధాన పాత్రదారిగా వరుణ్‌సందేశ్‌ ప్రత్యేకపాత్రలో నటించిన చిత్రం 'మర్లపులి'. ఎపిక్‌ పిక్చర్స్‌మరియు బోర్న్‌క్రాఫ్ట్‌క్రియేషన్స్‌పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి డి. రామకృష్ణ దర్శకుడు. బి. ప్రదీప్‌రెడ్డి, బి. భవానీ శంకర్‌, బి. శ్రీనివాస్‌రెడ్డి, శరత్‌ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ని స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న 'డిజె-దువ్వాడ జగన్నాథం' సెట్‌లో నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్‌ హరీష్‌శంకర్‌, మరో డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి లు విడుదల చేశారు. సందర్భంగా దర్శకుడు డి. రామకృష్ణ మాట్లాడుతూ..మా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసిన నిర్మాత దిల్‌రాజు గారికి, డైరెక్టర్స్‌ హరీష్‌శంకర్‌ మరియు వంశీ పైడిపల్లిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నిర్మాతలు ఈ చిత్రం కోసం ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సహకరించారు. చిత్రం బాగా వచ్చింది. అర్చనవేద నటన ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. వరుణ్‌సందేశ్‌ చాలా కీలకమైన పాత్రలో నటించారు. 'మర్లపులి' మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము..అన్నారు. ర్మాతలు మాట్లాడుతూ..అడగగానే మా చిత్ర ట్రైలర్‌ని ఆవిష్కరించడానికి అంగీకరించిన దర్శకులు వంశీపైడిపల్లి గారికి, హరీష్‌ శంకర్‌ గారికి, నిర్మాత

ఈ ని

 దిల్‌ రాజు గారికి మా చిత్ర యూనిట్‌ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ట్రైలర్‌ చూసిన తర్వాత చాలా బాగుంది. మంచి విజయం కావాలని వారు అనడం మా చిత్రానికి మంచి ఆశీస్సులుగా భావిస్తున్నాము. అలాగే దర్శకుడు రామకృష్ణ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అతి త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి, మంచి సక్సెస్‌ చేస్తారని భావిస్తున్నాము..అని అన్నారు. ర్చన ప్రధాన పాత్రలో, వరుణ్‌సందేశ్‌ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళీ, భానుశ్రీ, తాగుబోతు రమేష్‌, రమణారెడ్డి మొదలగు వారు ఇతర పాత్రల్లో నటించారు. చిత్రానికి కెమెరా: మురళీకృష్ణ, సంగీతం: బి.ఎస్‌. రెడ్డి, నిర్మాతలు: బి. ప్రదీప్‌రెడ్డి, బి. భవానీ శంకర్‌, బి. శ్రీనివాస్‌రెడ్డి, శరత్‌, రచన-దర్శకత్వం: డి. రామకృష్ణ.

టాలీవుడ్ P 15


మా

స్ దర్శకులు బోయపాటి శ్రీను తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా ....... జులై 7. అవును జులై 7న బోయపాటి - బెల్లంకొండ ల సినిమా ని రిలీజ్ చేయాలనీ ముహూర్తం నిర్ణయించుకున్నారు . ఈలోపు షూటింగ్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేయనున్నారు . యి శ్రీనివాస్ సరసన ఇద్దరు అందమైన భామలు రకుల్ ప్రీత్ సింగ్ , ప్రగ్యా జైస్వాల్ లు నటిస్తుండగా కీలక పాత్రలో జగపతిబాబు , ఆది పినిశెట్టి లు నటిస్తున్నారు . మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంపై బెల్లంకొండ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు .

సా





16 P టాలీవుడ్


రుస విజయాలతో మంచి జోరు మీదున్న నాని తనకు కృష్ణగాడి వీర ప్రేమ గాధ వంటి హిట్ చిత్రాన్ని అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో నటించనున్నాడట . ప్రస్తుతం హను రాఘవపూడి నితిన్ తో ''లై '' సినిమా చేస్తున్నాడు . ఆ సినిమా విదేశాలలో షూటింగ్ జరుపుకుంటోంది . కాగా ఆ సినిమా తర్వాత మళ్ళీ నాని తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు హను రాఘవపూడి . క నాని కూడా హను తో సినిమా చేయడానికి మరింత ఉత్సాహంగా ఉన్నాడు . కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన హను అంటే నాని కి ప్రత్యేకమైన అభిమానం ఉంది . ప్రస్తుతం నాని నటించిన '' నిన్ను కోరి '' సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది . దాని తర్వాత మరో రెండు ప్రాజెక్ట్ లు కూడా లైన్లో పెట్టాడు నాని అంటే నాని - హను ల కాంబినేషన్ ల్లో సినిమా అంటే 2018లోనే అన్నమాట .





 టాలీవుడ్ P 17


పె

ళ్లి చేసుకొని కొన్నాళ్ళు సజావుగానే సాగిన కాపురంలో కలహాలు మొదలు కావడంతో కట్టుకున్న భర్తని వదిలేసి వచ్చేసింది మాజీ హీరోయిన్ కరిష్మా కపూర్ . భర్త నుండి విడాకులు మంజూర్ కాకముందే మరొక ప్రియుడి తో కలిసి చెట్టా పట్టలేసుకొని తిరిగి సంచలనం సృష్టించిన ఈ భామ ఎట్టకేలకు రెండో పెళ్ళికి సిద్దమైంది . ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ తోశ్నివాల్ తో కరిష్మా వివాహం జరుగనుంది . కరిష్మా తో పాటు సందీప్ కు కూడా ఇంతకుముందే పెళ్లి కావడం విశేషం . రిష్మా మాయలో పడిన సందీప్ తన భార్య కు విడాకులు ఇవ్వడానికి సిద్దమయ్యాడు . మొదట్లో సందీప్ భార్య విడాకులకు ఒప్పుకోలేదు కానీ కొంతకాలం తర్వాత ఒప్పుకొని భారీ భరణం పొందడానికి సిద్దపడింది . కరిష్మా పెళ్లి పెటాకులు అయ్యింది , ఇక సందీప్ సంసారం కూడా కూలిపోవడంతో ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు



 18 P టాలీవుడ్


   

యు

వ దర్శకుడు కంది రామచంద్రారెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. మిషన్ కాకతీయ పథకం నుండి స్ఫూర్తి పొందిన యువదర్శకుడు, జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి స్వీయదర్శకత్వంలో పునర్జన్మ అనే లఘుచిత్రాన్ని రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఎంట్రీ లు రాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ వీడియో చిత్రం గా దీనిని ఎంపిక చేసింది. రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు దర్శకుడు రామచంద్రారెడ్డికి హైదరాబాద్ లో రాష్ట్ర ఉత్తమ చిత్ర అవార్డు అందజేశారు. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు చిత్రం కాన్సెప్ట్ బాగుందని, బాగా తీశారని దర్శకుడు రామచంద్రారెడ్డిని అభినందించారు. ఈ పునర్జన్మ చిత్రానికి కెమెరా రైసాబ్, ఎడిటింగ్ మందడి అరవింద్ రెడ్డి, సంగీతం శ్రీ వెంకట్, పాటలు వెంగళభాస్కర్ రాయగా, యూసుఫ్, నాజర్ పాషా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.




  

హా

ట్ భామ శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన చిత్రం '' మిక్చర్ పొట్లం ''. ఎంవి సతీష్ కుమార్ దర్శకత్వంలో గోదావరి సినీ టోన్ పతాకంపై కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్ ,కంటే వీరన్న చౌదరి , లంకపల్లి శ్రీనివాసరావు లు సంయుక్తంగా నిర్మించారు . భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో గీతాంజలి హీరోయిన్ గా నటిస్తోంది కాగా భానుచందర్ , సుమన్ , కృష్ణభగవాన్ ,పోసాని , అలీ తదితర ప్రముఖులు నటించిన ఈ చిత్రానికి మాధవపెద్ది సురేష్ చాలాకాలం తర్వాత సంగీతం అందించడం విశేషం . లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ కి కూడా ప్రాధాన్యత ఉందని , శ్వేతాబసు ప్రసాద్ మా చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని తప్పకుండా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు చిత్ర దర్శకులు ఎంవి సతీష్ కుమార్ . క నిర్మాతలు కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్ , కంటే వీరన్న చౌదరి , లంకపల్లి శ్రీనివాసరావు లు మాట్లాడుతూ '' ఎంవి సతీష్ కుమార్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా రంగంలోకి వచ్చామని ,తొలిప్రయత్నంగా మిక్చర్ పొట్లం చేసాం ..... మాధవపెద్ది సురేష్ లాంటి గొప్పవ్యక్తి మా సినిమాకు సంగీతం అందించడం సంతోషంగా ఉందని మేనెలలో మిక్చర్ పొట్లం చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తప్పకుండా మాకు ఇది మంచి ప్రారంభం అవుతుందన్న నమ్మకం ఉంది , ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మా చిత్రాన్ని రెండు ఏరియాలలో రిలీజ్ చేస్తుండటంతో అప్పుడే మా సినిమా హిట్ రేంజ్ ని అందుకుందన్న నమ్మకం ఏర్పడిందని అన్నారు .




టా

ప్ లెస్ గా కనిపించడం అంటే మహా సరదా పడిపోతున్నారు అందాల భామలు . చూసేవాళ్ళు సిగ్గు పడాలి కానీ మాకెందుకు సిగ్గూ అంటూ సిగ్గూ ఎగ్గూ లేని భామలు రెచ్చిపోయి అందాలను చూపిస్తున్నారు . తాజాగా హాట్ భామ రాఖీ సావంత్ టాప్ లెస్ గా దర్శనం ఇచ్చి సంచలనం రేపింది . కింద కూడా పెద్దగా ఏమి వేసుకోలేదు కేవలం అండర్ వేర్ మాత్రమే వేసుకుంది రాఖీ సావంత్ . టాప్ లెస్ గా ఫోజిచ్చి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . ప్పటికే పలు మార్లు పలురకాలుగా వివాదాల్లో చిక్కుకున్న రాఖీ నిత్యం వార్తల్లో ఉండటానికి ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది . ఒంటిపై నరేంద్ర మోడి ఫోటోలు పెట్టుకొని సంచలనం సృష్టించిన ఈ భామ ఇప్పుడేమో టాప్ లెస్ గా కనిపించి ఎద అందాలను చూపిస్తోంది .

టాలీవుడ్ P 23




క్రి

యేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”. క్షత్రం' చిత్రం ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ గీతాన్ని ఓ ప్రముఖ కథానాయిక పై త్వరలోనే చిత్రీకరించ నున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు. అలాగే చిత్రం టీజర్ విడుదల ను ఓ వేడుకగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ చిత్రం లో సుప్రీం హీరో 'సాయి ధరమ్ తేజ్' పోషిస్తున్న పాత్ర అభిమానులను ఎంతగానో అలరిస్తుందన్నారు. మే నెలలో ఆడియో, అదేనెలలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తు న్నట్లు తెలిపారు. 'పోలీస్ 'అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ 'నక్షత్రం' చిత్రమని తెలిపారు దర్శకుడు కృష్ణవంశీ.

24 P టాలీవుడ్



సం

దీప్ కిషన్, రెజీనా,ప్రగ్య జైస్వాల్,తులసి,జె. డి.చక్రవర్తి ,ప్రకాష్ రాజ్,శివాజీరాజా, రఘుబాబు,తనీష్,ముఖ్తర్ ఖాన్,సాయికిరణ్, ప్రధాన తారాగణం. చిత్రానికి మాటలు: తోట ప్రసాద్,పద్మశ్రీ,కిరణ్ తటవర్తి, సంగీతం: భీమ్స్, భారత్, పాటలు: అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, కెమెర:శ్రీకాంత్ నారోజ్, ఎడిటర్: శివ.వై.ప్రసాద్, కొరియోగ్రఫీ: గణేష్,స్వామి; పోరాటాలు:జాషువా మాస్టర్,జాలి బాస్టియన్,శ్రీధర్; ఆర్ట్: పురుషోత్తం, పబ్లిసిటీ: ఓంకార్ కడియం, స్టిల్స్: మల్లిక్, నిర్మాతలు:ఎస్.వేణుగోపాల్,సజ్జు ,కె.శ్రీనివాసులు, కధ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం; కృష్ణవంశీ.


    

క్కినేని నాగచైతన్య సమంత లు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే . పైగా ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా వివాహ నిశ్చితార్దం కూడా జరిగింది . అయితే ఎంగేజ్ మెంట్ అయ్యింది కానీ ఎవరికి వాళ్ళు సినిమా చేసుకుంటున్నారు హాయిగా .... ఒకవైపు నాగచైతన్య మరోవైపు సమంత ఇద్దరు కూడా ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ గా ఉన్నారు . అయితే ఇలా ఎంతకాలం అందుకే ఒప్పుకున్న సినిమాలు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి పూర్తిచేసి అక్టోబర్ లో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట . మంత ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది . ఒకటేమో మామ నాగార్జున తో రాజుగారి గది సీక్వెల్ చిత్రం కాగా మరొకటి చరణ్ - సుకుమార్ ల సినిమా అవి ఆగస్ట్ నాటికి పూర్తిచేసే పనిలో ఉంది , వాటి తర్వాత చైతూ తో పెళ్లి పీటలు ఎక్కనుంది . మొత్తానికి ఈ విజయదశమి కి చైతూ - సమంతలు ఒక్కటి కానున్నారు .

టాలీవుడ్ P 25




 ప్ర ముఖ నాయకులు వి. చిన్న శ్రీశైలం యాదవ్‌, కస్తూరి దంపతుల కుమార్తె వనజ వివాహం ఏప్రియల్‌ 21న మల్లేశ్‌యాదవ్‌, మంగ దంపతుల తనయుడు మహేందర్‌ యాదవ్‌ తో హైదరాబాద్‌ మాదాపూర్‌ ఈమేజ్‌ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, బండారు దత్తాత్రేయ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, మాగంటి బాబు, షబ్బీర్‌ అలీ, ముఖేష్‌ గౌడ్‌, సుమన్‌, సి.కళ్యాణ్‌, బి.గోపాల్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, మా అసోసియేషన్‌అధ్యక్షుడు శివాజీరాజా, మల్కాపురం శివకుమార్‌, కొమరం వెంకటేష్‌, హేమ, వందేమాతరం శ్రీనివాస్‌, సాయిరామ్‌శంకర్‌, బాహుబలి ప్రభాకర్‌, కాదంబరి కిరణ్‌, విమలక్క తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

26 P టాలీవుడ్


 

    ఘా

జి సినిమాని తీసి విమర్శకుల ప్రశంసల తో పాటు ప్రేక్షకుల ఆదరాభిమానాలను కూడా చూరగొంది . ఘాజి సినిమాతో ఆ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి రేంజ్ అమాంతం పెరిగింది . అతడి తదుపరి సినిమా కోసం తీవ్రమైన పోటీ ఏర్పడింది . దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంకల్ప్ రెడ్డి తన తదుపరి సినిమాని ఏ హీరోతో చేస్తున్నాడో తెలుసా ....... వరుణ్ తేజ్ . మిస్టర్ చిత్రంతో ఇటీవలే డిజాస్టర్ ని అందుకున్న వరుణ్ తీవ్ర నిరాశలో ఉన్నాడు . రిగ్గా అదే సమయంలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించే చాన్స్ రావడంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు వరుణ్ . ఘాజి తరహాలోనే వరుణ్ తో చేయబోయే సినిమా కూడా ప్రయోగాత్మక చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడట సంకల్ప్ రెడ్డి . చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతుండటం తో సంకల్ప్ రెడ్డి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు వరుణ్ .

టాలీవుడ్ P 27


హీ

రోగా హోమ్లీ ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ చాలాకాలం తర్వాత మళ్ళీ విలన్ గా మారుతున్నాడు . నటుడిగా వంద సినిమాలను సమయంలోనే శ్రీకాంత్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని పొందాడు . అయితే కెరీర్ ప్రారంభంలో విలన్ గా నటించి మెప్పించిన శ్రీకాంత్ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత విలన్ గా మారిపోయాడు . గతకొంత కాలంగా శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమాలు ప్లాప్ అవుతుండటంతో ఇక హీరోగా కొనసాగడం ఇష్టంలేని శ్రీకాంత్ ఇతర పాత్రలను పోషించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు . దులో భాగంగానే ఇప్పటికే మోహన్ లాల్ చిత్రంలో విలన్ గా నటిస్తున్న శ్రీకాంత్ తాజాగా నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు . విలన్ గా సెకండాఫ్ ని స్టార్ట్ చేసిన శ్రీకాంత్ జగపతి బాబు లా ఆకట్టుకుంటాడా లేదా చూడాలి .

అం





28 P టాలీవుడ్






టసింహం నందమూరి బాలకృష్ణ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ పడనున్నాడు , మరి ఈ పోటీ అంటూ ఒకేసారి జరిగితే బాక్స్ లు బద్దలు కావడం ఖాయం . ఇంతకీ ఈ ఇద్దరూ ఎప్పుడు పోటీ పడుతున్నారు ? ఎక్కడ ? ఏ సినిమా అన్నది కదా మీ డౌట్ ? . ప్రస్తుతం బాలయ్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు . ఆ చిత్రం కోసం భారీ ఎండలను సైతం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు బాలయ్య . ఆ సినిమాని శరవేగంగా పూర్తిచేసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు . క పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కూడా ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్నాడు . త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సారి సినిమా చేస్తున్నాడు పవన్ . ఇక ఈ సినిమాని కూడా త్వరగా పూర్తిచేసి సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు . ఈ రెండు చిత్రాలు కనుక ఒకేసారి రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం .

టాలీవుడ్ P 29


తె



లంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 3 సంవ‌త్స‌రాల‌ వార్షికోత్స‌వం జ‌రుపుకుంటూ నూత‌నంగా క‌మిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవ‌డం జ‌రిగింది ప్రెసిడెంట్ గా ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ ని వైస్ ప్ర‌సిడెంట్ గా జె.వి. ఆర్. గారిని సెక్ర‌టరీ ‌ గా ల‌యన్ ‌ సాయి వెంక‌ట్ గారిని ఎన్నుకోవ‌డం జ‌రిగింది. అలాగే బాడి మెంబ‌ర్స్ గా ఇంకా 23 మందిని ఎక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం జ‌రిగింది. వీరందరి ప్రమాణస్వీకారం ఇటీవల ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. అలాగే తె‍లంగాణ‌ మా మూవి అండ్ టీవి ఆర్టిస్ట్ అసోసీయేష‌న్ కి అధ్య‌క్షురాలిగా సీనియ‌ర్ హీరోయిన్ శ్రీమ‌తి క‌విత‌ గారిని మెంబ‌ర్స్ అంద‌రం క‌లిసి జన‌ర‌ల్ బాడి మీటింగ్ లో ఎక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం జ‌రిగింది సెక్ర‌ట‌రి గా శ్రీ జె.వి.ఆర్.గారిని ఎన్నుకోవ‌డం జ‌రిగింది పూర్తిగా క‌మిటీని త్వ‌ర‌లో నిర్ణ‌యించుకుంటాం త‌రువాత‌ దాదాపు 100 మంది సినీ మ‌రియు టీవి ఆర్టిస్ట్ మ‌రియు టెక్నీషియ‌న్స్ అంద‌రికి ఫ్రీగా 5 లక్ష‌ల‌ వార్త్ గ‌ల‌ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ కి సంబందించిన‌ హెల్త్ కార్డ్స్ ఇవ్వ‌డం జ‌రిగింది ఇంకా ఎవ‌రికైన‌ సినీ మ‌రియు టీవి ఆర్టిస్ట్ మ‌రియు టెక్నీషియ‌న్స్ హెల్త్ కార్డ్స్ అవ‌స‌ర‌మున్న‌ వారు తె‍లంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ లో అప్లై చేసుకుంటే ఫ్రీగా హెల్త్ కార్డ్స్ మేము ఇప్పిస్తాం హెల్త్ కార్డ్ తో పాటు చ‌దువుకునే పిల్ల‌ల‌కు స్కూల్ స్కాల‌ర్షిప్స్ కూడా ఇప్పిస్తాం దీనితో పాటు జ‌న‌ర‌ల్ బాడి మీటింగ్ కూడా ఇక్క‌డ‌ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది స‌భ్యులు కూడా అధిక‌ సంఖ్య‌లో హాజ‌రై వారి మ‌ద్ద‌త్తు తెలిపినందుకు వారికి ద‌న్య‌వాదాలు తెలుపుతున్నాం ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ మాట్లాడుతూ... భ‌విష్య‌త్తులో ఇందులో ఉండే సినిమా మ‌రియు టీవి ఆర్టిస్టులుల‌కు మ‌రియు టెక్నీషియ‌న్స్ కాని రెండు ప‌డ‌క‌ల‌ గదులు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించి ముఖ్య‌మంత్రి గారికి కూడా ఈ ఉత్త‌రం ద్వారా తెలియ‌జేసి ఇండ్లు మంజూరు అయ్యే విదంగా చ‌ర్య‌లు తీసుకుంటాం...

30 P టాలీవుడ్

డి

జిట‌ల్ విధాన‌ దోపిడి వ‌ల్ల‌ చిన్న‌ సినిమాలు ఎక్కువ‌గా షూటింగ్ జ‌రుపుకోవ‌డం లేదు షూటింగ్ జ‌రిగిన‌ సినిమాలు రిలీజ్ కావ‌డం లేదు ఎందుకంటే ఒక‌ సినిమా డిజిట‌ల్ ట్రాన్స్ ఫ‌ర్ కి వారానికి 11వేలు సినిమా థియేట‌ర్ల‌కు 13 వేలు మ‌ల్టీ ప్లెక్స్ థియేట‌ర్ల‌కు తీసుకుంటున్నారు ప్ర‌క్క‌ రాష్ట్రాల‌ల్లో వారానికి ఒక‌ సినిమాకి డిజిట‌ల్ చార్జీలు 2500 ఉన్నాయి ఇక్క‌డ‌ 10 వేల‌ రూపాయ‌లు వారానికి ఎక్కువ‌గా తీసుకుంటున్నారు దీనివ‌ల్ల‌ నెల‌కు 15 కోట్ల‌ రూపాయ‌లు దోచుకుంటున్నారు దీనికి రెండు రాష్ట్రాల‌ల్లో గ‌వ‌ర్న‌మెంట్ ట్యాక్స్ కూడా క‌ట్ట‌ట్లేదు అలాగే వీల్లే రెండు రాష్ట్రాల‌ల్లో సినిమా థియేట‌ర్ల‌ను గుప్ప‌ట్లో పెట్టుకొని ఎక్క‌డ‌ కూడా ప‌ర్సంటేజ్ విధానంలో ఇవ్వ‌కుండా డ‌బల్ ‌ రెంట్ చార్జ్ చేస్తూ వాల్ల‌ సినిమాల‌నే రిలీజ్ చేస్తూ బ‌య‌ట‌ సినిమాలు ఎవ్వ‌రికి థియేట‌ర్లు ఇవ్వ‌కుండా మోనొపొలి వాధానం అవ‌లంబిస్తు దాదాపుగా 250 నుండి 300ల‌ సినిమాలు సెన్సార్ అయి థియేట‌ర్లు దొర‌కకా ‌ రిలీజ్ కాకుండా నిర్మాతలు ‌ ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు కాబ‌ట్టి దీన్ని రెండు రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాల‌ ముఖ్య‌మంత్రులు వీరి మోనోపొలి పోయె విధంగా అల‌గే ప్ర‌క్క‌ రాష్ట్రాల‌లో వారానికి 2500 ఉన్న‌ట్లు మ‌న‌రెండు రాష్ట్రాల‌లో చేయ‌ల‌ని రెండు రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రుల‌ను కోరుతూ తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆద్వ‌ర్యంలో చాంబ‌ర్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ గారు అలాగే మూవి మ‌రియు టీవి ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు శ్రీమ‌తి క‌విత‌ గారు డిమాండ్ చేసారు....ఇంకా ఈ కార్యక్రంలో సీనియర్ నటుడు నర్సింగారాజు,సీనియర్ నటి గీతాంజలి,మిస్ ఆసియ రేష్మి ఠాకూర్,కిషన్,కట్ట రాంబాబు,బులెట్ రవి తో పాటు అధిక సంఖ్యలో సినీ కార్మికులు పాలుగొని విజయవంతం చేసారు.




 క

‌ త‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ కు ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ళా ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు విశ్వ‌నాథ్ గారితో ఉన్న అనుబంధం న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ని కాకుండా కుటంబ ప‌రంగాను మంచి రిలేషన్ ఉంది. ఆయ‌న‌కు ఈ అవార్డు రావ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతికి లోన‌వుతున్నా. అవార్డు రావాల్సిన స‌మ‌యంలో వ‌చ్చిందా? లేదా అన్న దానిపై ఇప్పుడు మాట‌లు అన‌వ‌స‌రం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వ‌రించాల్సింది. కానీ కాస్త ఆల‌స్య‌మైన అవార్డు ఆయ‌న్ను వ‌రించ‌డం సంతోషంగా ఉంది. ఆయ‌న ఎలా ఫీల్ అవుతున్నారో తెలియ‌దు గానీ, మేము మాత్రం చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. ఆయ‌న‌కు అవార్డు రావ‌డం తో ఆ అవార్డుకు నిండుద‌నం వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా శుభాబివంద‌నాలు తెలుపుతున్నా. ఎప్ప‌టికీ ఆయ‌న ఆశీస్సులు కోరే మ‌నిషినే..ఆయ‌న చిరంజీవినే` అని అన్నారు.

టాలీవుడ్ P 31




ర్షవర్ధన్ ప్రొడక్షన్ హౌస్ లో హర్షవర్ధన్ నిర్మాతగా మణి దర్శకత్వం వహించి నటించిన చిత్రం `అమ్మాయి ప్రేమలో పడితే`. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఇటీవల హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్రముఖ నిర్మాత కె.ఎల్‌.దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వడం తో ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్బంగా దర్శకుడు మణి మాట్లాడుతూ నాకు ఇది రెండవ సినిమా.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హర్ష కు ప్రత్యేక కృతఙ్ఞతలు. ఒక జంట ప్రేమలో ఉంటే ఎలా ఉంటారు ప్రేమలో లేకపోతే ఎలా ఉంటారు అనే ట్రూ లవ్ పైన ఈ చిత్ర కాన్సెప్ట్. మంచి కథ మరియు మంచి మ్యూజిక్ తో ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యం తో సినిమాను చేస్తున్నాం. మే లో అరకు ప్రాంతాలల్లో షూటింగ్ ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

32 P టాలీవుడ్

ఈ చిత్రం లో 5 పాటలుంటాయి. తప్పకుండా సంగీతం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం తో ఉన్నానంటూ ఈ చిత్ర సంగీత దర్శకుడు భాను ప్రసాద్ తెలిపారు. ఇక ఈ చిత్ర కెమెరామెన్ ఫణి మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రుడు మణి కు నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా లో విసువల్ పరంగా చాలా అద్భుతంగా తెరకెక్కించాలని అనుకుంటున్నా.. అది ఈ సినిమా కు ప్లస్ అవుతుందని భావిస్తున్నా అని చెప్పారు. ఇంకా ఈ ప్రారంభిత్సవం లో హీరోయిన్ షాను తో పాటు నిర్మాత హర్షవర్ధన్, శ్రీనివాసరెడ్డి లు పాల్గొని అభినందనలు మరియు అభిప్రాయాలను తెలియ చేసారు. చిత్రానికి హీరో మణి, హీరోయిన్ షాను, సంగీతదర్శకుడు భానుప్రసాద్, రైటర్ బండోజి, కెమరామెన్ ఫణి, కారియోగ్రఫర్ సూర్య, నిర్మాతలు హర్షవర్ధన్ మరియు రమేష్ బి. దర్శకుడు మణి.






జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్‌, శ్రీ ప్రైమ్‌స్టార్‌ తిరుమల సినిమాస్‌ పతాకాలపై అర్జున్‌ వాసుదేవ్‌

దర్శకత్వంలో రాజేష్‌చిన్నారి, ప్రతాప్‌దండెం సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'సూర్యాభాయ్‌'. బి.వి. రామకృష్ణ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. ఇప్పటి వరకు 3 షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ని మే 5 నుండి జరుపనున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సందర్భంగా చిత్ర నిర్మాతలు రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం మాట్లాడుతూ..''అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ పవర్‌ఫుల్‌పాత్రలో నటిస్తున్నారు. టైటిల్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో జగపతిబాబు గారి పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పొలిటికల్‌ సెటైరికల్‌బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుంది. సెంటిమెంట్‌, ఎమోషనల్‌, ఫ్యామిలీ డ్రామా అన్ని కమర్షియల్‌ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేక్షకులందరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్‌ వాసుదేవ్‌

తీర్చిదిద్దుతున్నారు. ప్రదీప్‌రావత్‌, షాయాజీషిండే, సుమన్‌, సాయికుమార్‌, డి.ఎస్‌.రావ్‌, అర్చన ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్‌ జగపతిబాబుగారి సరసన నటిస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని లావిష్‌గా తెరకెక్కిస్తున్నాము. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్‌డూపర్‌హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. మే 5 నుండి జరిపే చివరి షెడ్యూల్‌తో షూటింగ్‌మొత్తం పూర్తవుతుంది. జూన్‌లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తిచేసి జూలైలో ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌చేయడానికి ప్లాన్‌చేశాం..''అన్నారు. ప్రముఖ హీరోయిన్‌ జగపతిబాబు సరసన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షాయాజీషిండే, ప్రదీప్‌రావత్‌, సుమన్‌, సాయికుమార్‌, డి.ఎస్‌.రావ్‌, రాజారవీంద్ర, ఉత్తేజ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, దిల్‌ రమేష్‌, అర్చన తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌: బి.వి. రామకృష్ణ, సంగీతం: ఆనంద్‌, ఆర్ట్‌: జె.కె. మూర్తి, ఫైట్స్‌: నందు, పి.ఆర్‌.ఓ. జిల్లా సురేష్‌, నిర్మాతలు: రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం, దర్శకత్వం: అర్జున్‌వాసుదేవ్‌.

టాలీవుడ్ P 33


       

హేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న స్పైడర్ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అది ఇప్పుడు ఆగస్టు కు వాయిదా పడింది . ఆగస్టు 9న స్పైడర్ సినిమా ని రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ముహూర్తం నిర్ణయించారట . ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే . రెండేళ్ల క్రితం మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు ఆగస్టు 7న రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . రిగ్గా మళ్ళీ రెండేళ్ల తర్వాత మహేష్ పుట్టినరోజు న రిలీజ్ అవుతున్న స్పైడర్ కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు . మహేష్ పుట్టినరోజు న స్పైడర్ సినిమా రిలీజ్ అంటే మహేష్ ఫ్యాన్స్ కు ఏకంగా రెండు పండగలు అన్నమాట . తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది .

34 P టాలీవుడ్


 సం

గీత ప్రధాన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి తెలుగుధనాన్ని నలుచెరుగులా వ్యాపింప జేసిన మహనీయుడు, దార్శనికుడు అయిన కళాతపస్వి కే . విశ్వనాధ్ ని అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది . చలన చిత్ర రంగానికి విశ్వనాధ్ చేసిన ఎనలేని కృషి ని గుర్తించిన భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ని ప్రకటించింది . చలన చిత్రరంగం లో మొదట సౌండ్ ఇంజనీర్ గా ప్రస్థానం ప్రారంభించిన కళాతపస్వి ఆ తర్వాత మహానటులు అక్కినేని నాగేశ్వర్ రావు హీరోగా నటించిన '' ఆత్మగౌరవం '' చిత్రంతో దర్శకుడి గా మారాడు . గారాభరణం చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించగా సాగర సంగమం , స్వాతి ముత్యం , స్వయం కృషి ,శృతి లయలు , సూత్రధారులు , స్వర్ణకమలం , సప్తపది , శుభలేఖ ,శుభ సంకల్పం వంటి గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు . దర్శకుడిగా విభిన్న పంథా ని ఎంచుకొని అదే మార్గంలో పయనించి భావితరాలకు తెలుగుదనం అంటే ఏమిటో చాటి చెప్పిన మహనీయుడు విశ్వనాధ్ . అటువంటి గొప్ప దర్శకుడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం యావత్ తెలుగు పరిశ్రమకే గర్వకారణం .

శం





మా

స్టర్ చిత్రంలో నాని పోగొట్టుకున్న సైకిల్ కు బదులుగా కొత్త సైకిల్ కొనిచ్చాడు మెగాస్టార్ చిరంజీవి దాంతో నాని సంతోషానికి అంతేలేకుండా పోయింది . ఇటీవలే చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి గెస్ట్ గా వెళ్ళాడు నాని . అయితే మాటల సందర్భంలో మాస్టర్ సినిమా చూడటానికి కొత్త సైకిల్ పై వెళ్లి ఆ సైకిల్ ని పోగొట్టుకున్నానని , అయితే భలే భలే మగాడివోయ్ సినిమా సమయంలో అల్లు అరవింద్ కి ఈ విషయం చెప్పి కొత్త సైకిల్ ఇవ్వాల్సిందిగా కోరానని ఆయన తప్పకుండా ఇస్తానని మాటిచ్చాడే తప్ప ఇంతవరకు సైకిల్ కొనివ్వలేదని చిరంజీవి కి చెప్పడంతో ఆయనేంటి కొనిచ్చేది నేనే కొనిస్తాను అంటూ హామీ ఇచ్చాడు . ట్ చేస్తే వారం రోజులకే కొత్త సైకిల్ నాని ఇంటికి చేరడంతో నాని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి . అభిమాన హీరో నుండి సైకిల్ ని గిఫ్ట్ గా పొందడం అంటే గొప్పేగా మరి .

టాలీవుడ్ P 35


  ఫి

లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్ చేతుల మీదుగా గాయత్రి ప్రొడక్షన్స్ శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట ఫస్ట్ లుక్ లాంచ్ మోషన్ పోస్టర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది సందర్బంగా సి కళ్యాణ్ మాట్లాడుతూ ..... టైటిల్ మంచి కాన్సెప్ట్ తో వుంది. రావు గారు కర్ణాటక నుంచి వచ్చి మా శేఖర్ తో సినిమా చేస్తుంన్నందుకు హ్యాపీ గా వుంది నరేష్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్ టూ టోటల్ టీం ర్మాత కే ఎన్ రావు మాట్లాడుతూ.. సి కళ్యాణ్ గారు వచ్చినందుకు చాలా థాంక్స్. సినిమా టైటిల్ స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంటుంది. మే లో సినిమా రెలీజ్ చేస్తుంన్నం. గ్రామీణ నేపధ్యం లో సాగె ఎమోషన్ స్టోరి. మ్యూజిక్ చాల బాగా వచ్చింది. అని అన్నారు. రోమాట్లాడుతూ ... సి కళ్యాణ్ గారికి స్పెషల్ థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా అందరికి మంచి పేరు తెస్తుంది.

ఈ ని

హీ

36 P టాలీవుడ్

డై

రెక్టర్ నరేష్ మాట్లాడుతూ .... పిలవగానే వచ్చిన సి కళ్యాణ్ గారికి థాంక్స్ చెబుతున్న. నేను మ్యూజిక్ డైరెక్టర్ ని. చాలా కథలు రాసుకున్న. కానీ చాలా తక్కువ టైం లో సినిమా స్టార్ట్ చేసాం. మా ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ చేసారు. నాకు చాలా మంచి టీం దొరికింది. మా డైరెక్షన్ టీం అందరికీ స్పెషల్ థాంక్స్.ఒక విలేజ్ కి వెళ్లి పది రోజులు గడిపి వస్తే ఎలా ఉంటుందో సినిమా అంత బాగా ఉంటుంది.

నటీ నటులు శేఖర్ వర్మ . దీప్తి శెట్టి.మధుసూదన్. మదిమని గౌతమ్ రాజు గీతాంజలి రామరాజు కెమెరా కూనపరెడ్డి జయకృష్ణ ఎడిటింగ్ సుంకర ఎస్ ఎస్ లిరిక్స్ సాహిత్య సాగర్ . గిరి పట్ల నిర్మాత కేఎన్ రావు నిర్మాణ నిర్వహణ కే.ఆర్ ప్రశాంత్ రచన సంగీతం దర్శకత్వం నరేష్ పెంట




లై

ట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై శివ శంక‌ర రావు కంట‌గ‌మ‌నేని, కె. వెంకటేశ్వ‌ర‌రావు సంయుక్త‌గా నిర్మిస్తున్న `అక్క‌డొకడున్నాడు` చిత్రం ఇటీవల హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ల‌హ‌రి ఎస్టేట్స్ అధినేత హ‌రిబాబు క్లాప్ నివ్వ‌గా, ర‌వీంద‌ర‌రావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత సి. క‌ల్యాణ్ గౌర‌వ ద‌ర్శక‌ ‌త్వం వ‌హించారు. రామ్ కార్తిక్, దీపిక హీరో, హీరోయిన్లగా ‌ న‌టిస్తున్నారు. నంత‌రం పాత్రికేయుల స‌మావేశంలో చిత్ర నిర్మాతల ‌ ‌లో ఒక‌రైన వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ, ` క‌థ కొత్త‌గా ఉంటుంది. క‌థ విన్న‌ప్పుడు చాలా ఎగ్జైట్ గా ఫీల‌య్యా. అందుకే సినిమా నిర్మాణానికి పూనుకున్నా. ప్ర‌తీ పాత్ర ఆద్యంత ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తాం. మిగ‌తా ప‌నులు కూడా పూర్తిచేసి వీలైనంత త్వ‌రగా ‌ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం` అని అన్నారు. రో నిర్మాత శివ‌శంక‌ర‌రావు మాట్లాడుతూ, ` గ‌తంలో కొన్ని సినిమాల్లో న‌టించాను. కానీ మ‌ళ్లీ వ్యాపార రంగంలో బిజీ అవ్వాల్సి వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ అక్క‌డొక‌డున్నాడు సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్నా. ఇందులో ఓ ముఖ్య‌మైన పాత్ర పోషిస్తున్నా. పాత్ర చాలా వైవిథ్యంగా ఉంటుంది. తెలుగు లో ఇప్ప‌టివ‌రకూ ‌ ఇలాంటి కాన్సెప్ట్ తో ఎవ్వ‌రు సినిమా చేయ‌లేదు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను

మ‌

మెప్పించే సినిమా అవుతుంది` అని అన్నారు. త్ర ద‌ర్శకు ‌ డు శ్రీపాడ విశ్వ‌క్ మాట్లాడుతూ, ` పొర‌పాటుకు- త‌ప్పుకు మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ఈ సినిమా. ప్రేమ అంటే అందాన్ని ఆక‌ర్షించ‌డం కాదు. వ్య‌క్తిత్వాన్ని ఆరాధించ‌డం. ఇద్ద‌రు ప్రేమికులు అనుకోకుండా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌కు లోనై స్వ‌చ్ఛ‌మైన ప్రేమ వారిని ఎలా కాపాడుతుంద‌నే పాయింట్ పొర‌పాటుత‌ప్పుగా డివైడ్ చేసి చూపిస్తున్నాం. ప్ర‌తీ పాత్ర‌ల‌ను చ‌క్క‌ని ఎమోష‌న్ ఉంటుంది. ఆ భావోద్వేగాల‌ను క‌న్వెన్సింగ్ గా చెబుతున్నా. టెక్నిక‌ల్ గా ను సినిమా హైలైట్ గా ఉంటుంది. మే 2 నుంచి 20 వ‌ర‌కూ కంటున్యూస్ గా షూటింగ్ చేస్తాం. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది` అని అన్నారు. రో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, ` చ‌క్క‌ని క‌థా, క‌థ‌నాల‌తో సినిమా తెర‌కెక్కుతుంది. మంచి పాత్ర పోషిస్తున్నా. సినిమాను అంద‌రూ ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు. సినిమాలో అవ‌కాశం ప‌ట్ల హీరోయిన్ దీపిక ఆనందం వ్య‌క్తం చేసింది. వ‌హ‌నీష్, భ‌ర‌త్, ఆర్.ఎస్. నాయుడు, రాహుల్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం: రాజా శేఖ‌ర‌న్.ఎన్, సంగీతం: సార్క్స్‌, లైన్ ప్రొడ్యూస‌ర్: ప‌్ర‌కాశ్ కె.కె, స‌హ నిర్మాతలు ‌ : బి.ఎన్. శ్రీధ‌ర్, కె. శ్రీధ‌ర్ రెడ్డి, ర‌చ‌న, ద‌ర్శ‌కత ‌ ్వం శ్రీపాడ విశ్వ‌క్.

చి

హీ

శి

టాలీవుడ్ P 37




 80

వ దశకంలో హీరోయిన్ గా సత్తా చాటిన భామ సుహాసిని . తెలుగు , తమిళ చిత్రాల్లో నటించిన సుహాసిని దర్శకులు మణిరత్నం ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . దర్శకుడిగా అద్భుతమైన సినిమాలను అందించి ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించాడు మణిరత్నం . అయితే ఇప్పుడు దర్శకుడిగా రేసులో వెనకబడినప్పటికీ ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కళాఖండాలు గా నిలిచాయి . మణిరత్నం - సుహాసిని ల వ్యక్తిగత జీవితం పక్కన పెడితే ఆ ఇద్దరికీ ఓ కొడుకు ఉన్నాడు అతడి పేరు నందన్ . దన్ సినిమాలపై ఆసక్తి చూపించకుండా హాయిగా ఉన్నత చదువులు చదువుకున్నాడు రేపో మాపో డాక్టరేట్ కూడా అందుకో బోతున్నాడు అయితే అతడికి ఇప్పుడు సినిమాలపై గాలి మళ్లిందట . త్వరలోనే హీరోగా తెరంగేట్రం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని చెన్నై లో గుసగుసలు మొదలయ్యాయి . సినిమా రంగం వారసుల రాజ్యం కాబట్టి ఈ వారసుడు కూడా తెరంగేట్రం చేయడం ఖాయమనే అంటున్నారు .

నం 38 P టాలీవుడ్




 126.18M అం

కుశం, అగ్ర‌హం, మ‌గాడు వంటి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన డా.రాజ‌శేఖ‌ర్ ట‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ స‌మ‌ర్ప‌ణలో ‌ తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ చిత్రం``పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M``. పూజా కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. రీసెంట్‌గా శృంగార తార స‌న్నిలియోన్‌పై చిత్రీక‌రించిన స్పెష‌ల్ సాంగ్ పూర్త‌వ‌డంతో ఈ చిత్రం ఏడు రోజులు మిన‌హా షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు ‌ స‌న్నాహాలు చేస్తున్నారు. ద‌మామ క‌థ‌లు, గుంటూరుటాకీస్ వంటి విల‌క్షణ ‌ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శకు ‌ డు ప్ర‌వీణ్ స‌త్తారు రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం ముంబై ఫిలింసిటీ లో భారీ సెట్ వేసి స‌న్నిలియోన్‌పై స్పెష‌ల్

చం

సాంగ్‌ను చిత్రీక‌రించారు. గందిబాత్‌...`, `రాం చాహే లీల చాహే...` వంటి బాలీవుడ్ సూప‌ర్హి ‌ ట్స్‌కు కొరియోగ్ర‌ఫీ అందించిన విష్ణుదేవా నేతృత్వంలో 50 డ్యాన్స‌ర్స్‌తో మూడు రోజుల పాటు సాంగ్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రిపారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు, యాంగ్రీ యంగ్ మేన్ రాజ‌శేఖ‌ర్‌ను స‌రికొత్త లుక్‌లో ప్రెజంట్ చేస్తున్నారు. అల్రెడి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్‌ను నుండి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. క్రేజీ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రం మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ చేయ‌డం గ‌రుడ వేగ‌పై అంచ‌నాల‌ను ఇంకా పెంచుతుంది. .రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, అరుణ్ అదిత్‌, కిషోర్‌, ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్ దీప్‌, నాజర్ , షాయాజీ షిండే, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః శ్రీకాంత్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, మ్యూజిక్ః శ్రీచ‌రణ్ ‌ ‌, బ్యానర్: జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్, నిర్మాతః కోటేశ్వ‌ర‌రాజు, ద‌ర్శ‌కత ‌ ్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.

డా


Tollywood Magazine Telugu May - 2017  

Tollywood Magazine Telugu May - 2017