Tollywood Magazine Telugu March - 2015

Page 1

RNI NO: APTEL/2003/10076

MARCH 2015 VOL 12 ISSUE 3

/tollywood /tollywood

TOLLYWOOD.NET


సా

లిడ్ అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ముగ్గురు టాప్ స్టార్స్ ని పడేసింది. అవును వరుసగా ముగ్గురు పెద్ద హీరోల చిత్రాల్లో చాన్స్ లు కొట్టేసి యావత్ సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాలో అలాగే చరణ్ సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిన రకుల్ చూపు తాజాగా మహేష్ పై పడింది దాంతో మహేష్ తాజాగా నటించబోయే ''బ్రహ్మోత్సవం '' చిత్రంలో రకుల్ నే తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట . వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ కి వచ్చిన ఈ భామ ఇటీవల గోపీచంద్ తో చేసిన ''లౌక్యం '' సూపర్ హిట్ కావడంతో అగ్ర హీరోల చూపు రకుల్ పై పడింది. దాంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అయ్యింది ఈ భామ .

  



2 P టాలీవుడ్


ని

తిన్ తో 'హార్ట్ ఎటాక్ ' చిత్రంలో జతకట్టిన భామ ఆదా శర్మ తాజాగా మెగా హీరో అయిన సాయి ధరమ్ తేజ్ తో జత కట్టడానికి రెడీ అయ్యింది. పిల్లా నువ్వులేని జీవితం తో హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ''సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ''. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన బ్లాక్ బ్యూటీ రెజీనా కసండ్రా నటిస్తుండగా మరో కీలక పాత్రలో ఆదా శర్మ ని ఎంపిక చేసారు. హార్ట్ ఎటాక్ చిత్రంతో ఆకట్కు టు న్న ఈ భామ ఈ చిత్రంతో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని భావిస్తోంది.

 

    



Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MARCH 2015

టాలీవుడ్ P 3


టెంపర్ తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపుతోంది. తెలుగునాట కలెక్షన్ల సునామీ సృష్టించిన టెంపర్ ఓవర్సీస్ లో 1మిలియన్ మార్క్ ని అవలీలగా దాటేసి సరికొత్త రికార్డులను సెట్ చేయనుంది. ఎన్టీఆర్ నటించిన బాద్ షా చిత్రం కూడా ఇంతకుముందు ఓవర్సీస్ లో భారీ వసూళ్ళ ని సాధించిన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ -పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రం పై నందమూరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్కు టు న్నారు. వారి అంచనాలను నిజం చేస్తూ సూపర్ హిట్ అయ్యింది,దాంతో నందమూరి అభిమానుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

4 P టాలీవుడ్

       








p

హాట్ ఇమేజ్ కోసం హీరోయిన్ లు తహతహలాడుతుంటారు కానీ ఓ బ్లాక్ బ్యూటీ మాత్రం స్పైసీ గా ఉన్నావ్ అని కాంప్లిమెంట్ ఇస్తుంటే ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు అని అంటోంది తెలుగు భామ ఈషా . అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో తెలుగు సినీ రంగాన అడుగుపెట్టిన ఈ భామ తాజాగా బందిపోటు చిత్రంలో నటించింది. సాలిడ్ పర్సనాలిటీ తో మిసమిసలాడే అందాలతో స్పైసీ గా కనిపించే ఈ భామ నేను అలాంటి ఇమేజ్ మాత్రం కోరుకోవడం లేదు అని దీర్ఘాలు పోతోంది. కోరుకున్న వాళ్ళకు ఆ ఇమేజ్ మాత్రం వస్తుందా చెప్పండి .

టాలీవుడ్ P 5




  వ

రుస పరాజయాల తర్వాత నాని చేస్తున్న సినిమా ''ఎవడే సుబ్రహ్మణ్యం ''. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూతురు స్వప్న నిర్మించిన ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్ లో తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ ,రాజమౌళి ,కీరవాణి ,క్రిష్ ,శర్వానంద్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై ఎవడే సుబ్రహ్మణ్యం మంచి హిట్ కావాలని అభిలషించారు. నాని సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

6 P టాలీవుడ్








తాతయ్య జ్ఞాపకాలను తలచుకుంటూ కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు యువహీరో రానా. దగ్గుబాటి రామానాయుడు సంస్మరణ సభలో రానా మాట్లాడుతూ నా దేవుడు రామానాయుడు ,నాతోనే ఉన్నాడు ,నాలోనే ఉన్నాడు అంటూ తాతయ్య తో ఉన్న తన అనుబందాన్ని నెమరు వేసుకుంటూ కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు. రామానాయుడు పేరుని మనవడు రానా కి పెట్టారు. ఐతే రానా ని పూర్తి పేరుతో కాకుండా రామా లోని ''రా'' ని నాయుడు లోని ''నా'' ని కలిపి ''రానా '' గా పిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే . ఇక తెలుగు సినీ ప్రముఖులు నాయుడు గారితో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుంటూ ,తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

టాలీవుడ్ P 7


చే



-

యకూడని తప్పు చేసానని మెగా హీరో చరణ్ కుమిలిపోతున్నాడు. చరణ్ తప్పు చేయడం ఏంటి ? అసలు ఏంటా తప్పు అని ఆలోచిస్తున్నారా ? ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ''జంజీర్ ''. జంజీర్ తో యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు అమితాబ్ ,ఐతే ఇన్నాళ్ళ తర్వాత ఆ సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఒక రకంగా అనుమానంగానే ఒప్పుకున్నాడు చరణ్ . బాలీవుడ్ లో జంజీర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ చిత్రం ఘోర పరాజయం పొందడంతో చరణ్ బాధపడుతున్నాడు. ఒక గొప్ప చిత్రాన్ని రీమేక్ చేసి తప్పు చేసానని అది పెద్ద గుణపాఠం నేర్పిందని వాపోతున్నాడు.

 



తె

లుగు రాష్ట్రాలలోని రోడ్లు మనుషులను బలి తీసుకుంటూ రక్తమోడుతున్నాయి. మొన్ననే స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు స్వర్గస్తులయ్యారు అని చిత్ర పరిశ్రమ కుమిలి పోతున్న సమయంలో ఓ యువ నిర్మాత కారు యాక్సిడెంట్ లో చనిపోయారు. రాహుల్ -నీతి

8 P టాలీవుడ్



టేలర్ జంటగా ''పెళ్లి పుస్తకం '' అనే చిత్రాన్ని నిర్మించిన నాగిరెడ్డి అనంతపురం నుండి హైదరాబాద్ వస్తుండగా అప్పా జంక్షన్ వద్ద యాక్సిడెంట్ కి గురై మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటనలో దర్శకులు మదన్ క్షేమంగా బయట పడ్డాడు. నాగిరెడ్డి మృతి తో తెలుగు చిత్ర పరిశ్రమ మరో యువ నిర్మాతని పోగొట్టుకుంది.


    

క్కినేని నాగచైతన్య - కృతి సనన్ జంటగా స్వామి రారా వంటి హిట్ చిత్రాన్ని అందించిన సుదీర్ వర్మ దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ''దోచేయ్ ''. మహా శివరాత్రి ని పురస్కరించుకొని దోచేయ్ టైటిల్ లోగో రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా నిర్మాత భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ ''అత్తారింటికి దారేది '' వంటి బ్లాక్

బస్టర్ తర్వాత మా సంస్థ నుండి వస్తున్న చిత్రమిది. సుదీర్ వర్మ ఎక్ష్త్రార్డినరి గా ఈ చిత్ర కథని రూపొందించామన్నారు. మా చిత్రానికి ''దోచేయ్ ''టైటిల్ యాప్ట్ కాబట్టి ఈ టైటిల్ నే ఖరారు చేసామ్ ఇక అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి మార్చి నెలాఖరున దోచేయ్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సినిమాల్లో రకరకాల బూతు మాటలు డైలాగుల రూపంలో వస్తుంటే కొంతమందికి ఇంపుగా ఉంటుంటే మరికొంతమందికి వినడానికి కర్ణ కఠోరంగా ఉంటున్నాయి దాంతో ఆ బూతులకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన కేంద్ర సెన్సార్ బోర్డ్ ఓ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇకపై బూతు మాటలు సినిమాల్లో ఉండొద్దు అంటూ హుకుం జారీ చేసింది. ఆ మాటలేంటో ఓ లుక్కేద్దాం .







బాస్టర్డ్ సన్నాఫ్ ఎ బిచ్ మాస్టర్ బెటింగ్ ఫక్ ఫకింగ్ ఫకర్ మదర్ ఫకర్

ఫకింగ్ కంట్ కాక్ సకర్ ఫకింగ్ డిక్ స్క్రూ డిక్ యాష్ హోల్ బిచ్ పుష్

టాలీవుడ్ P 9




 ల

క్స్ పాప లక్స్ పాప అంటూ బాలయ్య తో చిందులు వేసి యావత్ తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన భామ ఆశా షైని అలియాస్ ఫ్లోరా షైని కి తాజాగా బెదిరింపులు వస్తున్నాయట !ఇటీవల ''మెసేంజర్ ఆఫ్ గాడ్ '' చిత్రంలో ఆశా షైని నటించింది. ఐతే ఆమె పోషించిన పాత్ర కొందరి మనోభావాలను కించపరిచేలా ఉండటంతో ఆమెకి బెదిరింపులు వస్తున్నాయట . ఈ విషయాన్నీ ఆశా చెబుతూ ''నేను ఒక నటిగా ఆ పాత్ర పోషించాను తప్ప ఎవరని కించపరచడానికి ఆ పాత్ర పోషించలేదు ,కాబట్టి నటీనటులను ఆ ద్రుష్టి తో చూడవద్దని కోరుకుంటున్నా'' అంటూ వేడుకుంటోంది.





టెంపర్ చిత్రాన్ని చుసిన మహేష్ బాబు ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా కావడంతో ఎన్టీఆర్ ఫాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరో చిత్రాన్ని చూడటమే కాకుండా సాటి హీరో పెర్ఫార్మెన్స్ బాగందని కితాబు ఇవ్వడం అరుదు అటువంటి సుహృద్భావ వాతావరణం తెలుగునాట ఉండటంతో మహేష్ పొగడ్తలు ఎన్టీఆర్ లో అలాగే ఎన్టీఆర్ అభిమానుల్లో సంతోషాన్ని రెట్టింపు చేసాయి. పూరి జగన్నాద్ దర్శకత్వం వహించిన టెంపర్ వసూళ్ళ లో సంచలనం సృష్టిస్తోంది.

10 P టాలీవుడ్


 

 బాలీవుడ్ భామ రిచా చద్దా కి గాయాలు అయ్యాయి. తాజాగా ఈ భామ నటిస్తున్న చిత్రం ''ఔర్ దేవదాస్ '' . సుదీర్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో స్కూటీ పై రిచా చద్దా పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది ఐతే గాయాలు పెద్దగా కాకపోవడంతో యూనిట్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. స్కూటీ డ్రైవింగ్ రిచా కి తెలియకపోవడంతో ఎలా డ్రైవ్ చేయాలో కొంత ట్రైనింగ్ అయినప్పటికీ కొద్దిగా కంగారు పడటం వల్ల స్కూటీ డ్రైవ్ చేస్తూ కింద పడిపోయింది. దాంతో కాళ్ళకి చేతులకు దెబ్బలు తగిలాయి.

టాలీవుడ్ P 11




సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సినిమా ఆలస్యం అవుతుంటే బాహుబలి కోసం ఆత్రుత గా ఎదురు చూస్తున్న ప్రేక్షకాభిమానులు మాత్రం ఏమాత్రం కోపగించు కోకుండా బాహుబలి కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు . ప్రభాస్ ,రానా ,అనుష్క ,తమన్నా లు నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ ,ప్రసాద్ నిర్మిస్తున్నారు.



బాహుబలి ఆలస్యం అవుతోంది ,ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఇంతకుముందు అనుకున్నట్లుగా ఏప్రిల్ 17న రిలీజ్ చేయడం కష్టమని భావిస్తున్నారు అందుకే మే లో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారట దర్శక నిర్మాతలు. షూటింగ్ పార్ట్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం ఆలస్యం అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు జక్కన్న . ఐతే ఏప్రిల్ లో ఆడియో రిలీజ్ చేసి మేలో

12 P టాలీవుడ్

అల్లరి నరేష్ మరో ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన బందిపోటు చిత్రం పై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేస్తూ మరోసారి నిరాశ పరిచాడు అల్లరి నరేష్. సీనియర్ హీరో ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రమైన బందిపోటు టైటిల్ తో అల్లరి నరేష్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన ఈ చిత్రం అపజయాన్ని అందించింది ఇవివి తనయులకు. కొంతకాలం గ్యాప్ తర్వాత ఇవివి బ్యానర్ పై రూపొందిన బందిపోటు ప్రేక్షకులకు పెద్ద తలపోటు తెప్పించింది. ఇకనైనా అల్లరి నరేష్ కథల ఎంపిక లో మరింత జాగ్రత్తగా ఉండకపోతే మరిన్ని అపజయాలు తప్పవు .






ప్రముఖ హాస్య నటుడు అలీ తమ్ముడు ,నటుడు ఖయ్యుం నిఖా (పెళ్లి ) ఇటీవల గుంటూరు లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ ,సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గుంటూరు కి చెందిన వ్యాపారవేత్త షేక్ నయాబ్ కమాల్ పెద్ద కుమార్తె అర్శియా కమాల్ తో ఖయ్యుం వివాహం జరిగింది. ఖయ్యుం తెలుగులో పలు చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన విషయం తెలిసిందే . ఈ వేడుకకు తెలుగు సినిరంగం నుండి అలీ , హీరో శ్రీకాంత్ ,ఎంపి మురళీమోహన్ ,అల్లరి నరేష్ ,ఆర్యన్ రాజేష్ ,తరుణ్ ,వెంకట్ ,రాజీవ్ కనకాల ,దర్శకులు కృష్ణవంశీ ,అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ,ఎంపి రాయపాటి సాంబశివరావు తదితరులు హాజరయ్యారు.

a టాలీవుడ్ P 13


ఇప్పటి వరకు నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ తో ,ఎన్టీఆర్ టెంపర్ తో బ్లాక్ బస్టర్ లను అందుకున్నారు దాంతో బ్యాలెన్స్ గా బాలయ్య మాత్రం మిగిలాడు. ఇది నందమూరి నామ సంవత్సరం అంటూ పటాస్ వేడుకలో ఎన్టీఆర్ చెప్పిన విషయం తెలిసిందే . అందుకు అనుగుణంగానే పటాస్ ,టెంపర్ చిత్రాలు రెండు కూడా హిట్ కావడంతో మార్చి నెలలో రాబోయే బాలయ్య చిత్రమే హిట్ కొట్టడం బ్యాలెన్స్ గా ఉంది. అబ్బాయిలు ఇద్దరూ హిట్ కొట్టారు కాబట్టి ఇక బాలయ్య కూడా హిట్ కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు నందమూరి అభిమానులు. బాలయ్య నటిస్తున్న లయన్ సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు.

 

 



పి

నాకిన్ ఆర్ట్స్ బ్యానర్ పై, శ్రీమతి పద్మలత సమర్పణలో, రామ్ దివ్యేష్, స్పందన అల్లూరి, ప్రధాన పాత్రధారులుగా, మోహన్ నిమ్మకాయల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం"చేజ్"(CHASE). ఈ చిత్రం ప్రస్తుతం పొస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. పొస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత మోహన్ నిమ్మకాయల మాట్లాడుతూ; పొస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. వారం రోజుల్లో తొలి కాపి సిద్ధమవుతుంది. మార్చి ప్రధమార్ధంలో సినిమాని

14 P టాలీవుడ్

రెలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము.ఈ సినిమా ద్వారా కధానాయకుడుగా పరిచయమౌతున్న రామ్ దివ్యేష్ మంచి నటనను కనపరిచాడు."చేజ్" సినిమాని మొత్తం అమెరికాలోని అందమైన ప్రదేశాలలో చిత్రికరించటం జరిగింది. సంగీత దర్శకుడు శంకర్ తమిరి సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు ఇటివల ఆదిత్య మ్యూజిక్ ద్వారా మర్కెట్‌లో రిలీజై మంచి రెస్పాన్స్‌ను సోంతం చేసుకున్నాయి. ఇంకా ఈ చిత్రంలో నిశాంత్, లోకనాథ్ పరవస్తు, హరి రామ్, పిల్ అవ్డా, టాం హెన్రి,Chris గిల్మోరే తదితరులు ముఖ్యపాత్రలను పొషించారు అని అన్నారు.


  

కింగ్ నాగార్జున -కార్తీ ల మల్టీ స్టారర్ కాంబినేషన్ లో ద్విభాషా చిత్రం ఇటీవల ప్రారంభమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తోంది. తెలుగు ,తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ హైదరాబాద్ లో ప్రారంభం కాగా ఈ నెలాఖరున చెన్నై లో తమిళ వెర్షన్ ప్రారంభం కానుంది. కాగా ఈ రెండు భాషల్లో నాగార్జు న -కార్తీ లు నటించనున్నారు. మల్టీ స్టారర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేసారు నాగార్జున.

టాలీవుడ్ P 15


 

యాభై ఏళ్ల తన సినీ ప్రస్థానంలో ఎందరికో సినీ రంగంలో జీవితాలను ప్రసాదించిన రామానాయుడు పరిపూర్ణ జీవితాన్ని అనుభవించినప్పటికీ ,తీరని కొన్ని కోరికలు అలానే ఉండిపోయాయి. ఐతే వాటిలో కొన్ని పక్కన పెడితే అసలైన కోరిక మాత్రం దర్శకత్వం చేయాలనేది నాయుడు కోరిక ఎప్పటికైనా కనీసం ఒక చిత్రానికైనా దర్శక త్వం వహిస్తానని ఆశించేవాడు నాయుడు. కానీ ఆ కోరిక తీరకుండానే తనువు చాలించారు. ఈ కోరికతో పాటు తన మనవళ్ళు అయిన రానా ,నాగచైతన్య ,అలాగే తన యుడు వెంకటేష్ తో కలిసి ఓ సినిమాలో నటించాలని ఆశపడ్డారు కానీ ఆ కోరిక కూడా తీరకుండానేపోయారు అంటూ కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు రామానాయుడు స్టూడియో సిబ్బంది. టెంపర్ సక్సెస్ తో అభిమానుల కళ్ళలో ఆనందం చూస్తున్నానని ,వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారని అలాగే ఈ చిత్రం నాపై మరింత బాధ్యత ని పెట్టిందని అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన టెంపర్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ టెంపర్ సక్సెస్ తో సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా విజయం నా ఒక్కడి వల్ల సాధ్యం కాలేదని ఇది సమిష్టి కృషి ,టెంపర్ సినిమా హిట్ కావాలని ప్రతీ ఒక్కరు కోరుకున్నారు అంతే బాధ్యతగా పనిచేసారు అందరి కృషి వల్లే ఈ విజయం వరించిందని ,నాకు కలెక్షన్లు ముఖ్యం కాదని అభిమానుల సంతోషమే ముఖ్యమని అన్నారు ఎన్టీఆర్ .

 16 P టాలీవుడ్




పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు నోరు విప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో స్పెషల్ స్టేటస్ ఇస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం మాట ఇవ్వగా దానికి అప్పటి ప్రతిపక్షం ,నేటి అధికార పక్షం అయిన బిజెపి కూడా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే . ఐతే అప్పుడు ఇచ్చిన హామీ ని ఇప్పుడు నిలబెట్టుకునే సమయం ఆసన్నం అయ్యిందని ట్విట్టర్ కెక్కాడు పవన్ కళ్యాణ్ . జనసేన అధినేత గా ప్రశ్నించడానికి వస్తున్నా అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇన్నాళ్ళు మౌనంగా ఉండి ఎట్టకేలకు తన మౌనానికి ముగింపు పలికి హెచ్చరించడం మొదలు పెట్టాడు. ఐతే బిజెపి పై నాకు ఇంకా నమ్మకం ఉందని తప్పకుండా మాట నిలబెట్టుకుంటా రనే నమ్మకం ఉందన్నారు పవన్ . రైతుల కంట కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందని అన్నారు పవన్ .

 

 టాలీవుడ్ P 17


   సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ఏకధాటిగా జరుగుతుంది. ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ను ఉగాది కానుకగా (మార్చ్ 21) విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోలాచ్చి లో జరుగుతుంది. ఆ తరువాత ఫ్రాన్స్ లో షూటింగ్ జరపనున్నారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ , జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ని ఖరారు చేసారు దర్శకులు కొరటాల శివ. అందాల బొద్దుగుమ్మ హన్సిక యూరప్ ట్రిప్ లో ఉంది . అక్కడ ఈ భామ డాల్ఫిన్ కు ముద్దులు ఇస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈమధ్య వరుసగా చిత్రాల్లో నటిస్తూ తెగ బిజీ గా ఉన్న ఈ భామ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని భావించి సినిమాలకు దాదాపు 5నెలలు గ్యాప్ ఇచ్చింది . ఈ ఇదు నెలలు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ యూరప్ లో అలాగే తనకు నచ్చిన ప్రదేశాల్లో సేద తీరాలని నిర్ణయించుకుంది. చుట్టుపక్కల పరిసరాలను మర్చిపోయి డాల్ఫిన్ లతో ఆటాడుతూ వాటికీ ముద్దులు పెడుతూ ఎంజాయ్ చేస్తోంది ఈ బొద్దుగుమ్మ .

18 P టాలీవుడ్

 బొద్దుగుమ్మ




 

   

కైపెక్కించే అందాలతో యువత మతి పోగోడుతున్న పాకిస్తాన్ నటి వీణా మాలిక్ తాజాగా ''రెడ్ మిర్చి ''గా రసిక ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. కన్నడంలో ఘనవిజయం సాధించిన 'సిల్క్ 'చిత్రాన్ని తెలుగులో ''రెడ్ మిర్చి ''పేరుతో అనువాదం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉదారంగా అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు కనువిందు చేయనుందట వీణా మాలిక్. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ కాక రేపుతున్నాయి. త్వరలోనే రెడ్ మిర్చి ఆడియో ని రిలీజ్ చేసి మార్చిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాత కరణ్ .


 




సి

నిమా అంటే ఆయనకు ఇష్టం .... కాదు ప్రేమ .... కానే కాదు వ్యసనం ... అవును సినిమా అంటే ఆయనకు ఓ వ్యసనం గా మార్చుకున్నాడు. సినిమా తోనే ఆయన జీవిత ప్రస్థానం సాగింది. నిర్మాతకు అసలైన నిర్వచనాన్ని అందించిన వ్యక్తి రామానాయుడు. ఓ సాధారణ రైతు కుటుంబం నుండి ప్రారంబం అయిన ఆయన ప్రయాణం మూవీ మొఘల్ ... గిన్నిస్ రికార్డ్ హోల్డర్ ... దాదా సాహెబ్ ఫాల్కే ...వరకు సాగింది. 150 కి పైగా సినిమాలు ఇండియాలోని 13 భాషల్లో తీసిన గొప్ప నిర్మాత . తెలుగువాడి ఉన్నతిని నిలబెట్టిన ఘనత ఆయనది. 1936 లో ప్రకాశం జిల్లా కారంచేడు లో దగ్గుబాటి వెంకటేశ్వర్లు , లక్ష్మి దేవమ్మ లకు జన్మించారు. తండ్రి వ్యవసాయ దారుడు. రామానాయుడు చిన్నప్పుడు సొంత ఊరిలోనే చదువుకున్నారు. ఆ తరువాత మద్రాస్ లోని లయోలా కాలేజ్ లో చేరారు. ఆయనకు మొదటినుండి కళల పట్ల ఎక్కువ ఆసక్తి చదువుపై పెద్దగా శ్రద్ధ లేకపోవడం తో కాలేజికి స్వస్తి చెప్పారు. ఆ తరువాత వ్యాపారం చేయాలనే ఆలోచనతో కారంచెడు లోనే రైస్ మిల్లు వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ తరువాత్ కొంతమంది మిత్రులతో కలిసి డిస్ట్రిబ్యూషన్ లోకి అడుగుపెట్టారు. అలా ఆయన జీవితం సినిమా రంగం లోకి ఎంటర్ అయ్యింది. ఆ తరువాత ఆయన అక్కినేని నాగేశ్వరావు తో చాలా సన్నిహిత సంబందాలు కొనసాగించారు. ఆ తరువాత ఎస్వి రంగారావు , ఆదుర్తి , గుమ్మడి వంటి వారితో పరిచయం అయ్యింది. ఈ పరిచయాలతో నమ్మినబంటు అనే సినిమా లో నటించే అవకాశం కుడా వచ్చింది. ఆ తరువాత చాలా వ్యాపారాలు చేసారు. ఆ తరువాత రామినీడు దర్శకత్వం లో అనురాగం అనే చిత్రాన్ని నిర్మించాడు. అది కొందరి మిత్రుల సహకారం తో. ఆ తరువాత సొంతంగా తన పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరుపై సురేష్ ప్రొడక్షన్ సంస్థ ను స్తాపించి 1964 లో యన్టీఆర్ ద్విపాత్రాభినయం తో రాముడు - భీముడు చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా ఘనవిజయం సాదించింది. ఆ తరువాత మరి కొన్ని సినిమాలు నిర్మించారు కాని అవి మరింత ఎక్కువ నష్టాలను తెచ్చిపెట్టాయి. ఆ తరువాత తాడో పేడో తేల్చుకోవాలనే ఉద్దేశం తో 1971 లో ప్రేమనగర్ చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రం సంచలన విజయం సాదించింది. ఆ సినిమా హిట్ కాకుంటే మళ్ళీ సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఆయన. కాని ఆ సినిమా సంచలన విజయం సాదించడం తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తిరుపతి వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టారేట్ ప్రధానం చేసింది. 2009 లో దాదా సహెభ్ ఫాల్కే అవార్డు వరించింది. 2013లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు తో భారత ప్రభుత్వం సత్కరించింది. ఎన్నో అవార్డులు , రివార్డులు అందుకున్నారు . తెలుగు తెరకు ఎంతో మంది కొత్త వారిని పరిచయం చేసారు. మరో వైపు రాజకీయంగా కుడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతె కాకుండా సామజిక సేవ కార్యక్రమాలెన్నో ఆయన చేసేవారు. సినిమా రంగం లో సంపాదించినా ప్రతి పైసా ను సినిమా రంగం కోసమే ఉపయోగించే వ్యక్తి రామానాయుడు. సినిమా పరిశ్రమకు స్టూడియో లు , ల్యాబ్ , ఫిలిం స్కూల్ వంటి ఎన్నో సంస్తలను అందించారు. నిజంగా అయన లేని లోటు ఎప్పటికి తీరనిది... తెలుగు తెరపై చెరగని ముద్ర వేసి మూవీ మొఘల్ గా ఖ్యాతి నార్జించారు.




మరియన్ శోభారాణి విజయం పై ధీమాగా ఉన్న

స్వీఆర్ మీడియా పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత శోభారాణి తాజాగా ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రం ''మరియన్ '' ని తెలుగులో అదే పేరుతో డబ్ చేస్తున్నారు . భరత్ బాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రవిచంద్రన్ భారీ ఎత్తున నిర్మించారు. ధనుష్ సరసన పార్వతి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగులో ఎస్వీఆర్ మీడియా అధినేత్రి శోభారాణి అందిస్తున్నారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ధనుష్ సినిమాలన్నీ వరుస విజయాలు సాధిస్తున్నాయని అలాగే మా మరియన్ కూడా విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నారు శోభారాణి .

22 P టాలీవుడ్




 

సాధారంగా మనం డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అనే మాటా సినిమా పరిశ్రమలో సాధారణంగా వింటున్నాం. ఈ అమ్మడి విషయం లో కుడా ఒక వేల హీరోయిన్ కాకుంటే ఏమయ్యేదానివి అని అడిగితె పాప్ స్టార్ అయ్యేదాన్ని అని టక్కున చెబుతుంది ఈ హాట్ భామ శ్రద్ధ కపూర్. ఆశికి 2 సినిమాతో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ అమ్మడు. అటు గ్లామర్ లోను ఇటు నటనలోను తనకు తానె సాటి అని ప్రూవ్ చేసుకుంటుంది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ త్వరలోనే ఓ తమిళ సినిమాలో కుడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. ఆమెకు పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్ అంటే బాగా ఇష్టమట , అంతే కాదు త్వరలోనే ఫాషన్ రంగం లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇమారా పేరుతో ఓ ఫాషన్ షాప్ ను కుడా ప్రారంబిస్తుంది శ్రద్దా .

టాలీవుడ్ P 23


 

న్నడ స్టార్ హీరో ఉపేంద్ర బార్య ప్రియాంక గుర్తుందా ? ఆ మద్య ఉపేంద్ర తో హెచ్ టు ఓ (H2O) అనే సినిమాలో నటించిన ప్రియాంక ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కుడా అయ్యింది. చాలా రోజుల తరువాత ప్రియాంక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం కన్నడలో ప్రియాంక అనే పేరుతో ఓ థ్రిల్లర్ సినిమా రూపొందనుంది ఆ సినిమాలో లీడ్ రోల్ లో ఈ భామ నటిస్తుందట ! నా భర్త ఉపేంద్ర కూడా సినిమాల్లో నటించేందుకు సపోర్ట్ ఇస్తున్నాడు అంటూ చెప్పింది. మరి ప్రియాంక నటించే సినిమా ఎలా ఉంటుందో చూడాలి ?



 ఇ



ప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ బాగా మారింది. నాటి తరం హీరోలు ఇంకా హీరోలుగా గానే కొనసాగారు. ఈ మద్య హీరోలు కెరీర్ ముగిసిన తరువాత నెగిటివ్ పాత్రలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఈ కోవలో హీరోలుగా మంచి క్రేజ్ తెచ్చుకుని విలన్ లుగా మారిన వారు ఉన్నారు. జగపతి బాబు, సాయి కుమార్ , వినోద్ కుమార్, ఇప్పుడు వీరికి జతగా మరో హీరో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన ఎవరో కాదు వడ్డే నవీన్. ఆ మద్య హీరోగా మంచి స్టార్ డం ను అందుకున్న ఈ హీరోకు ఈ మద్య సరైన హిట్స్ లేకపోవడం తో ఇప్పుడు విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ - మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో విలన్ గా నవీన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

24 P టాలీవుడ్




 

ఈ మద్య సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ కామన్ అయ్యాయి. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఈ ముద్దులకు క్రేజ్ కుడా అలాగే ఉంది. అయితే హీరో హీరోయిన్స్ మద్య ఈ ముద్దులు కామనే కానీ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న పాత్రల మద్య ఈ లిప్ లాక్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది? ఇంతకి విషయం ఏమిటంటే తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా రూపొందుతున్న పులి సినిమా షూటింగ్ జోరుగా జరుగుతుంది. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటిస్తుంది నాటి అందాల తార శ్రీదేవి. మహారాణి పాత్రలో ఈమె నటిస్తుంది. మహారాజ పాత్రలో కన్నడ హీరో సుదీప్ నటిస్తున్నాడు. శ్రీదేవి సుదీప్ ల మద్య ఓ ఘాటైన లిప్ లాక్ సీన్ ఉందట ? త్వరలోనే ఆ సీన్ చిత్రకరిస్తారట ! ఆ సీన్ కథ ప్రకారం చాలా అవసరమని , దానికి శ్రీదేవి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. మరి ఈ సీన్ తెరపై మరెంత కిక్ ఇస్తుందో చూడాలి ??

క్రేజీ స్టార్ రవి తేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన కిక్ పెద్ద హిట్ అవ్వడం తో ఆ సినిమాకు సీక్వెల్ గా కిక్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పెద్ద ఎన్టిఆర్ జన్మదినం మే 28 న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న సినిమా ఇది.

టాలీవుడ్ P 25






ఆనంద్ ఫేమ్ రాజా హీరోగా ఈ మద్య బాగా వెనకపడ్డాడు. ఇటివలే అయన హీరోగా నటించిన నమస్తే సినిమా నమస్తే అంటూ వెళ్ళిపోయింది. హీరో రాజ గత ఏప్రిల్ లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నై కు చెందిన అమృత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇటివలే రాజాకు అమ్మాయి జన్మించింది. ప్రస్తుతం తల్లి , శిశువు క్షేమంగా ఉన్నారు.







టెంపర్ చిత్రం హిట్ కాకుంటే సినిమాలు మానేద్దామని అనుకున్నానని ,ఇక టెన్షన్ పడలేనని దానివల్ల అనారోగ్యం తో పోయేదాని కంటే బ్రతికుంటే చాలు అని అనుకున్నా నని అన్నాడు నిర్మాత బండ్ల గణేష్. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన టెంపర్ సక్సెస్ మీట్ లో పై విధంగా స్పందించాడు బండ్ల గణేష్. టెంపర్ చిత్ర నిర్మాణ సమయంలో రకరకాల వివాదాలు వచ్చాయి దానివల్ల బండ్ల గణేష్ చిత్ర నిర్మాణం నుండి తప్పుకున్నాడు ఎన్టీఆర్ ,పూరి లే ఆ చిత్రాన్ని పూర్తి చేయను న్నారు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . టెంపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి ఇకనుండి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తానని ,కొత్త దర్శకులకు అవకాశం ఇస్తానని చెప్పాడు బండ్ల .

26 P టాలీవుడ్


ప్రస్తుతం బాహుబలి సినిమా పూర్తయ్యింది. ఈ సినిమా మే లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా తరువాత ప్రబాస్ తన స్పీడ్ పెంచినట్టే ఉన్నాడు. ఇప్పటికే అయన సుజీత్ దర్శకత్వం లో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ? ఆ మద్య ప్రభాస్ కు మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు దశరధ్ చెప్పిన కథ బాగా నచ్చడం తో ప్రభాస్ ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

 





నిఖిల్ ఈ మద్య వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. ఆచి .. తూచి సినిమాలు ఎంచుకుంటూ మంచి హిట్స్ కొట్టాడు. ఇప్పటికే రెండు వరుస హిట్స్ తో జోరు మీదున్న నిఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం సూర్య V/S సూర్య . ఈ చిత్రం మార్చి 5 న విడుదలైంది. వరుస సక్సెస్ లతో ఈ సినిమా కు క్రేజీ బిజినెస్ జరిగిందని తెలిసింది. రెండు చిత్రాల విజయం ఈ సినిమాకు బాగా ఉపయోగ పడిందని. ఈ సినిమా హక్కులను హాట్ కేక్ లా కొన్నారని, విడుదలకు ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ దక్కినట్టు తెలుస్తోంది. ఇంకా సాటిలైట్ హక్కులు కుడా క్రేజీ ఆఫర్ లో అమ్ముడు పోయేలా ఉన్నాయని సమాచారం. మరి ఈ సినిమా హిట్ అయితే ఇంకా నిఖిల్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం ... ఏమంటారు?

టాలీవుడ్ P 27


హీరోగా మరో వారసుడు

వస్తున్నాడు

50

80వ దశకంలో తనదైన శైలి కలిగిన హాస్య చిత్రాలను చేస్తూ సరికొత్త ఒరవడి సృష్టించిన హీరో నటకిరీటి రాజేంద్రప్రసాద్ అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇక సినిమా రంగానికి వస్తే సినిమా రంగం మొత్తం వారసుల రాజ్యాంగ ఉన్న విషయం కూడా విదితమే . కాగా తాజాగా ఆ వారసుల జాబితాలో మరో వారసుడు రాబోతున్నాడు . హాస్య చిత్రాలకు సరికొత్త ఒరవడి సృష్టించిన రాజేంద్రప్రసాద్ తనయుడు ''బాలాజీ ప్రసాద్ ''హీరోగా పరిచయం కానున్నాడు. అతని రంగ ప్రవేశానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై సినిమా రూపొందనుందని తెలుస్తోంది. మరి బాలాజీ ప్రసాద్ తన తండ్రి లాగా హాస్య చిత్రాలను ఎన్నుకుంటారా లేక యాక్షన్ చిత్రాల వైపు మల్లుతారా చూడాలి .

  

 తమిళనాట ధనుష్ వీరవిహారం చేస్తున్నాడు. కేవి ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ నటించిన అనేగన్ ఈనెల 13న విడుదలై వసూళ్ళ సునామీ ని సృష్టిస్తోంది. కేవలం పదిరోజుల్లోనే 50కోట్లను వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ధనుష్ నాలుగు విభిన్న పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 5 న తెలుగులో ''అనేకుడు ''గా రానుంది. రఘువరన్ బిటెక్ చిత్రం తో వరుస విజయాలు సాధిస్తున్న ధనుష్ చాలా సంతోషంగా ఉన్నాడు ఈ విజయాల పట్ల .

28 P టాలీవుడ్




సో

షియో ఫాంటసీ నేపథ్యానికి వినోదాన్ని మేళవించి ''లిటిల్ డ్రాగన్ ''అనే 2డి యానిమేషన్ చిత్రాన్ని ఎన్నో వ్యవ ప్రయాసాల కోర్చి రూపొందించారు గోలి శ్యామల . ఈ లిటిల్ డ్రాగన్ చిత్ర ట్రైలర్ ఇటీవల హైదరాబాద్ లోని తెలుగులలితకళాతోరణం లో జరిగింది. ఈ వేడుకకి తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. టీజర్ ని అలాగే పాటలను తెలంగాణ కు చెందిన ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు ,తలసాని శ్రీనివాస్ యాదవ్ ,మహేందర్ రెడ్డి ,దిల్హి లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి ఆవిష్కరించారు. యానిమేషన్ చిత్రాలకు మా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారా లను అందిస్తుందని అన్నారు. లిటిల్ డ్రాగన్ చిత్రాన్ని రూపొందించిన గోలి శ్యామల మాట్లాడుతూ ''జపాన్ ,ఇండియా సంప్రదాయాల నేపథ్యంలో ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించానని ,ఇది వినోదాత్మకంగా రూపొందిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు అవసరాల శ్రీనివాస్ ,బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టాలీవుడ్ P 29


పోటీ పడుతున్న

రాజేంద్రప్రసాద్ మూ

వీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 29న జరుగనున్న నేపథ్యంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ అధ్యక్ష్య పదవికి పోటీ పడుతున్నాడు . ప్రస్తుతం అధ్యక్షుడి గా ఉన్న మురళీమోహన్ రాజమండ్రి పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇక మురళీమోహన్ ఆ పదవికి పోటీ పడటం లేదు . మా అధ్యక్షుడి గా ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా ప్లాన్ చేస్తున్నానని ఒకవేళ అది సాధ్యం కాకపోతే నేను ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అన్నారు రాజేంద్రప్రసాద్ .





30 P టాలీవుడ్

సినిమా టైటిల్ ఏమో ''ఆంధ్రా పోరి '' కానీ డీసెంట్ ఫిలిం ఇది ఇందులో ముద్దులు ,కౌగిలింతలు అంటూ ఏమి ఉండవు అని అంటున్నాడు హీరో పూరి ఆకాష్ . కన్నడంలో హిట్ అయిన ''టైం పాస్ ''చిత్రాన్ని తెలుగులో ఆంధ్రా పోరి పేరుతో నిర్మిస్తున్నారు. పూరి ఆకాష్ హీరో కాగా ఉల్కా గుప్తా హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే ఆంధ్రా పోరి టైటిల్ దానికి తోడూ టీనేజ్ స్టొరీ అనగానే సినిమా నిండా కావలసినన్ని ముద్దులు ,కౌగిలింతలు ఉంటాయని అనుకుంటున్నారేమో అటువంటి వేమీ లేవు ఈ చిత్రంలో అని చప్పున నీళ్ళు చల్లాడు ఆకాష్ .




 ని  మెగా వారసుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరో మెటీరియల్ అనిపించుకున్నప్పటికి ముకుంద హిట్ కాకపోవడంతో కాస్త నిరాశగానే ఉన్నారు మెగా అభిమానులు. ఐతే త్వరలోనే బ్లాక్ బ్యూటీ రెజీనా తో కలిసి జత కట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా విషయాన్నీ పక్కన పెడితే తాజాగా ఓ మేగజైన్ కోసం వరుణ్ -రెజీనా లు కలిసి ఫోటో షూట్ చేసి మెగా అభిమానులకు మంచి జోష్ ఇచ్చారు. ఈ ఫోటో షూట్ లో వరుణ్ -రెజీనా ల జోడి బాగుందని ,ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఇక ఈ ఫోటో షూట్ లో వరుణ్ టై ని పట్టి లాగుతూ కుర్రకారుకి కిక్ ఇచ్చింది రెజీనా.

టాలీవుడ్ P 31


   మహేష్ బాబు బావ సుదీర్ బాబు హీరోగా నిలదొక్కుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ చేతిలో ఒక్క ''ప్రేమ కథా చిత్రమ్ '' మాత్రమే హిట్ పడింది. అంతకుముందు గాని ఆ తర్వాత చేసిన చిత్రాలు కానీ వచ్చినవి వచ్చినట్లే పోయాయి. ఇక మహేష్ తన బావ ని హీరోగా నిలబెట్టడానికి చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న విషయం కూడా తెలిసిందే . తాజాగా సుదీర్ నటించిన చిత్రం ''కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ '' . ఈ చిత్రాన్ని మార్చి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుదీర్ సరసన నందిత నటించడంతో సెంటిమెంట్ గా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నారు. సెంటిమెంట్ ఫలించి సినిమా హిట్ అయి హీరోగా నిలదొక్కుకుంటాడా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే .



    

32 P టాలీవుడ్

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు కొచ్చాడైయాన్ దర్శకురాలు సౌందర్య సీమంతం ఇటీవల చెన్నై లోని రజనీకాంత్ ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. 2010లో సౌందర్య వివాహం వ్యాపారవేత్త అశ్విన్ తో జరిగినప్పటికీ కుటుంబ నియంత్రణ పాటిస్తూ పిల్లలు ఇప్పుడే వద్దని అనుకోవడం వల్ల ఇన్నాళ్ళు తల్లి కావడానికి ఆలస్యం అయిందట . ఐతే రజనీకి మాత్రం తను తాతయ్య కావాలని పోరు పెడుతుండటంతో తప్పలేక తల్లిగా మారింది సౌందర్య . కాగా సౌందర్య సీమంతం జరగడంతో రజనీ హ్యాపీ గా ఉన్నాడట .




 టా   

లీవుడ్ క్రేజీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా దాదాపు పూర్తీ కావొచ్చింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ లో మొదటి పార్ట్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అత్యంగా భారి స్తాయిలో రూపొందించిన ఈ సినిమా రెండో పార్ట్ కుడా అక్టోబర్ లో విడుదల చేస్తారట ! అయితే ఈ సినిమా తరువాత జక్కన్న నెక్స్ట్ సినిమా ఏదనే విషయం పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి మొదలైంది. అయితే రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను ఇప్పటికే ఓకే చేసారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన చర్చలు కుడా జరిగాయట ! అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఆ మద్య ఇదే బ్యానర్ లో రామ్ చరణ్ తో మగధీర చిత్రాన్ని రూపొందించి సంచలన విజయం సాదించిన విషయం తెలిసిందే . మళ్ళీ అదే స్థాయిలో ఈ సినిమా ఉండనుందట ! ఈ సినిమా 2016లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది ?

టాలీవుడ్ P 33




 ప ్ర



ముఖ ఛాయాగ్రహకులు ఏ. విన్సెంట్(86) ఫిబ్రవరి 25 ఉదయం చెన్నైలో కన్నుమూసారు. ఆయన గతకొంత కాలంగా గుండె సంబందిత వ్యాధితో బాధపడుతున్నారు. తెలుగు ,తమిళం ,మలయాళం ,హిందీ భాషల్లో పనిచేసిన లెజెండ్రీ సినిమాటోగ్రాఫర్ ఏ. విన్సెంట్ . మహామహులైన నటీనటులతో అలాగే అద్భుతమైన సాంకేతిక నిపుణులతో

కలిసి పనిచేసి అజరామరమైన చిత్రాలను అందించారు. 1928లో జన్మించిన విన్సెంట్ బ్రతుకు దెరువు సినిమాతో తన బ్రతుకు దెరువుని ప్రారంభించారు సినిమాటోగ్రాఫర్ గా . అక్కినేని నాగార్జున నటించిన ''అన్నమయ్య '' కెమెరామెన్ గా ఏ విన్సెంట్ చివరి చిత్రం . కాగా ఏ. విన్సెంట్ అకాల మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

50 

34 P టాలీవుడ్

తెలుగులో పెద్దగా ఆదరించని మన తెలుగమ్మాయి తమిళనాట మాత్రం బాగానే కుమ్మేస్తోంది. వరుసగా నటించిన చిత్రాలన్నీ బాగా ఆడటంతో ఇప్పుడు మన తెలుగమ్మాయి శ్రీ దివ్య బాగా డిమాండ్ చేస్తోంది. పైగా చిన్న హీరోల సరసన నటించడానికి నిరాకరిస్తోంది కూడా . పెద్ద హీరోల చిత్రాల కోసం ఎదురు చూస్తోంది. ఒకవేళ ఎవరైనా మీ డేట్స్ కావాల్సిందే అని గట్టిగా పట్టుబడితే మాత్రం 50 లక్షలు ఇవ్వండి డేట్స్ తీసుకోండి అంటూ తన ఎమౌంట్ ని చెప్పి కళ్ళు బైర్లు కమ్మెలా చేస్తోందట . మొత్తానికి తెలుగునాట నిరాదరణకు నోచుకున్నా తమిళనాట మన తెలుగమ్మాయి కి మంచి డిమాండ్ ఉండటంతో మనవాళ్ళు సంతోషంగానే ఉన్నారు.


నేను కాలేజీ కి వెళుతున్న రోజుల్లో ఇద్దరు యువకులతో ప్రేమ పేరుతో ఆటాడుకున్నానని ,ఇప్పుడు నాతో ఎవరైనా ప్రేమ పేరుతో ఆడుకుంటే మాత్రం భరించలేనని సుద్దులు చెబుతోంది కుర్రకారు గుండెల్లో మంటలు పెడుతున్న భామ ఆలియా భట్. కాలేజీ లో ఓ కుర్రాన్ని నేనే ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డానని,నావెంట తిప్పుకొని ఆ తర్వాత బ్రేకప్ చెప్పానని ,అలాగే కొద్ది రోజులకు మరో యువకుడిని కూడా అలాగే చేసానని కానీ ఇప్పుడు నాకు కూడా ఇలాగే జరుగుతుందేమో నని భయంగా ఉందని అంటోంది. ఇద్దరు యువకుల జీవితాలతో ఆటాడుకున్న ఆలియా తాజాగా వెండితెర పై అందాలను ఆరబోస్తూ లక్షలాది మంది కుర్రాళ్ళను పిచ్చేక్కిస్తుంది . కాగా తను మాత్రం ప్రేమలో మోస పోతే మాత్రం తట్టుకోలేనని అంటోంది .







టాలీవుడ్ P 35


 

కేరళ కుట్టి నిత్య మీనన్ ది ప్రత్యేకమైన శైలి అన్న విషయం అందరికీ తెలిసిందే .ఇన్నాళ్ళు పెద్ద హీరోల చిత్రాల్లో నటించని నిత్య తాజాగా అల్లు అర్జున్ చిత్రంలో నటి స్తోంది . ఐతే ఆ చిత్రంలో కథానాయికగా కాకుండా ఓ కీలక పాత్రలో నటిస్తోందట ! దాంతో త్వరలోనే బన్నీ తో హీరోయిన్ గా కూడా చేస్తానని అలాగే నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ఆయన తో నటించే చాన్స్ వస్తే వదులుకోనని అంటోంది. నిత్య కోరిక బాగానే ఉంది కానీ మరి పవన్ ఎప్పుడు ఏ చిత్రంలో అవకాశం ఇస్తాడో నిత్య కు చూడాలి .

36 P టాలీవుడ్




రుద్రమదేవి ట్రైలర్ అదిరిపోయిందహో

ర్శక నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిస్టాత్మకంగా భారీ ఎత్తున రూపొందిస్తున్న చిత్రం ''రుద్రమదేవి ''. తొలిసారిగా స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఫిబ్రవరి 28న రిలీజ్ అయ్యింది . ఆ ట్రైలర్ ని చూసిన వాళ్ళంతా 'రుద్రమదేవి ట్రైలర్ అదరహో ................

ప్రభాస్ కు ఈ డిసెంబర్ లో

అదరహా 'అంటూ కీర్తిస్తున్నారు. దర్శకులు గుణశేఖర్ టేకింగ్ ,అనుష్క అప్పియరెన్స్ ,అల్లు అర్జున్ ఫెరోషియస్ లుక్ వెరసి రుద్రమదేవి అదిరిపోయిందని అంటున్నారు . ఈ భారీ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు గుణ .

పెళ్లి కానుందట

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సంవత్సరం ఆఖరులో పెళ్లి కొడుకు కాబోతున్నాడు అని తెలుస్తోంది.టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అయిన ప్రభాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం . ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు గతకొంత కాలంగా ప్రభాస్ పెళ్ళికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . ఐతే ఎప్పటికప్పుడు ఆ పెళ్లి పనులు వాయిదా పడుతున్నప్పటికీ ఎట్టకేలకు బాహుబలి కూడా పూర్తి కావడంతో ఈ డిసెంబర్ లో పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకున్నారట . ఐతే పెళ్లి కూతురు ఎవరు ? ఎక్కడి ప్రాంతం ? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే .

టాలీవుడ్ P 37




 ఏ

టాలీవుడ్ P 38

క్తా కపూర్ ఈ పేరు వింటే చాలు బాలీవుడ్ లో సంచలన సినిమాలకు C/o అడ్రెస్ గా నిలిచి పోతుంది. ఆ మద్య విద్య బాలన్ తో డర్టీ పిక్చర్ తీసిన, హాట్ భామ సన్నీ తో రాగిణి ఎం ఎం ఎస్ 2 తీసిన ఆమెకే చెల్లింది. లేటెస్ట్ గా ఈ భామ మరో హాట్ సినిమాకు సన్నాహాలు ప్రారంబించింది. ఎక్ష్ ఎక్స్ ఎక్ష్ పేరుతో ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. ( త్రిబుల్ ఎక్ష్ ) హాట్ హాట్ సినిమాల పేరుతో ఈ అమ్మడు ఓ సినిమా నిర్మించాలనే ఆలోచన రావడమే లేట్ వెంటనే దానికి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది. కెన్ ఘోష్ దర్శకత్వం లో రూపొందే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పై మీరు ఓ లుక్ వేయండి ? ?


  



క్కినేని నట వారసుడు అఖిల్ ఎంట్రీ సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. వినాయక్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాతో సయేష అనే కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. అందానికి అందం మంచి నటన ఉన్న ఈ అమ్మడి పై ఇప్పటికే పలువురు యువ హీరోల కన్ను పడింది. మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే ఈ హీరోయిన్ సయేష ఇప్పటికే నాగ చైతన్య సినిమాలో నటించే విషయం ఓకే అయినట్టే ఉంది. అంతే కాదు మరో వైపు మెగా హీరోలు ఈ అమ్మాయిని తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో సయేష కోసం ట్రై చేస్తున్నట్టు తెలిసింది.



Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.