Page 1

AUGUST 2017 VOL 14 ISSUE 8

RNI NO: APTEL/2003/10076

/tollywood /tollywood

TOLLYWOOD.NET

p     

 



Megha

Akash


“THE BEST AND MOST BEAUTIFUL THINGS IN THE WORLD CANNOT BE SEEN OR EVEN TOUCHED - THEY MUST BE FELT WITH THE HEART.” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By

: : : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 AUGUST 2017

టాలీవుడ్ P 3


 వీ



డుతేడా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్". నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాతో నటుడు చిన్ని కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత సుధీర్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిఖిల్ హీరోగా నిర్మించిన స్వామి రారా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ కు, నిర్మాతగా చక్రి చిగురు పాటికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా ఎ.ఎన్.బోస్ దర్శకుడిగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని నిర్మించారు. ఇలా వరుసగా మూడు చిత్రాలకు ముగ్గురు కొత్త దర్శకుల్ని తెలుగు తెరకు పరిచయం చేసింది "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్". కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో తాము రెడీగా ఉంటామని ఈ మూడు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు. క ఇప్పుడు…. సూపర్ ఫాంలో దూసుకెళ్తున్న సందీప్ కిషన్ హీరోగా కేరాఫ్ సూర్య పేరుతో ద్వి భాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా.. ఎమోషనల్ స్టోరీస్ ని అద్భుతంగా తీయగలడన్న పేరున్న సుశీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. అందాల భామ మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు… శ్రీరస్తు శుభమస్తుతో సూపర్ హిట్ అందుకున్న అల్లు వారి వారసుడు అల్లు శిరీష్ హీరోగా, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో ఇంటెల్లిజెంట్ సూపర్ హిట్ చిత్రం అందించిన వి.ఐ.ఆనంద్ దర్శకుడిగా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్లో 5వ చిత్రంగా చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఇందులో గ్లామర్ డాల్స్ సురభి, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు

4 P టాలీవుడ్

చిత్రాలపై నిర్మాత చక్రి చిగురుపాటి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఘన విజయం సాధించే రెండు చిత్రాల్ని బ్యాక్ టూ బ్యాక్ నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందంటున్నారు నిర్మాత చక్రి. దిలా ఉంటే… త్వరలోనే టాలీవుడ్ టాప్ క్రెజీ హీరోలతో, స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తదితర హీరోలతో, దర్శకులతో కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని నిర్మాత చెబుతున్నారు. సందర్భంగా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" అధినేత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ…. వీడు తేడా, స్వామి రారా, మోసగాళ్లకు మోసగాడు వంటి విభిన్న చిత్రాలతో "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ కు మంచి పేరు తీసుకొచ్చిన ప్రేక్షకులకు చాలా థాంక్స్. ఇదే ప్రోత్సాహంతో సందీప్ కిషన్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా సుశీంద్రన్ దర్శకత్వంలో కెరాఫ్ సూర్య అనే ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్ర షూటింగ్ చాలా బాగా జరుగుతుంది. దీంతో పాటు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా సురభి, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా మరో చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ రెండు సినిమాలు మా బ్యానర్ వాల్యూను మరింత పెంచుతాయనే ధీమాగా ఉన్నాం. త్వరలోనే మా బ్యానర్లో మరిన్ని మంచి చిత్రాలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం క్రేజీ హీరోలు, దర్శకులతో కథా చర్చలు జరుపుతున్నాం. మరి కొద్ది రోజుల్లోనే ఆ చిత్రాలకు సంబంధించిన వివరాల్ని అధికారికంగా తెలియజేస్తాం. ఇప్పటివరకు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ కు తగిన గుర్తింపును తెచ్చిన ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అని అన్నారు.






'సం

తోషం` వార్షికోత్స‌వాలు..`సంతోషం` సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ అవార్డుల వేడుక ప్ర‌తీ ఏడాది ఘ‌నంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. కాగా 15 సంవ‌త్స‌రాల దిగ్విజ‌యంగా పూర్తిచేసుకుని 16వ ప్రాయంలోకి సంతోషం అడుగుపెట్టేసింది. ఈ నెల 12న (ఆగ‌స్టు) హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అంగ‌రంగ వైభ‌వంగా సంతోషం అవార్డు వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డానికి ముహూర్తం కూడా కుదిర్చారు. దానికి సంబంధించిన క‌ర్టైన్ రైజ‌ర్ ఫంక్ష‌న్ ఇటీవల హైద‌రాబాద్ ఎఫ్ ఎన్ సీసీ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లో తార‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జరిగింది. ` అధ్య‌క్షులు శివాజీ రాజా మాట్లాడుతూ, ` ప్ర‌తీ ఏడాది సంతోషం అవార్స్డ్ ఎంత గ్రాండ్ గా జ‌రుగుతున్నాయో తెలిసిందే. సంతోషం అవార్స్డ్ అంటే తెలుగు సినిమా ఇండ‌స్ర్టీ అంతా కదిలి వ‌స్తుందంటే కార‌ణం సురేష్ గారి చిరునవ్వే. దిగ్విజ‌యంగా 15 ఏళ్లు పూర్తిచేసుకుని ఇప్పుడు సంతోషం 16 ఏళ్ల టీనేజ్ వ‌య‌సులోకి అడుగు పెట్టేసింది. హీరో ఆది మాట్లాడుతూ, ` నా చిన్న‌ప్పుడు మా నాన్న‌గారు సంతోషం అవార్డుతో ఇంటికొచ్చిన‌ప్పుడు ఇలాంటి అవార్డు ఎప్ప‌టికైనా అందుకోవాల‌నే ఓ డ్రీమ్ ఉండేది. ఆ క‌ల ప్రేమ‌కావాలి సినిమాతో తీరింది. 15 ఏళ్లు పూర్తిచేసుకుని 16వ సంవ‌త్స‌రంలోకి సంతోషం అడుగు పెట్ట‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుల వేడుక మ‌రిన్ని సంవ‌త్స‌రాలు పాటు కొనసాగాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

`మా

హీ

రోయిన్ రెజీనా మాట్లాడుతూ, ` సురేష్ గారు ఎప్పుడు న‌న్ను క‌లిసినా సంతోషం అవార్డుల గురించే మాట్లాడుతారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న‌కు అవార్డుల ప‌ట్ల ఉన్న ఫ్యాష‌న్ ఎలాంటిదో అర్ధ‌మైంది. ఇన్నేళ్ల పాటు అవార్డు వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం అంటే చిన్న విష‌యంకాదు. ఎంతో క‌మిట్ మెంట్..డెడికేష‌న్ ఉండాలి. అవ‌న్నీ సురేష్ గారిలో ఉన్నాయి. 25 ఏళ్ల పాటు అవార్డు వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు. తోషం` అధినేత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` గ‌త 15 ఏళ్ల నుంచి అంగ‌రంగ వైభ‌వంగా సంతోషం వార్షికోత్స‌వాల‌ను.. అవార్డు వేడుక‌ల‌ను జరుపుతున్నా. ప్ర‌తీ ఏడాది నా ప్రొగ్రాం స‌క్సెస్ అవుతుందంటే కార‌ణం తెలుగు సినిమా ఇండ‌స్ర్టీనే. అసలు అవార్డ‌లు కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డానికి కార‌ణం హీరో నాగార్జున గారు. సంతోషం మ్యాగ‌జైన్ ఓపెనింగ్ రోజ అవార్డులు కూడా ప్ర‌ధానం చేస్తే బాగుంటుంద‌ని ఆయ‌న స‌లహా ‌ ఇవ్వ‌డంతో ఇదంతా చేయ‌గ‌లిగాను. త‌ర్వాత‌ చిరంజీవి గారు, బాల‌కృష్ణ గారు, వెంక‌టేష్ గారు న‌న్ను ఎంత‌గానో ప్రోత్స‌హించారు. తెర ముందు..తెర వెనుక ఉండి ప్రోత్స‌హిస్తున్న వారంద‌రికీ ఎప్ప‌టికీ రుణ‌ప‌డే ఉంటాను. ఆగ‌స్టు 12 న అత్యంత వైభవంగా వేడుక‌లు నిర్వ‌హిస్తున్నాం` అని అన్నారు. రోయిన్ హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ, ` గ‌త ఏడాది సంతోషం వేడుక‌ల్లో లైవ్ పెర్పామెన్స్ ఇచ్చాను. ఇంత‌టి గొప్ప వేడుక‌ల్లో నేను భాగ‌మ‌వ్వ‌డం సంతోషంగా ఉంది. ఈ ఏడాది వేడుక‌లు చాలా స్పెష‌ల్ గా ఉంటాయి`

`సం

హీ

టాలీవుడ్ P 5


 తె

6 P టాలీవుడ్

లుగు ఫిలిం ఛాంబర్ లో జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో (2017) స్వతంత్ర అభ్యర్థిగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా గెలిచారు . అలాగే ప్రొడ్యూసర్స్ సెక్టార్ మెంబర్గా ఎన్నికైనారు ఆర్.కే గౌడ్ . ఈసందర్బంగా ప్రొడ్యూసర్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపారు . తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన జెమినీ కిరణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు . ప్రత్యేక విషయం ఏంటి అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికైన సందర్బంగా ఆర్.కే గౌడ్ ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనా చారీ అభినందిస్తూ ఆర్. కే గౌడ్ ను సన్మానించారు




సూ

పర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌యాక్షన్‌ఎంటర్‌టైనర్‌'స్పైడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం తమిళ రైట్స్‌ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌సొంతం చేసుకుంది. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌డైరెక్టర్‌శంకర్‌కాంబినేషన్‌లో 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రోబో చిత్రానికి సీక్వెల్‌గా '2.0' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మహేష్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'స్పైడర్‌' చిత్రంపై అన్ని చోట్ల భారీ అంచనాలు వున్నాయి. దాన్ని దృష్టిలో వుంచుకొని లైకా ప్రొడక్షన్స్‌సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌ఇచ్చి 'స్పైడర్‌' తమిళ రైట్స్‌ని దక్కించుకుంది.

 

సందర్భంగా లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం మాట్లాడుతూ - ''స్పైడర్‌' చిత్రంపై ఎంతటి భారీ అంచనాలు వున్నాయో మాకు తెలుసు. మహేష్‌, మురుగదాస్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ్‌లో విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. 'స్పైడర్‌' మా సంస్థలో మరో సూపర్‌హిట్‌మూవీ అవుతుంది'' అన్నారు. పర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌. జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌శివన్‌ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌. వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

సూ

టాలీవుడ్ P 7


చిం

తకింది భారతి సమర్పణలో త్రిరాస్‌ ప్రనామ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ పత్తి, లావణ్య హీరో హీరోయిన్లుగా శ్రీరామ్‌స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నిన్ను చూడగానే'. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్లో జరిగింది. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ఆఫ్‌అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ఆడియోని విడుదల చేశారు. సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ మాట్లాడుతూ..ఇదొక వెరైటీ లవ్‌స్టోరీ. మ్యూజిక్‌కి మంచి స్కోప్‌ ఉన్న చిత్రమిది. రాజ్‌కిరణ్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. వరగంటె రాజు ఈ చిత్రానికి అద్భుతమైన కథను అందించారు. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీతో, మంచి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం ద్వారా రాజేష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాము. ఆడియోని విడుదల చేసిన రామకృష్ణ గౌడ్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము...అని అన్నారు. జేష్‌పత్తి, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఎన్‌. రమేష్‌, ఎడిటింగ్‌: లోకేష్‌ కుమార్‌ కడలి, సహనిర్మాత: గడ్డం మల్లారెడ్డి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీరామ్‌అమృతపురి.

రా 8 P టాలీవుడ్






డై

నమిక్‌ స్టార్‌ నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్,‌ కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ బ్యానర్స్‌పై మ‌హేష్ కొనేరు స‌మ‌ర్ప‌ణ‌లో జ‌యేంద్ర దర్శ‌కత ‌ ్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్‌కుమార్ వ‌ట్టికూటి నిర్మాతలు ‌ గా కొత్త చిత్రం ఇటీవల హైదరాబాద్‌రామానాయుడు స్టూడియోలో లాంఛ‌నంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. తొలి సన్నివేశానికి ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, క్రిష్‌ గౌరవ దర్శకత్వం వహించారు. హరికృష్ణ స్క్రిప్ను ట్‌ డైరెక్టర్కు ‌ అందించారు. అనంతంర జరిగిన పాత్రికేయుల సమావేశంలో... దమూరి కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ ''మహేష్‌ కొనేరు నా కుటుంబ సభ్యుడితో సమానం. తనతో గత రెండేళ్లుగా కలిసి ప్రయాణిస్తున్నాం. ఈ సినిమా నేను చేయడానికి కారణాల్లో తను ఒకడు. ఇక సినిమా విషయానికి వస్తే, గత 13 సంవత్సరాలుగా డిఫరెంట్‌ సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఎంత డిఫరెంట్‌ సినిమా చేసినా అందులో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే ఉన్నాయి. కానీ తొలిసారి జయేంద్రగారి స్క్రిప్ట్‌ విన్న తర్వాత కొత్తగా అనిపించింది. మంచి రొమాంటిక్‌ కామెడి సినిమాలో చేయాలని చాలా రోజులుగా కోరిక ఉండేది. ఈ సినిమాతో కోరిక తీరనుంది. పి.సి. శ్రీరాంగారితో కలిసి పనిచేయడం గౌరవంగా ఉంది. అందరికీ కొత్త కల్యాణ్‌రామ్‌ కనపడతాడని భావిస్తున్నాను. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. అందరినీ అలరించే ఎంటర్‌టైనర్‌ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు. త్ర స‌మ‌ర్ప‌కుడు మహేష్‌ కొనేరు మాట్లాడుతూ ''నేను కూడా జర్నలిస్ట్‌నే. పాత్రికేయులతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగు

నం

చి

పెట్టాను. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.1 ఇది. నిర్మాతగా ఇంకా మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నాను. కల్యాణ్‌రామ్‌గారిని కొత్తగా, ఫ్రెష్‌గా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంతో ప్రజెంట్‌ చేసే అవకాశం రావడం హ్యాపీ. అవకాశం ఇచ్చినందుకు కల్యాణ్‌రామ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఏర్కాడ్‌లో స్టార్ట్‌ అవుతుంది. ఆగస్ట్‌ 5 నుండి 7 వరకు అక్కడే షూటింగ్‌ చేస్తాం. తర్వాత ఆగస్ట్‌ 15 నుండి సెప్టెంబర్‌ చివరి వారం వరకు సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. ర్మాత విజయ్‌కుమార్‌ వట్టికూటి మాట్లాడుతూ ''సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న వ్యక్తులందరూ ఓ టీమ్‌గా ఏర్పడి చేస్తున్న సినిమా ఇది. కల్యాణ్‌గారి పాజిటివ్‌ ఎనర్జీతో అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది. శరత్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందిస్తారని భావిస్తున్నాం. సుభాగారు అద్భుతమైన స్క్రిప్ను ట్‌ అందించారు. జయేంద్రగారి విజన్‌ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేపు స్క్రీన్‌పై చూస్తారు. పి.సి.శ్రీరామ్‌ వంటి గొప్ప టెక్నిషియన్‌తో వర్క్‌ చేయడం గౌరవంగా భావిస్తున్నాం'' అన్నారు. ర్శకుడు జయేంద్ర మాట్లాడుతూ ''కల్యాణ్‌రామ్‌గారితో రొమాంటిక్‌ మూవీ చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. కల్యాణ్‌రామ్‌గారు సరికొత్త మేకోవర్‌లో కనపడతారు. ఆయనతో పనిచేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఐశ్వర్యలక్ష్మిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌తో జర్నీ చేయడం హ్యాపీగా ఉంది'' అన్నారు.

ని

టాలీవుడ్ P 9


విలన్స్‌కు 101 ఫీవర్‌... ఫ్యాన్స్‌కు బంపర్‌ఆఫర్‌... స్టంపర్‌ఈజ్‌సింప్లీ సూపర్‌... సోషల్‌మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే డిస్కషన్‌.

ట సింహం వేట ఎలా ఉండబోతుందనేది దర్శకుడు పూరి జగన్నాథ్‌ ‘స్టంపర్‌’ అనే చిన్న శాంపిల్ తో చూపించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘పైసా వసూల్‌’. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. అభిమానులయితే ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఈ సంతోషంలో వారికి ఇంకో శుభవార్త. ‘పైసా వసూల్‌’ను సెప్టెంబర్‌ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత వి. ఆనందప్రసాద్‌ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ, డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించిన పాటల్ని అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ– ‘‘నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణగారు ఫుల్‌ ఎనర్జిటిక్‌ పాత్రలో ఇరగదీసి నటించారు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఆయన

డూప్‌ లేకుండా చేశారు. ఇప్పటివరకు ఆయన్ను చూడని విధంగా, ఓ కొత్త పాత్రలో ఇందులో చూస్తారు. తొలిసారి బాలకృష్ణగారితో పని చేస్తున్నందుకు గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. మా నిర్మాత ఆనందప్రసాద్‌గారు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమా బాగా రావడానికి కృషి చేశారు’’ అన్నారు. ర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఇటీవల విడుదలైన ‘పైసా వసూల్‌’ స్టంపర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. ‘తమ్ముడూ... నేను జంగిల్‌ బుక్‌ సినిమా చూడలె . కాని అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి’, ‘మందేసిన మదపుటేనుగునిరా! క్రష్‌ ఎవ్రీవన్‌’ డైలాగులు అభిమానులను అలరిస్తున్నాయి. సినిమా కూడా ఇదే రేంజ్‌లో ఉంటుంది. సెప్టెంబర్‌ 1న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలకృష్ణగారి ఇమేజ్‌కి, కథకు తగ్గ పాటలను అందించారు అనూప్ రూబెన్స్ . త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. య, ముస్కాన్, కైరా దత్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌–హాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. ఇంకా అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్‌ జిత్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: అనూప్‌రూబెన్స్‌.

ని

శ్రి



10 P టాలీవుడ్




వర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో '' జల్సా '' , '' అత్తారింటికి దారేది '' చిత్రాలు రాగా ఆ రెండు చిత్రాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి . ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా రూపొందుతోంది తాజాగా . కాగా ఈ చిత్రానికి అప్పుడే విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . తెలుగు లోనే కాకుండా తమిళ , హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు ఈ చిత్రాన్ని . సినిమా శాటిలైట్ హక్కుల కోసం పలు చానళ్ళు పోటీ పడగా జెమిని టివి 21 కోట్లు చెల్లించడానికి ముందుకు రావడంతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది . అలాగే హిందీ హక్కుల కోసం కూడా 11 కోట్లు పలకడం మరింత సంచలనం సృష్టిస్తోంది . మొత్తంగా రెండు భాషలలో శాటిలైట్ రూపం లో 32 కోట్లు వసూల్ అవుతుండటం తో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది .

టాలీవుడ్ P 11




రై

టర్ లు డైరెక్టర్ లుగా మారడం కొత్తేమి కాదు , ఇప్పటికే పలువురు రైటర్ లు దర్శకులు గా మారి సత్తా చాటారు , అయితే కొంతమంది మాత్రం చతికిల బడ్డారు . తాజాగా రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారుతున్నాడు . బృందావనమది అందరిదీ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . అయితే ఈ శ్రీధర్ సీపాన ఇపుడు కాదు లౌక్యం హిట్ అయిన తర్వాతే దర్శకుడిగా మారాల్సి ఉంది ఎందుకంటే లౌక్యం వంటి సూపర్ హిట్ చిత్రానికి కథ అందించడంతో డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని అప్పటోలోనే ఆ చిత్ర నిర్మాత చెప్పాడు . నీ లౌక్యం తర్వాత తీసిన సౌఖ్యం ఘోర పరాజయం పొందడంతో మున్నకుండి పోయారు . కట్ చేస్తే ఇప్పుడు వేరే నిర్మాతలు శ్రీధర్ సీపాన కు దర్శకుడిగా ఛాన్స్ ఇస్తున్నారు . మరి ఈ సినిమాతో సక్సెస్ కొట్టి దర్శకుడిగా నిలబడతాడా ? లేదంటే ఉన్న అవకాశాలను కూడా తగ్గించుకుంటాడా చూడాలి .

కా







త ఏడాది జూలై 29న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది పెళ్లి చూపులు చిత్రం . అప్పుడే ఏడాది గిర్రున తిరిగిపోయింది . విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు . రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది . చిన్న చిత్రంగా వచ్చిన పెళ్లి చూపులు భారీ విజయం సాధించి భారీ వసూళ్ళ ని సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో అవార్డు ని సైతం అందుకుంది . ళ్లి చూపులు సంచలన విజయంతో దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ ఒక్కసారిగా హాట్ కేక్ అయిపోయాడు . దాంతో అతడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు . ప్రస్తతం సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే తన రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు దాస్యం తరుణ్ భాస్కర్ .

పె 12 P టాలీవుడ్


 ప్ర

భాస్ - రాజమౌళి ల కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయి సంచలనాలను నమోదు చేసిన విషయం తెలిసిందే . అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం మళ్ళీ ప్రభాస్ - రాజమౌళి ల కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తున్నది . అయితే ఈసారి వచ్చే సినిమా కమర్షియల్ సినిమా నే నట . హుబలి లాంటి చిత్రం కాకుండా మాస్ ప్రేక్షకులను అలరించే కమర్షియల్ సినిమా చేయాలనీ బాహుబలి 2 షూటింగ్ సమయంలోనే అనుకున్నారట ప్రభాస్ - జక్కన్న లు . ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సంచలనాలను సృష్టించాయి ఇక నాలుగో సినిమా వస్తే మరో ప్రభంజనం ఖాయం . అయితే ఈ సినిమా ఇంకో ఏడాది లేదంటే రెండేళ్లు పట్టొచ్చు .

బా

టాలీవుడ్ P 13


 తె

లంగాణ ప్రభుత్వం డ్రగ్స్ విషయాన్నీ సీరియస్ గా తీసుకోవడంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ కు తరలి పోవడం ఖాయమని అంటున్నారు కొంతమంది . అయితే 30 వేలకు పైగా ఉన్న ఈ సినిమా రంగంలో కేవలం 12 మందికి నోటీసులు ఇచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రభుత్వం కక్ష్య కట్టినట్లు కాదని , ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి ఎక్కడికి పోదని కూడా మరో వాదన వస్తోంది . యితే ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి వెళ్లిపోవడం జరగదు కానీ అదే సమయంలో వైజాగ్ లో ఉభయ గోదావరి జిల్లాలలో కొంతవరకు అభివృద్ధి జరగడం ఖాయమని అంటున్నారు . పైగా ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయ్యింది కాబట్టి ఎక్కడైనా షూటింగ్ చేసుకోవచ్చు అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేసుకోవచ్చు , ఆ సౌలభ్యం ఉంది కానీ సినిమా రంగం పెద్దలు మాత్రం ఇక్కడే ఉంటారు పైగా అనువైన వాతావరణం కూడా హైదరాబాద్ సొంతం కాబట్టి ఇండస్ట్రీ ఇక్కడి నుండి వెళ్లిపోయే ప్రసక్తే లేదు అని కూడా అంటున్నారు . మొత్తానికి డ్రగ్స్ వ్యవహారం వల్ల ఇలాంటి టాపిక్స్ వస్తున్నాయి అదీ విషయం .

అ ఈ

మధ్య పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు కూడా వ్యూస్ వస్తున్నాయి అంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు నటీనటులు . అయితే అవన్నీ కూడా బోగస్ లెక్కలే . ఇలా టీజర్ రిలీజ్ అయ్యిందో లేదో వన్ మిలియన్ , 2 మిలియన్ , 3 మిలియన్ అంటూ దంచేస్తున్నారు అలాగే ట్రైలర్ ఇలా రిలీజ్ అవ్వడమే ఆలస్యం దాన్ని కూడా దొంగ లెక్కలు చూపిస్తూ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు . క సినిమా వాళ్లకు క్లిక్స్ పిచ్చి పట్టుకుంది కాబట్టి వాళ్ళ మాయలో పడుతున్నారు . డబ్బులు ఎరగా వేసి దొంగ క్లిక్స్ తో మా సినిమా టీజర్ కి ఇన్ని క్లిక్స్ వచ్చాయి , ఇన్ని వ్యూస్ వచ్చాయి అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు . అయితే డబ్బులు పెట్టి కొనేది కొంతమందికి మాత్రమే తెలుసు కాబట్టి ఎవరు పట్టించుకుంటారు లే అనే ధీమాతో ఇలా చేస్తున్నారు .

14 P టాలీవుడ్






       తె



లుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్వయంగా పిలుపు ఇచ్చినప్పటికీ డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ కి సినీ పరిశ్రమ నుండి పెద్దగా ఎవరూ రాకపోవడం సంచలనం సృష్టించింది . ఇటీవల డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రిటీ లు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . దాంతో డ్రగ్స్ తీసుకోకండి , జీవితాలను నాశనం చేసుకోకండి అంటూ సందేశం ఇద్దామనుకున్నారు సినిమా రంగం వాళ్ళు అందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకు వచ్చి హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో ఈ కార్యక్రమం చేపట్టారు . యితే ఈ కార్యక్రమానికి డాక్టర్ రాజశేఖర్ , జీవిత , శివాజీ , నరేష్ తదితరులు మినహా పెద్దగా చిత్ర పరిశ్రమ నుండి ఎవరూ రాలేదు .

 అ



గో

పీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నంద ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే . భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓవర్ సీస్ లో మిశ్రమ స్పందన వస్తోంది . మొదటి రోజు వసూళ్లు నాసిరకంగా ఉండటంతో అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు షాక్ అవుతున్నారు . గోపీచంద్ డబుల్ యాక్షన్ కూడా ఆ సినిమాని కాపాడలేక పోయింది , నాసిరకమైన కథ తో ఓవర్ సీస్ ప్రేక్షకులకు పెద్దగా కిక్ ఎక్కడం లేదు . తో ఈ గౌతమ్ నంద కు అక్కడ పరాజయం తప్పదు అని అంటున్నారు . వేసిందే 59 స్క్రీన్ లు , వాటిలో కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు . అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం కొంత వరకు బెటర్ గానే ఉంది ఓవర్ సీస్ తో పోల్చితే . మొత్తానికి గోపీచంద్ ఆశలు ఆవిరి అయ్యాయి ఓవర్ సీస్ లో సత్తా చాటాలని చేసిన చేసిన ప్రయత్నం విఫలం కావడంతో .

దాం

టాలీవుడ్ P 15


హీ

రో మంచు విష్ణు కి యక్షడెంట్ జరిగింది , ఈ యాక్సిడెంట్ లో మంచు విష్ణు కి గాయాలు అయ్యాయి అయితే ఆ గాయాలు తీవ్రమైనవి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . ప్రస్తుతం మలేషియా లోని ఓ ఆస్పత్రి లో ఐ సి యు లో చికిత్స పొందుతున్నాడు మంచు విష్ణు . బైక్ రేస్ సీన్ షూట్ చేస్తుండగా బైక్ స్కిడ్ అయి మంచు విష్ణు కింద పడిపోయాడు దాంతో గాయాలు అయ్యాయి . ర్శకులు జి . నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నటిస్తున్న చిత్రం '' ఆచారి అమెరికా యాత్ర ''. మంచు విష్ణు , బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కోసం మలేషియా వెళ్లారు అక్కడ ఈ సంఘటన జరగడంతో యూనిట్ సిబ్బంది కంగారు పడ్డారు . ఇక మంచు విష్ణు కు యాక్సిడెంట్ జరిగింది అని తెలియగానే మంచు మోహన్ బాబు కుటుంబం ఆందోళన కు గురయ్యింది .



16 P టాలీవుడ్




గో

దాశ్రీ క్రియేషన్స్ పతాకంపై నిమ్మని ప్రశాంత్ ఐన్ త్రిల్లా చక్రవర్తి జంటగా వాన మావలై కృష్ణదేవ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '' శ్రీకరం శుభకరం నారాయణీయం ''. ఈ చిత్ర లోగో లాంచ్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో జరిగింది . లోగో లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా విచ్చేసిన నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ , బెక్కెం వేణుగోపాల్ లు లోగో ని ఆవిష్కరించి దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు అందజేశారు .

 

సందర్బంగా దర్శక నిర్మాత వాన మావలై కృష్ణదేవ్ మాట్లాడుతూ " వరంగల్ లో నృత్యాన్ని బోధిస్తున్న నేను తొలిసారిగా ఈ శ్రీకరం శుభకరం నారాయణీయం చిత్రంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నాను . పాశ్చాత్య సంస్కృతి మోజులో పడిపోతూ , భారతీయ సనాతన ధర్మాన్ని మర్చిపోతున్న యువతరానికి కనువిప్పు కలిగేలా ఈ చిత్రాన్ని రూపొందించామని , తప్పకుండా ఆదరణ పొందుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు . తారక రామారావు సంగీతం అందించిన ఈ చిత్రానికి రాంప్రసాద్ ఛాయాగ్రహణం అందించగా పసునూరి రమేష్ సహా దర్శకత్వం వహించాడు .

డ్ర

గ్స్ కేసులో పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేసాడు . డ్రగ్స్ కేసులో విచారణ చేసే హక్కు పోలీసులకు ఉంది , మీరు నిజాయితీ పరులైతే భయమెందుకు విచారణ అనంతరం మీపై ఎటువంటి ఆరోపణలు నిజం కాకపోతే కడిగిన ముత్యం లా వస్తారు దాని వల్ల మీ పరువుకు కలిగిన ఇబ్బంది ఏంటి ? అంటూ పరోక్షంగా విచారణ ఎదుర్కొంటున్న వాళ్లపై నిప్పులు కక్కాడు పోసాని . టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినిమా వాళ్ళ ని టార్గెట్ చేసారని చెప్పడం కరెక్ట్ కాదని , ముప్పై వేల మందికి పైగా ఉన్న ఈ సినిమా రంగంలో కేవలం 12 మందికి మాత్రమే నోటీసులు ఇచ్చారని దానివల్ల సినిమా పరిశ్రమ మొత్తం ని టార్గెట్ చేసారని అనడం సబబు కాదని అంటున్నాడు పోసాని . నా మీద ఆరోపణలు వస్తే మాత్రం నా భార్యా పిల్లలను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ

ఎదుర్కొంటానని మన భారత రాజ్యాంగం పోలీసులకు ఆ హక్కు ని కల్పించిందని కూడా వాదిస్తున్నాడు పోసాని . మొత్తానికి డ్రగ్స్ వాడకం ఇండస్ట్రీ లో కొంతమందికి ఉందని చెప్పేసాడు పోసాని .

టాలీవుడ్ P 17




 యం

గ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకి అనూహ్య స్థాయిలో టి ఆర్ పి రేటింగ్ రావడంతో కింగ్ నాగార్జున ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు అందజేయడమే కాకుండా ఎన్టీఆర్ ని పొగడ్తల వర్షంలో ముంచెత్తాడు . దాంతో ఎన్టీఆర్ కూడా ఇది మీరు చూపిన బాటే బాబాయ్ అంటూ రిప్లయ్ ఇచ్చాడు . నాగార్జున మొదట మాటివి లో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే . కార్యక్రమం మంచి హిట్ అయ్యింది , ఇక తాజాగా ఎన్టీఆర్ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు . అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్న శని , ఆదివారాలలో మాత్రం మంచి రేటింగ్ వస్తోంది కానీ మిగతా రోజుల్లో మాత్రం జనాలు అంతగా చూడటం లేదు . పూణే లో ఒకవైపు జై లవకుశ షూటింగ్ చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్ .

ఆ 18 P టాలీవుడ్


   TFJA       




 దం

గల్ చిత్రంలో అమీర్ ఖాన్ కూతురు గా నటించి ప్రేక్షకుల నుండి మెప్పు పొందిన భామ ''ఫాతిమా '' . దంగల్ లో పద్దతిగా కనిపించిన ఈ భామ తాజాగా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లని పిచ్చెక్కిస్తోంది . ఇప్పటికే ఓసారి చేసిన ఫోటో షూట్ తో పెద్ద ఎత్తున ముస్లిం వర్గాలు ఫాతిమా పై ఆగ్రహం వ్యక్తం చేసారు . అయినప్పటికీ ఈ భామ ఎక్కడా తగ్గడం లేదు సుమా ! జాగా చేసిన ఫోటో షూట్ మరింత కాక రేపుతోంది . బీచ్ లో ఈ భామ పెట్టిన ఫోజులు కనువిందు చేస్తున్నాయి . బుద్దిగా మడికట్టుకొని కూర్చుంటే లాభం లేదని ఫిక్స్ అయినట్లుంది అందుకే ఎంత తక్కువగా బట్టలు వేసుకుంటే అంత హాట్ ఇమేజ్ వస్తుందని ఇలా రెచ్చిపోయింది ఫాతిమా .

తా


     

స్టా

ర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ ని అరెస్ట్ చేసారు పోలీసులు . అతడి ఇంట్లో గంజాయి దొరకడంతో రోనీ ని అరెస్ట్ చేసారు , అంతేకాదు వైద్య పరీక్షలు కూడా చేసారు , రిపోర్ట్ లో గంజాయి తీసుకున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు పోలీసులు . గతకొంత కాలంగా రోనీ పై పోలీసులు నిఘా పెట్టారు , పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా రైడ్ చేయడంతో గంజాయి లభించింది . జల్ అగర్వాల్ మేనేజర్ అరెస్ట్ కావడంతో తమిళ , తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి ఉలిక్కి పడింది . ఎందుకంటే ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నలిగి పోయి ఉంది సరిగ్గా ఇదే సమయంలో కాజల్ అగర్వాల్ మేనేజర్ అరెస్ట్ సంచలనం సృష్టిస్తోంది . దీనిపై కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి .

కా

టాలీవుడ్ P 23




డ్ర

గ్స్ కంటే అవినీతి ఇంకా పెద్ద ప్రమాదకారి అని కాబట్టి అన్ని సంస్థలు కలిసి ప్రత్యేక దర్యాప్తు బృందాలు గా మారితే బాగుంటుందని అలాగే ప్రభుత్వాలు తలుచుకుంటే అది సాధ్యమేనని సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శకులు కొరటాల శివ . సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ హంగులు జోడించి సంచలన విజయాలు అందుకుంటున్న దర్శకుడు ఈ కొరటాల శివ . చేసిన మూడు చిత్రాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి .

24 P టాలీవుడ్

యితే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొరటాల శివ డ్రగ్స్ కంటే అవినీతి చాలా ప్రమాదకరమని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి . నిజమే కొరటాల అన్న దాంట్లో నిజం ఉంది సుమా ! డ్రగ్స్ ని సమర్ధించడం కాదు కానీ అవినీతి భారతదేశాన్ని సర్వ నాశనం చేస్తోంది , భావితరాల భవిష్యత్ ని ప్రశ్నార్థకంలో ముంచెత్తుతోంది .


 

టసింహం నందమూరి బాలకృష్ణ మల్టీ స్టారర్ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపాడట . అయితే ఆ సినిమా ఇప్పట్లో ఉండదు మరో ఏడాది లేదా రెండేళ్లకు ఆ సినిమా ఉంటుంది . మంచి కథ తో వస్తే చిరంజీవి తోనైనా , నాగార్జున , వెంకటేష్ లతో నటించడానికి నాకు అభ్యంతరం లేదని ఖరాఖండి గా చెప్పేసాడు బాలయ్య . అంతేకాదు యువ హీరోలతో కూడా కలిసి నటించడానికి అభ్యంతరం లేదంటున్నాడు బాలయ్య . - 80 వ దశకంలో తెలుగునాట మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువగా వచ్చేవి కానీ గత ఇరవై ఏళ్లుగా మాత్రం మల్టీ స్టారర్ చిత్రాలు తెలుగులో రావడం లేదు . అసలు సిసలైన మల్టీ స్టారర్ అంటే ఈమధ్య కాలంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం మాత్రమే ! దాని తర్వాత బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు మరి .

70

టాలీవుడ్ P 25


 అం

దమైన భామ మేఘా ఆకాష్ రామ్ సరసన నటించడానికి ఒప్పుకుంది , ఓపెనింగ్ లో కూడా పాల్గొంది కానీ తీరా షూటింగ్ సమయానికి మాత్రం డేట్స్ కేటాయించలేక నితిన్ సినిమా కోసం వెళ్లిపోవడంతో చేసేది లేక మేఘా ఆకాష్ స్థానంలో మరొక భామని ఎంచుకున్నారట . మేఘా ఆకాష్ ని తీసేసి లావణ్య త్రిపాఠి ని మరో హీరోయిన్ గా ఎంచుకున్నారు రామ్ అండ్ కో . హీరో రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం '' ఉన్నది ఒకటే జిందగీ ''. ను శైలజ వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ - కిషోర్ తిరుమల ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు లావణ్య త్రిపాఠి కూడా నటిస్తోంది . స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

నే 26 P టాలీవుడ్


సు



రేష్ యాదవల్లి ని దర్శకుడిగా తెలుగుతెరకు పరిచయం చేస్తూ శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్ . శ్రీలత నిర్మిస్తున్న చిత్రం '' సరోవరం ''. ఈ చిత్ర టీజర్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది . ఈవేడుకకు ముఖ్య అథితిగా మల్కాపురం శివకుమార్ హాజరై టీజర్ ని ఆవిష్కరించారు . ఆ సందర్బంగా చిత్ర నిర్మాత శ్రీలత మాట్లాడుతూ '' చిత్ర పరిశ్రమలో సరోవరం చిత్రం ద్వారా అడుగుపెడుతున్నాను , దర్శకులు సురేష్ యాదవల్లి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాను . టీజర్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది తప్పకుండా సినిమా హిట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు . రేష్ యాదవల్లి మాట్లాడుతూ '' నాకు ఛాన్స్ ఇచ్చి నన్ను దర్శకుడి గా మీ ముందు నిలబెట్టిన శ్రీలత గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని , సినిమా చాలా బాగా వచ్చిందని తప్పకుండా హిట్ కొడుతున్నామన్నాడు . ఈ కార్యక్రమంలో ఇంకా హీరో , హీరోయిన్ లతో పాటు పలువురు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు .

సు

టాలీవుడ్ P 27




ప వర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ లకు మొదటి సంతానం గా అకిరా నందన్ పుట్టిన విషయం తెలిసిందే . దాదాపు 14 ఏళ్ల వయసు ఉంది అకీరానందన్ కు . టీనేజ్ లో ఉన్న ఈ కుర్రాడు అప్పుడే ఆరడుగుల ఎత్తు ఉన్నాడు , దాంతో పవన్ ఫ్యాన్స్ అకిరా నందన్ ని చూసి ముచ్చట పడుతున్నారు . చిన్న పిల్లాడు అనుకుంటే త్వరగానే పెద్దవాడు అవుతున్నాడని ఇక హీరో అవడమే ఆలస్యం అని అంటున్నారు . యితే అకిరా నందన్ కు ఇప్పుడే 13 పూర్తయ్యాయి , 14 లో అడుగు పెడుతున్నాడు హీరోగా నటించాలి అంటే కనీసం ఇంకో 5 , లేదా ఆరేళ్ళు సమయం పట్టొచ్చు . అయితే ఇంతకుముందే తల్లి రేణుకా దేశాయ్ దర్శకత్వం వహించిన ఓ మరాఠీ సినిమాలో బాలనటుడి గా నటించి పవన్ ఫ్యాన్స్ ని అలరించాడు . ఇప్పటికే మెగా కుటుంబం నుండి పలువురు హీరోలు చలామణి అవుతుండగా రాబోయే కాలంలో అకిరా నందన్ కూడా హీరో గా పరిచయం కానున్నాడు .

అ 28 P టాలీవుడ్


 

డ్ర

గ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు పెద్ద ఊరట నిచ్చాడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు . హైదరాబాద్ లో డ్రగ్స్ ఇప్పుడిప్పుడే మొదలయిందని అందుకే మొగ్గ గా ఉన్నప్పుడే దాన్ని తుంచేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని , డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళని బాధితులుగా చూస్తామని , కానీ డ్రగ్స్ అమ్మిన వాళ్ళని ....... సరఫరా చేసిన వాళ్ళని వదిలేది లేదని తేల్చి పడేసాడు . యంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్నీ స్పష్టం చేయడంతో డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు . ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీ లు డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్లంతా బాధితుల జాబితాలోకి వస్తారు కాబట్టి వాళ్లపై ఎటువంటి చర్యలు ఉండవు కాబట్టి డ్రగ్స్ కేసు ముగిసినట్లే ! అని అనుకుంటున్నారు కాకపోతే కొంతకాలం ఈ విచారణ కొనసాగుతుంది .

స్వ

టాలీవుడ్ P 29


        సు

వర్ణ సుందరి మోషన్ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది . ఇటీవలే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ వన్ మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టి చిన్న చిత్రాల్లో పెను సంచలనం రేపింది . అగ్ర హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే వ్యూస్ ని సువర్ణ సుందరి మోషన్ పోస్టర్ సాధించడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు . పూర్ణ , సాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎం ఎల్ లక్ష్మి నిర్మిస్తుండగా ఎం ఎన్ ఎన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు .

కప్పటి సూపర్ హిట్ సినిమా అయిన సువర్ణ సుందరి టైటిల్ తో మళ్ళీ ఇన్నాళ్లకు వస్తున్న ఈ సినిమాపై అప్పుడే బిజినెస్ వర్గాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది . ఇద్దరు అందమైన భామలు పూర్ణ , సాక్షి చౌదరి లు '' హిస్టరీ ఆల్వేస్ హంట్స్ ఫ్యూచర్ '' అంటూ వస్తున్న ఈ సువర్ణ సుందరి ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే .

 



హేష్ బాబు తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం లోని ఒక సీన్ కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చు చేశారట ! ఇప్పుడిదే హాట్ టాపిక్ అయి కూర్చుంది . దాదాపు ఎనిమిది నిమిషాల సేపు సాగే ఒక్క సీన్ కోసం 20 కోట్లు ఖర్చు చేయాల్సి పెట్టారని తెలుస్తోంది . ఈ సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందట అందుకే అంత ఖర్చు పెట్టారని తెలుస్తోంది . హేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది ఇక విలన్ గా దర్శకులు ఎస్ జె సూర్య నటిస్తున్నాడు . సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం .

మ 30 P టాలీవుడ్


క్యా

న్సర్ తో గతకొంత కాలంగా బాధపడుతున్న నటి అల్లరి సుభాషిణి కి మరో నటి జ్యోతి 50 వేల ఆర్ధిక సహాయం అందించింది . బిగ్ బాస్ షోలో పాల్గొన్న జ్యోతి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే . అయితే ఆ షో నుండి ఎలిమినేట్ అయినప్పటికీ ,జ్యోతి కి బిగ్ బాస్ ఒప్పందం ప్రకారం పెద్ద మొత్తంలోనే డబ్బు వచ్చిందట . దాంతో కొంత సహాయం చేయాలనీ భావించింది అదే సమయంలో మా అధ్యక్షుడు శివాజీరాజా ని అడగడంతో అల్లరి సుభాషిణి కి ఎంతో కొంత ఇవ్వమని చెప్పాడట . దుకే 50 వేల రూపాయలను ఇచ్చి తన మనసు ని చాటుకుంది జ్యోతి . తెలుగులో పలు చిత్రాల్లో వ్యాంప్ పాత్రలు పోషిస్తున్న ఈ భామ బిగ్ బాస్ షోకి వెళ్లి రాగానే మరింత ఇమేజ్ వచ్చింది .

అం

 ర

చయిత , నటుడు అయిన పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేసాడు . పవన్ కళ్యాణ్ కు నేను ఓటు వేయమని , అసలు అతడికి ఓటు ఎందుకు వేయాలని ........ నా ఓటు నాఇష్టం నేను జగన్ కు మాత్రమే ఓటు వేస్తాను అవసరమైతే జగన్ పార్టీ తరుపున ప్రచారం కూడా చేస్తానని సంచలనం సృష్టించాడు పోసాని . తాజాగా ఓ టివి ఛానల్ కు పోసాని ఇంటర్వ్యూ ఇచ్చాడు . ఆ ఇంటర్వ్యూ లో భాగంగా చంద్రబాబు కు ఓటు వేయమని ,అలాగే పవన్ కళ్యాణ్ కు కూడా ఓటు వేయమని జగన్ కే నా ఓటు అంటూ బల్లగుద్ది మరీ చెప్పాడు . ద్రబాబు అనుభవజ్ఞుడే కానీ ఆ అనుభవం మేరకు అతడి పనితీరు లేదని , అలాగే పవన్ కళ్యాణ్ మంచోడు కావచ్చు కానీ అతడికి నేనేందుకు ఓటు వేయాలంటూ ఎదురు ప్రశ్న కూడా వేసాడు .

చం

 

టాలీవుడ్ P 31


 ...! బా

లనటి గా సంచలన విజయాలు అందుకుని , స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది షామిలి . ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయం అయ్యింది కానీ సినిమా సక్సెస్ కాలేదు అలాగే హీరోయిన్ గా కూడా మార్కులు తెచ్చుకోలేక పోయింది దాంతో ఇక షామిలి పని అయిపోయినట్లే అని అనుకున్నారు అంతా . కానీ షామిలి మాత్రం పట్టు వదలకుండా మళ్ళీ హీరోయిన్ గా ప్రయత్నాలు షురూ చేసింది . జాగా నాగశౌర్య సరసన ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది . హీరోయిన్ గా రీ ఎంట్రీ లో సక్సెస్ అవుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది . అపుడెపుడో 8 ఏళ్ల క్రితం తెలుగులో ''ఓయ్ '' సినిమా లో నటించింది హీరోయిన్ గా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది . ఇక ఇప్పుడేమో మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ లో సక్సెస్ అవుతుందా చూడాలి .

తా 32 P టాలీవుడ్






చ్చే ఎన్నికల్లో నా సత్తా ఏంటో చూపిస్తానని , ప్రజల్లోకి వెళితేనే ఎవరి బలం ఎంతో తెలుస్తుందని గట్టిగా సమాధానం ఇస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రభావం చూపించలేదని , 2 శాతం ఓట్లు కూడా రావని తన సర్వేలో తేలిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే . దాంతో పవన్ కళ్యాణ్ ఈ రకంగా సమాధానం చెప్పాడు . లువురు రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటికల్ లీడర్ లా వ్యవహరిస్తున్నాడు తప్ప పూర్తిగా సీరియస్ గా లేడని దాంతో అతడ్ని జనాలు అంతగా నమ్మడం కష్టమే అని అంటున్నారు . అయితే పవన్ మాత్రం అక్టోబర్ తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తానని అప్పుడు నా సత్తా ఏంటో తెలుస్తుందని అంటున్నాడు .

టాలీవుడ్ P 33






ప్రముఖ ఛానెల్లో వెన్నెల అనే పోగ్రాం ద్వారా బుల్లి తెర ప్రెక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన జ‌య‌తి మెట్టమె ‌ దటిసారిగా హీరోయిన్ గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. J9 4షోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. హార్ర‌ర్ కామెడీ లో వైవిధ్యాన్ని ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నారు. షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న‌ ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంద‌ర్బంగా నిర్మాత,‌ క‌థానాయిక జ‌య‌తి మాట్లాడుతూ... "చాలా టీవి ప్రొగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసిన అనుభవంతో మెట్టమె ‌ ద‌టిసారిగా సినిమా నిర్మాణం చేపట్టాను. అలాగే ఈ చిత్రం క‌థ న‌చ్చి నేను మెయిన్ లీడ్ లో న‌టించాను. హార్ర‌ర్ కామెడీ చిత్రాలు చాలానే వచ్చాయి. కానీ లచ్చి చిత్రం కొత్త అనుభూతిని అందిస్తుంది. వైవిధ్యమైన కథ, కథనం ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురి చేస్తుంది. ఈ చిత్రం అంతా ల‌చ్చి పాత్ర చుట్లూనే తిరుగుతుంది. అనేక మలుపులు ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాయి. ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ కడుపుబ్బా నవ్విస్తారు. అలాగే లెజెండ్ కెమెరామెన్ యం.వి. ర‌ఘు గారితో ప‌నిచేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఆయ‌న ఈచిత్రాన్ని మ‌రో మెట్టుకి తీసుకువెళ్ళారు. మాట‌లు మరుదూరి రాజా గారు అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా చిత్రాన్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాము. అని అన్నారు.

34 P టాలీవుడ్

మ‌

రో క‌థానాయిక తేజ‌శ్విని మాట్లాడుతూ.. ఈ చిత్రం నాకు డెబ్యు, ద‌ర్శ‌కడు ‌ ఈశ్వ‌ర్ గారు చాలా ఇష్ట‌ప‌డి ప్ర‌తి పాత్ర‌ని మ‌లిచారు. మెయిన్ పాత్ర‌లో చేస్తున్నాను. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు.

నటీనటులు :

హీరోయిన్ - జ‌య‌తి, తొలి పరిచయం - తేజ‌శ్విని, దిలిప్‌ ఇతర తారాగణం - చంద్ర‌మెహ‌న్,‌ పూర్ణిమ‌, శివ ప్రసాద్, రఘుబాబు, తాగుబోతు రమేష్, ధనరాజ్, షేకింగ్ శేషు, రాం ప్రసాద్ సాంకేతిక వర్గం కెమెరా- యం.వి.ర‌ఘు మాట‌లు- మ‌రుదూరి రాజా సంగీతం- సురేష్ యువ‌న్,‌ పాల్ పవన్ ఎడిట‌ర్‌- ప్ర‌భు సాహిత్యం- కందికొండ‌ ఆర్ట్ - పార్థ సారధి వ‌ర్మ‌ కొరియోగ్రఫి - బృంద, క్రిష్ణారెడ్డి, అమిత్ ద‌ర్శకు ‌ డు- ఈశ్వ‌ర్‌ నిర్మాత-‌ జ‌య‌తి




నం

ది, చల్లా క్రియేషన్స్ బ్యానర్పై కె ఎం డి రఫీ నిర్మాతగా బంగారి బాలరాజు మూవీని రూపొందిస్తున్నారు.. ఈ మూవీకి లవ్ ఈజ్ బ్యాక్ ట్యాగ్ లైన్. రైల్వేట్రాక్ అనే టెలీ ఫిల్మ్తో తొలి చిత్ర ఉత్తమ చిత్ర దర్శకుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్న కోటేంద్ర దుద్యాల ఈ మూవీకి దరకత్వంతో పాటు కథ, మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. నిర్మాతగా రఫీ నిర్మిస్తున్న ఈ తొలి చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియో లో ఇటీవల లాంచనంగా ప్రారంభమైంది.. నూతన నటీనటులతో రూపొందుతున్న ఈ మూవీకి క్లాప్ ను గాడ్ ఫాదర్ సాగర్ ఇవ్వగా, యువ హీరో నాగ అన్వేష్ కెమెరా స్వీచ్ ఆన్ చేశారు.. ఈ మూవీ స్క్రిప్ట్ ను సింధూర పువ్వు కృష్ణారెడ్డి చేతుల మీదుగా నిర్మాత రఫీ, దర్శకుడు కోటేంద్ర స్వీకరించారు.. నంతరం ఆ చిత్ర దర్శకుడు కోటేంద్ర దుద్యాల మీడియాతో మాట్లాడుతూ, . ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నానని తెలిపారు. గత పధ్నాలుగు సంవత్సరాలనుంచి ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్గా, ఆర్టిస్టుగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న తాను డైరెక్టర్గా మారడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. దర్శకుడి అవ్వాలనే తన పద్నాలుగు సంవత్సరాల కల, కసి, కష్టం ఈ రోజు నెరవేరిందని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలని అన్నారు. మొదటి వ్యక్తి వెంకీ చౌదరి, రెండవ వ్యక్తి మహ్మాద్ రఫీ అని తెలిపారు. వారి సహకారం వల్లే తాను ఈ రోజు డైరెక్టర్గా మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. ఒక చిన్న టీజర్తో..కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి హీరో, హీరోయిన్ను

పరిచయం చేయనున్నట్లు తెలిపారు. చిత్రం కథ విషయానికి వస్తే దశాబ్దాలు మారినా, శతాబ్దాలు మారినా ప్రేమ మారదని..ప్రేమికులు మాత్రమే మారుతుంటారని తెలిపారు. చరిత్రలో రోమియో-జూలియట్, సలీంఅనార్కలి, దేవదాసు-పార్వతి, లైలా-మజ్ను ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచారని ..బంగారి-బాలరాజు వారు కూడా తమ ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోతారా లేక ప్రేమను గెలిపించుకుని చరిత్ర సృష్టిస్తారా అనేదే ఈ చిత్ర కథా సారాంశం అని వివరించారు. తనతోపాటు 18మంది టీమ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారని అంటూ వారంతా టీమ్ కాదని తన కుటుంబసభ్యులు, బ్రదర్స్ అని చెప్పారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. నంతరం నిర్మాత మహ్మద్ రఫీ మాట్లాడుతూ ఈ సినిమాలో కథని ఒక లైన్ తనకు వినిపించారని, అది నచ్చే ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టానని వెల్లడించారు. ఇది ఒక మంచి లవ్స్టోరి అని తెలిపారు. స్క్రిప్ట్, దర్శకుడిపై నమ్మకంతో ఈ చిత్రం చేస్తున్నానని అన్నారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని తెలిపారు. నటీనటులు - రోహిణి , అజయ్ ఘోష్,అప్పారావు, లేఖన , ఆర్.పి , మహేంద్రనాథ్ సాంకేతిక వర్గం - సంగీతం..చిన్నికృష్ణ-చిట్టిబాబు ఎడ్డిపోగు, కెమెరా..బాబు..జి.ఎల్, ఆర్ట్..కృష్ణమాయ, ఎడిటింగ్..సాయిబాబు-హరి. కో డైరెక్టర్..హేమంత్ కుమార్,కథ,మాటలు,స్ర్కీన్ప్లే, దర్శకత్వం..కోటేంద్ర దుద్యాల, నిర్మాత..కె.ఎమ్డి.రఫి., బ్యానర్- నంది, చల్లా క్రియేషన్స్

టాలీవుడ్ P 35






హ్యా

ట్రిక్ బ్లాక్ బస్టర్స్ సక్సెస్ తో టాప్ ఫాంలో దుసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అను ఇమ్యున‌ల్ హీరోయిన్ గా వక్కంతం వంశి ద‌ర్శ‌క‌త్వం లో ఇటీవ‌లే పూజాకార్య‌క్రమాలు జ‌రుపుకున్న “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” రెగ్యుల‌ర్ ష‌షూటింగ్ ఇటీవల హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో శరత్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మించనున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్‌దక్ర‌మాలు పూర్తిచేసి 2018, ఏప్రిల్ 27 న విడుద‌ల చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నారు. సందర్భంగా చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.... .వ‌రుస‌ బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ ఫాంలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మా బ్యాన‌ర్ లో న‌టిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. రెగ్యుల‌ర్ షూటింగ్ మెద‌లుపెట్టాము. బ‌న్ని ఎన‌ర్జి కి త‌గ్గ‌ట్టుగా చేసిన‌ ఈ క‌థ లో అన్ని క‌మ‌ర్షియల్ ‌ అంశాలు వుంటాయి. అను ఇమ్యున‌ల్ హీరోయిన్ గా చేస్తుంది. టెంపర్, కిక్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించి వరస సక్సెస్ లు అందుకొని తొలిసారిగా మెగా ఫోన్ ప‌ట్టిన వక్కంతం వంశీ వర్క్ చాలా ఎన‌ర్జిగా చేస్తున్నాడు.

36 P టాలీవుడ్

నాగబాబు, బన్నీవాసు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ. ఇండియా గర్వించదగ్గ నటీనటులు, టెక్నీషియన్స్ టీంతో గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. విశాల్ శేఖర్ సూపర్ మ్యూజిక్ అందిస్తు్న్నారు. 2018 ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడ‌దుల చేస్తున్నాము. అని అన్నారు. నటీనటులు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,అను ఇమ్యున‌ల్ , యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు సాంకేతిక నిపుణులు ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి) ఫైట్స్ - రామ్ లక్ష్మణ్ సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్ సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి సంగీతం - విశాల్ - శేఖర్ ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ సమర్పణ - k.నాగబాబు సహ నిర్మాత - బన్నీ వాసు నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ




 తె

లుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో ఛాన్స్ లు రావడంలేదని బాధపడుతోంది హీరోయిన్ ఈషా రెబ్బా . అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామకు ఆ తర్వాత అంతగా బ్రేక్ రాలేదు . కొన్ని చిత్రాల్లో నటించింది కానీ సక్సెస్ దరి చేరకపోవడంతో పాపం అంతగా ఛాన్స్ లు రావడం లేదు . ఒకవేళ చిన్న చిన్న సినిమాలు వచ్చినా అవి ప్రేక్షకులకు రీచ్ కాలేక పోతుండటం తో సరైన ఛాన్స్ దొరకడం లేదని తెగ ఫీల్ అవుతోంది . టీవలే ఈ భామ నటించిన అమీతుమీ రిలీజ్ అయి మంచి పేరునే తెచ్చింది , అలాగే మాయామాల్ చిత్రంలో కూడా నటించింది . పెద్ద హీరోల సరసన నటించాలని ఆశపడుతోంది కానీ అగ్ర హీరోలు తమిళ , మలయాళ , హిందీ భామలను తెచ్చుకుంటున్నారు కానీ తెలుగువాళ్ళకు అంతగా ఛాన్స్ లు ఇవ్వడం లేదు మరి .

టాలీవుడ్ P 37


గో

పీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నంద చిత్రంలో బికినీ లో అందాలను ఆరబోసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది హాట్ భామ కేథరిన్ ట్రెసా . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు సక్సెస్ అంతగా రాలేదు , పైగా ఉన్న ఒకటి ఆరా సక్సెస్ లు సెకండ్ హీరోయిన్ గా ముద్ర వేసాయి . గౌతమ్ నంద లో కేథరిన్ తో పాటు హన్సిక కూడా నటించింది కానీ హన్సిక కంటే కేథరిన్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి . గా మరింత గ్లామర్ గా కనిపించి కుర్రాళ్ళ మనసు గెలుచుకుంది . ఇక ఒక సీన్ లో అయితే స్విమ్మింగ్ పూల్ లో అందాలను ఆరబోసి పిచ్చెక్కించింది . మామూలుగా స్విమ్ సూట్ అనగానే రకరకాలుగా బ్లర్ చేస్తారు కానీ ఈ సినిమాలో మాత్రం కేథరిన్ అందాలు ప్రేక్షకులు స్పష్టంగా చూసేలా దయచూపారు సెన్సార్ సభ్యులు . మొత్తానికి కేథరిన్ అందాలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి .

పై





38 P టాలీవుడ్


Tollywood Magazine Telugu August - 2017  

Tollywood Magazine Telugu August - 2017

Read more
Read more
Similar to
Popular now
Just for you